సర్వేలు ఏం చెప్పాయి.. జగన్ ఆందోళన ఎందుకు...?

Update: 2022-04-08 00:30 GMT
ఏపీలో ప్రతీ రాజకీయ పార్టీ తన సొంత సర్వేలు చేసుకుంటూ ముందుకు సాగుతోంది అన్న విషయం తెలిసిందే. టీడీపీకి అయితే అనుకూల మీడియా సర్వేలు ఎప్పటికపుడు ఇస్తూ ఇస్తూ ఉంటుంది. అలాగే టీడీపీ వేరే వేరే చానళ్ల ద్వారా సర్వేలు చేయిస్తుంది అని చెబుతారు.

ఇక అధికార వైసీపీ విషయం తీసుకుంటే పీకే టీమ్  తో జగన్ గత మూడేళ్ళుగా టచ్ లో ఉంటున్నారు. అదే విధంగా చూసుకుంటే వేరే ఏజెన్సీల ద్వారా కూడా సర్వేలు చేయించి వాటి ఫలితాలను వైసీపీ అధినాయకత్వం తెప్పించుకుంటుంది. ఇక ఈ సర్వేల విషయం ఇపుడు ఎందుకు అంటే జగన్ స్వయంగా దాన్ని ప్రస్థావించినందుకు.

ఆయన మంత్రివర్గ సమావేశంలో సర్వేల గురించి మంత్రులకు వివరించంట్లుగా చెబుతున్నారు. సర్వే ఫలితాలు చూస్తే ముఖ్యమంత్రి పనితీరు బాగుందని వచ్చిందని, అదే టైమ్ లో కొంతమంది ఎమ్మెల్యే పనితీరు సరిగ్గా లేదని, వారు ఓడిపోయే అవకాశం ఉందని వచ్చిందని చెప్పినట్లుగా తెలుస్తోంది.

మరి ఈ నంబర్ ఎంత అన్నది తెలియదు కానీ ఎమ్మెల్యేలు ఓడిపోతారు అన్న సర్వే నివేదికలు అయితే జగన్ వద్ద ఉన్నాయని అంటున్నారు. దాంతో ఆయన రేపటి గెలుపు కోసం ఇప్పటి నుంచే ఆందోళన పడుతున్నారు అని అంటున్నారు. ఇక ఓడిపోయే ఎమ్మెల్యేలను గెలిపించాల్సిన బాధ్యత మంత్రులుగా పనిచేసిన సీనియర్లు తీసుకోవాలి అని కూడా జగన్ అన్నట్లుగా చెబుతున్నారు.

దాంతోనే పార్టీ బాధ్యతలను మొత్తం మంత్రులుగా పనిచేసిన వారు మోయాల్సి ఉంటుందని జగన్ పేర్కొన్నట్లుగా చెబుతున్నారు. ఇక ఎమ్మెల్యేలు ఓడిపోతారూ అంటే ఆ జాబితాలో మంత్రులు కూడా ఉండే ఉంటారని అంటున్నారు. మొత్తానికి మూడేళ్ల పాలన తరువాత అధికార పార్టీ  ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉందన్న నివేదికలు ముఖ్యమంత్రికి చేరాయని అంటున్నారు.

దాంతోనే ఆయన యాక్షన్ ప్లాన్ ని రెడీ చేసి మరీ మంత్రులను ఫీల్డ్ లోకి పంపుతున్నారని తెలుస్తోంది. ఇక ఎమ్మెల్యేలను కూడా ఇంటింటికీ వెళ్ళమని కోరడం వెనక కూడా వారి పనితీరు పెంచుకోవాలన్న ఆదేశాలు ఉన్నాయనే అంటున్నారు. ఏది ఏమైనా జగన్ వచ్చే ఎన్నికల మీద గురి పెట్టారు.

సర్వేలు చూస్తే అధికార పార్టీకి కొంచెం వ్యతిరేకంగానే వస్తున్నాయని అంటున్నారు. దీంతో సీనియర్లు పార్టీకి, కొందరు ప్రభుత్వానికి  అన్న ఫార్ములాతో జగన్ వచ్చే ఎన్నికల మీద గురి పెట్టారు అని అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రయోగం ఎంతవరకూ ఫలిస్తుందో ఏమో.
Tags:    

Similar News