అమ్మాయిలతో బిల్ గేట్స్ ‘చిలిపి చేష్టలు’: మైక్రోసాఫ్ట్ వార్నింగ్..

Update: 2021-10-20 01:30 GMT
ప్రపంచ కుభేరుల్లో ఒకరు.. మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో బిల్ గేట్స్ అంటే తెలియని వారుండరు. నేటి విద్యార్థులకు బిల్ గేట్స అంత గొప్పవాళ్లు కావాలని టీచర్లు బోధిస్తుంటారు. అట్టడుగు స్థాయి నుంచి ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన బిల్ గేట్స్ తన మలి వయసు దశలో అనేక కష్టాలను ఎదుర్కొంటున్నారనే చెప్పొచ్చు. ఆయనపై లైంగిక ఆరోపణలు విపరీతంగా రావడం చర్చనీయాంశంగా మారుతోంది. అయితే తన సహచరిణి మెలిండా ఫ్రెంచ్ కు ఎప్పుడైతే విడాకులు ప్రకటించారో అప్పటి నుంచి బిల్ గేట్స్ పై అనేక ఆరోపణలు వస్తున్నాయి. రోజుకో ఆరోపణలతో బిల్ గేట్స్ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆయనపై ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

వాల్ స్ట్రీట్ జర్నల్ బిల్ గేట్స్ పై తాజాగా ఓ కథనం రాసింది. ఇది ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 2008లో బిల్ గేట్స్ కొంత మంది అమ్మాయిలతో చనువుగా ఉన్నారని, అందులో ఓ మిడిల్ ఏజ్ అమ్మాయికి సరసమైన వ్యాఖ్యలతో మెయిల్స్ పంపారని తెలిపింది. ఈ మెయిల్ విషయం మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్ దృష్టికి వచ్చింది. ఆ సమయంలో జనరల్ కౌన్సెల్ బ్రాడ్ స్మిత్ బిల్ గేట్స్, మరికొందరు బిల్ గేట్స్ ను వ్యక్తిగతంగా కలిశారు. ఇలాంటి వ్యవహారాలు ఇప్పటికైనా ఆపాలని, ఇంకా కొనసాగితే బాగుండదని సన్నితంగా హెచ్చరించారు.

మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్స్ ఇచ్చిన వార్నింగ్ కు బిల్ గేట్ష్ ఏం మాట్లాడలేకపోయాడు. తనకు తానే క్షమాపణ చెప్పుకున్నాడు. దీంతో బిల్ గేట్ష్ మెయిల్స్ వరకే తతంగం నడిపి ఆ తరువాత ఎటువంటి పాడు పనులు చేయలేదని వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది. అయితే 2008లో జరిగిన ఈ విషయంపై వాల్ స్ట్రీట్ జర్నల్ ఇప్పుడు ప్రచురిపంచింది. కానీ ఈ విషయంపై అటు బిల్ గేట్స్ గానీ.. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ ప్రెసిడెంట్, వైస్ చైర్మన్ బ్రాడ్ స్మిత్ ఏ విధంగా స్పందించలేదు. అయితే బిల్ గేట్స్ కార్యాలయం మాత్రం ఈ ఆరోపణలను ఖండించింది.

బిల్ గేట్స్ పై కొందరు పనిగట్టుకొని అసత్య ప్రచారం చేస్తున్నారని, పాత విషయాలను తోడుతూ ఆయనపై అభాండాలు వేస్తున్నారని పేర్కొంది. కొందరి స్వలాభం కోసమే బిల్ గేట్స పై ఇలా మాటి మాటికి ఆరోపణలు చేస్తున్నారని కార్యాలయ ప్రతినిధులు ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే బిల్ గేట్స్ పై ఇలాంటి ఆరోపణలు కొత్తేమీ కాదు. ముఖ్యంగా ఆయన అమ్మాయిలో చిలిపి చేష్టలు, వారితో సరసాలు చేస్తూ ఎక్కువగా గడపారని గతంలోనూ ఆరోపణలు వచ్చాయి.

2019లతో ఓ ఇంజినీర్ బిల్ గేట్స్ తనను శారీరకంగా వాడుకున్నాడని ఓ లేఖను బహిర్గతం చేసింది. దీంతో న్యాయ విచారణకు మైక్రోసాఫ్ట్ ఆదేశించింది. ఓ వైపు ఆ దర్యాప్తు గోప్యంగా జరుగుతుండగానే బిల్ గేట్స్ బోర్డు నుంచి బయటకు వచ్చాడు. ఈ విషయంలో ఎలాంటి సమాధానం ఇవ్వకుండా బిల్ గేట్స్ ఇలా బయటకు రావడంపై పలు అనుమానాలు రేకెత్తాయని కొందరు ఆరోపించారు. అంతేకాకుండా తనతో 27 ఏళ్లు కలిసున్న మెలిండా ఫ్రెంచ్ విడిపోవడానికి బిల్ గేట్స్ ఇలాంటి చిలిపి చేష్టలే కారణమని అంటున్నారు. అయితే వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రకారం జెఫ్రీన్ ఎప్ట్సీన్ అనే నేరస్థుడితో బిల్ గేట్స్ కు ఉన్న డీలింగ్స్ వల్లే మెలిండా విడిపోయారని తెలిపింది. వీరిద్దరు 2013 నుంచి సంబంధాలు కలిగి ఉన్నట్లు తెలిపింది. న్యూయార్క్ టైమ్స్ కూడా జెఫ్రీన్ ఎప్ట్సీన్ తో చాలా సార్లు కలుసుకున్నారని, అతడి టౌన్ హౌజ్ లోనే గేట్స్ చాలా సమయం గడిపాడని తెలిపింది.







Tags:    

Similar News