తిరుప‌తి పోరుః బీజేపీ పాట‌కూడా కాపీయేనా..?

Update: 2021-03-30 12:03 GMT
ఎన్నిక‌ల వేళ ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించేందుకు ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తుంటాయి. ప్ర‌చారంలో భిన్న ప‌ద్ధ‌తులు అనుస‌రిస్తుంటాయి. ఇందులో ఒక‌టి పాట‌లు. ర‌చ‌యిత‌ల‌తో పాట‌లు రాయించి, వాటిని రికార్డింగ్ చేయించి, వాహ‌నాలను తిప్పుతూ మోతెక్కిస్తుంటాయి. ఇది అన్ని పార్టీలూ చేసే ప‌నే. ఇందులో త‌ప్పు కూడాలేదు. కానీ.. ఒక పార్టీ పాట‌ను కాపీ కొట్టేసి, లిరిక్స్ మార్చేసుకుంటే ఎలా ఉంటుంది?

ఇప్పుడు ఏపీలో బీజేపీ ఇదేప‌ని చేసింద‌ని వైసీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు విమ‌ర్శిస్తున్నారు. ముందుగా వైసీపీ నాయ‌కులు జ‌గ‌న్ పేరిట ఓ పాట‌ను రికార్డు చేయించారు. ‘రాయలసీమ ముద్దు బిడ్డ జగనన్న’ అంటూ సాగే పాట ఓ రేంజ్ లో ఉంది. ఆ పాట వైసీపీ శ్రేణుల్లో మ‌రింత జోష్ నింపుతోంది. జ‌నాల‌ను కూడా ఊపేస్తోంది ఆ పాట‌. అయితే.. ఇదే ట్యూన్ తో బీజేపీ వాళ్లు కూడా ఓ పాట‌ను రిలీజ్ చేశారు. ‘భరత మాత ముద్దు బిడ్డ నరేంద్రమోడీ’ అంటూ వాళ్లు క్యాసెట్ వేస్తున్నారు.

దీనిపై వైసీపీ కార్య‌క‌ర్త‌లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఏపీ బీజేపీ నేత‌లు జ‌గ‌న్ ను ఎలాగో నేరుగా ఎదుర్కోలేరు.. క‌నీసం పాట‌లు కూడా సొంతంగా క్రియేట్ చేసుకోలేరా? అని ఎద్దేవా చేస్తున్నారు. క‌నీసం పాట‌ను కూడా సొంతంగా సిద్ధం చేసుకోలేనివారు.. ఎన్నిక‌ల్లో ఏం సాధిస్తార‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

పులిని చూసిన న‌క్క వాత పెట్టుకున్న‌ట్టు వైసీపీ పాట‌ను బీజేపీ నేత‌లు కాపీ చేసుకున్నార‌ని అంటున్నారు. వాత‌లు పెట్టుకున్నంత మాత్రాన న‌క్క పులి కాలేద‌ని, అదే విధంగా పాట‌ను కాపీ కొట్టినంత మాత్రాన జ‌నాల్లో ప్రాబ‌ల్యం పెర‌గ‌ద‌ని చుర‌క‌లు వేస్తున్నారు.

వీడియో కోసం క్లిక్ చేయండి

Tags:    

Similar News