కువైట్ లో అమ్మకానికి 200 మంది ఏపీ అమ్మాయిలు?
సోషల్ మీడియా లో చురుగ్గా ఉండే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయి తాజాగా ఒక సంచలన ట్వీట్ ను పోస్టు చేశారు. కువైట్ లో 200మంది ఆంధ్ర ప్రదేశ్ అమ్మాయిలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నట్లుగా చెప్పే వీడియోను పోస్టు చేశారు. కువైట్ లో చిక్కుకున్న ఏపీ అమ్మాయిల్ని రక్షించాల్సిందిగా ఆయన కోరుతున్నారు. దీనికి సంబంధించిన ట్వీట్ ఆయన చేశారు.
అక్రమ మనుషుల రవాణాలో భాగంగా మోసపోయిన 200 మంది ఏపీ అమ్మాయిలు ఇప్పుడు కువైట్ లో నరకం చూస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. కువైట్ లోని ఇండియన్ ఎంబసీ వద్ద చిక్కుకుపోయారని.. వారిని కాపాడాలని ఆయన కోరారు. వారిని తిరిగి దేశానికి వచ్చేలా కేంద్రం చర్యలు తీసుకోవాలన్నారు. విజయసాయి పోస్టు చేసిన వీడియోలో బాధిత మహిళలు చెప్పిన దాని ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలానికి చెందిన లక్ష్మణరావు అనే వ్యక్తి అక్కడి యువతులకు మాయ మాటలు చెప్పి కువైట్ పంపిస్తున్నట్లుగా చెప్పారు.
అతడి మాటల్ని నమ్మి కువైట్ వెళ్లిన మహిళల్ని సారా అనే మహిళ రిసీవ్ చేసుకొని.. వారిని ఇతరులకు అమ్మేస్తుందని పేర్కొంది. ఇలా మోసపోయిన వారు నానా కష్టాలు పడి ఇండియన్ ఎంబసీ వద్ద కు చేరుకొని.. వేరే వారి ఫోన్ నుంచి వీడియో రికార్డు చేయటంతో వారి వెతలు బయట ప్రపంచానికి వచ్చాయి. తమ ఆరోగ్యం బాగోలేదని.. తమను ఆదుకోవాలని వారు ఏపీ సీఎం జగన్ ను కోరుతున్నారు. ఈ నేపథ్యం లో రంగంలోకి దిగిన విజయ సాయి సదరు వీడియో ను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసి.. కేంద్ర ప్రభుత్వం స్పందించాల్సిందిగా కోరుతున్నారు.