ఉప్పల్ స్టేడియంలో క్షుద్రపూజ దెబ్బ: చెన్నై ఇందుకే ఓడింది.. వైరల్ వీడియో!
క్రికెట్ అంటే ఇన్నాళ్లూ కేవలం బ్యాటు, బంతి, ఫిట్‌నెస్ అనుకున్న వాళ్లందరూ ఇప్పుడు నోరెళ్లబెట్టాల్సిన సమయం వచ్చింది.;
క్రికెట్ అంటే ఇన్నాళ్లూ కేవలం బ్యాటు, బంతి, ఫిట్‌నెస్ అనుకున్న వాళ్లందరూ ఇప్పుడు నోరెళ్లబెట్టాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే శనివారం హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన సన్ రైజర్స్ వర్సెస్ సీఎస్కే మ్యాచ్‌తో క్రికెట్ స్వరూపమే మారిపోయింది. ఇకపై కోచ్‌లు నెట్స్ ప్రాక్టీస్ బదులు.. నెమలి పింఛాలు, నిమ్మకాయలు, విభూతి పళ్లేలతో మైదానానికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అసలేం జరిగింది? నిమ్మకాయతో మంత్రం.. శివమ్ దూబే ఔట్!
సాధారణంగా స్టేడియంలో ఫ్యాన్స్ "సీఎస్కే.. సీఎస్కే.." లేదా "ఎస్ఆర్.హెచ్.. ఎస్ఆర్.హెచ్" అని అరుస్తారు. కానీ ఒక వ్యక్తి మాత్రం చేతిలో నిమ్మకాయ పట్టుకుని, కళ్లు మూసుకుని గాలిలోకి ఏదో మంత్రాలు వదులుతూ కనిపించాడు(అతను ఫన్ కోసమే చేసాడు అని క్లియర్ గా అర్ధం అవ్వుతుంది ). కట్ చేస్తే.. క్రీజులో బాదుతున్న శివం దూబే క్లీన్ బౌల్డ్! సరిగ్గా ఆ నిమ్మకాయ స్వామి గాలిలోకి “బుష్!” అని ఊదిన క్షణానికే వికెట్ ఎగిరిపోవడంతో ఇది యాదృచ్ఛికమా లేక యంత్ర-తంత్ర మాయాజాలమా అని ఫాన్స్ తలలు పట్టుకుంటున్నారు.
క్రికెట్ ప్రపంచంలో ఫన్నీ థింగ్
ఈ ఘటన తర్వాత సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. నెటిజన్లు బీసీసీఐ (బీసీసీఐ) ముందు కొన్ని వింత డిమాండ్లు ఉంచుతున్నారు. యాంటీ-బ్లాక్ మ్యాజిక్ స్క్వాడ్ ను స్టేడియంలో పెట్టాలంటున్నారు. స్టేడియంలోకి వచ్చేటప్పుడు ఫ్యాన్స్‌ను కేవలం టికెట్లే కాదు.. జేబులో నిమ్మకాయలు, మిరపకాయలు ఉన్నాయేమో కూడా తనిఖీ చేయాలి. ఒకవేళ బ్యాటర్ అవుట్ అయితే అది బంతి వల్ల అయ్యాడా లేక స్టాండ్స్‌లో కూర్చున్న ఎవరో మంత్రగాడి "బుష్" వల్ల అయ్యాడా అని థర్డ్ అంపైర్ రివ్యూ చేయాలి. ఒకవేళ అది మంత్రం అని తేలితే దాన్ని 'డెడ్ బాల్'గా ప్రకటించాలి. నేషనల్ క్రికెట్ అకాడమీ లో ఇకపై బౌలింగ్ యాక్షన్‌తో పాటు, వికెట్లు పడగొట్టే 'అఘోర స్టైల్ మంత్రాలను' కూడా కోర్సులో చేర్చాలని డిమాండ్ వినిపిస్తోంది.
ఎడిటింగ్ మాయా? ఎమోషన్ మాయా?
అయితే కొందరు లాజిక్ వెతికే మేధావులు "ఇదంతా వీడియో ఎడిటింగ్ మ్యాజిక్, వికెట్ పడిన విజువల్‌కు అతని వీడియోను సింక్ చేశారు" అని వాదిస్తున్నారు. కానీ సోషల్ మీడియా యుగంలో 'నిజం' కంటే 'నిమ్మకాయ' కే వాల్యూ ఎక్కువ! "నిజమే చెబితే అది వార్త అవుతుంది.. అదే మంత్రాన్ని జోడిస్తే అది వైరల్ అవుతుంది" అన్న సూత్రాన్ని ఈ వీడియో మరోసారి ప్రూవ్ చేసింది.
బ్యాట్స్‌మెన్ ఎంత ప్రాక్టీస్ చేసినా బౌలర్లు ఎంత వేగంగా బంతులు వేసినా.. గ్యాలరీలో కూర్చున్న ఒక నిమ్మకాయ స్వామి "బుష్" అంటే వికెట్ ఎగిరిపోతుందని నమ్మే స్థితికి మనం వచ్చేశాం. ఇది కేవలం సరదాకి చేసారని తెలుస్తుంది నవ్వుకోసం అంతే ..చాల ఫాస్ట్ గా ఈ వీడియో వైరల్ అవ్వుతుంది .