దుబాయ్ రియల్ ఎస్టేట్ లో మనోళ్లు ఇరగదీస్తున్నారట!

Update: 2020-11-15 07:00 GMT
ప్రపంచంలో ఏ దేశమైనా సరే.. భారతీయులు కనీసం ఐదారుగురు అయితే తప్పనిసరిగా ఉంటారన్న మాట వినిపిస్తూ ఉంటుంది. వీరిలో ఒక్క తెలుగోడైనా ఉంటాడన్న నానుడి కూడా పలువురు ప్రస్తావిస్తుంటారు. ఇదే విషయాన్ని నిజం చేస్తూ తాజాగా విడుదలైన ఒక నివేదిక స్పష్టం చేస్తోంది. దుబాయ్ రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టే వారిజాబితాలో భారతీయులు అగ్రస్థానంలో ఉన్నట్లుగా తాజాగా వెల్లడైన ఒక నివేదిక స్పష్టం చేస్తోంది.

గత ఏడాది దుబాయ్ రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టిన వారిలో భారతీయులు అగ్రస్థానంలో నిలిచారు. దుబాయ్ ల్యాండ్ డిపార్ట్ మెంట్ నివేదికప్రకారం మొత్తం5246 మంది భారతీయులు రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టారు. దుబాయ్ లో రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టిన వారిలోఎమిరేట్స్ వాసులు సైతం మనోళ్ల తర్వాతే అని తాజా నివేదిక స్పష్టం చేసింది.

మొదటి స్థానంలో భారతీయులు.. రెండోస్థానంలో ఎమిరేట్ వాసులు.. మూడో స్థానంలో సౌదీ పెట్టుబడిదారులు ఉంటే నాలుగో స్థానంలో చైనీయులు ఉన్ారు. తర్వాతి స్థానాల్లో బ్రిటన్ వాసులు.. పాకిస్థానీయులు.. ఈజిప్టియన్స.. జోర్డానీస్.. అమెరికన్లు.. కెనడీయులు ఉన్నట్లుగా తేల్చారు. దుబాయ్ రియల్ రంగంలో భారతీయులు ప్రముఖంగా పెట్టుబడులు పెట్టారు. గత ఏడాది ఈ రంగంలో  భారతీయులు పెట్టిన పెట్టుబడి ఎంతో తెలుసా? ఏకంగా 10.89 బిలియన్ దిర్హామ్స్ గా చెబుతున్నారు.

ఆ దేశంలోని రియల్ ఎస్టేట్ రంగంలో 2019లో జరిగిన లావాదేశాలు ఏకంగా 226 బిలియన్ దిర్హామ్స్ గా చెబుతున్నారు. రోజురోజుకి దీని విలువ పెరుగుతున్నట్లుగా చెబుతున్నారు. 2018తో పోలిస్తే ఈ ఏడాది ఈ రంగంలో 14 శాతం వృద్ధి రేటు సాధించినట్లు చెబుతున్నారు. ఇక.. ఈ రంగంలో పెట్టుబడి పెట్టే పెట్టుబడిదారుల సంఖ్య ఏడాదికేడాది పెరుగుతూనే ఉందన్న విషయాన్ని వెల్లడించారు. 2018లో 29846 మంది పెట్టుబడిదారులు రంగంలోకి దిగితే.. 2019లో దాని సంఖ్య 34వేలకు పెరగటం చూస్తే.. రానున్న రోజుల్లో మరింతగా పెరగటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News