సిక్కోలు.. 'గుండ‌మ్మ క‌థ'.. అడ్డం తిరిగిందే.. !

సిక్కోలు.. శ్రీకాకుళం రాజ‌కీయాల్లో గుండ‌మ్మ‌గా పేరొందిన మాజీ ఎమ్మెల్యే, సీనియ‌ర్ మోస్ట్ రాజ‌కీయ ఫ్యామిలీ గుండ ల‌క్ష్మీ దేవి కుటుంబం.

Update: 2026-10-20 14:30 GMT

సిక్కోలు.. శ్రీకాకుళం రాజ‌కీయాల్లో గుండ‌మ్మ‌గా పేరొందిన మాజీ ఎమ్మెల్యే, సీనియ‌ర్ మోస్ట్ రాజ‌కీయ ఫ్యామిలీ గుండ ల‌క్ష్మీ దేవి కుటుంబం. ప్ర‌స్తుతం గుండ ల‌క్ష్మీదేవి రాజ‌కీయాలు యూట‌ర్న్ తీసుకునేలా ఉన్నాయ‌ని అంటున్నారు. శ్రీకాకుళం కార్పొరేష‌న్ మేయ‌ర్ ప‌ద‌విని ఆశించిన ల‌క్ష్మీదేవి.. ప్ర‌చారానికి, ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్లేందుకు కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. ఇక‌,టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు, మంత్రి లోకేష్ కు కూడా ఆమె విన్న‌పాలు స‌మ‌ర్పిం చుకున్నారు. మేయ‌ర్ సీటు ఇవ్వాల‌ని మొర‌ పెట్టుకున్నారు.

కానీ, అనూహ్యంగా శ్రీకాకుళం మేయ‌ర్ పీఠాన్ని కూట‌మి పొత్తులో భాగంగా జ‌న‌సేన‌కు కేటాయించారు. దీంతో గుండ ల‌క్ష్మీదేవి ప్ర‌య‌త్నాలు ముందుకు సాగ‌లేదు. పోనీ.. ఈ విష‌యంపై త‌న‌తో అయినా చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుని ఉంటే బాగుండేద‌న్న ఆమె మాట కూడా ప‌క్క‌న పెట్టారు. మొత్తంగా ఈ వ్య‌వ‌హారంలో అధిష్టానం తీసుకున్న నిర్ణ‌యమే ఫైన‌ల్ అన్న‌ట్టుగా నాయ‌కులు తేల్చేశారు. ఇక‌, అప్ప‌టికే మేయ‌ర్ అభ్య‌ర్థిగా తాను పోటీ చేస్తాన‌ని.. ప్ర‌చారం కూడా చేస్తానంటూ హ‌డావుడి చేసిన ల‌క్ష్మికి ఈ ప‌రిణామం శ‌రాఘాతంగా మారింది.

దీనికి తోడు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంక‌ర్‌కు.. మాజీ ఎమ్మెల్యే ల‌క్ష్మికి మ‌ధ్య రాజ‌కీయ విభేధాలు కొన‌సాగుతు న్నాయి. తాజాగా.. త‌న‌కు ఈ సీటు ఖ‌రారు కాక‌పోవ‌డానికి వెనుక ఎమ్మెల్యే చ‌క్రం తిప్పార‌ని గుండ ల‌క్ష్మీదేవి భావిస్తు న్నారు. అయితే.. ఈ విష‌యంలో త‌న ప్ర‌మేయం ఏమీ లేద‌ని. అంతా అధిష్టానం నిర్ణ‌య‌మేన‌ని శంక‌ర్ చెబుతున్నా రు. అయినా.. ల‌క్ష్మీదేవి వృద్ధురాలు అయిపోయార‌ని.. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు మ‌రింత దుమారం రేపుతున్నాయి. వాస్త‌వానికి 70 ఏళ్ల వ‌య‌సున్న ల‌క్ష్మీదేవి విష‌యంలో పార్టీకూడా ఆలోచ‌న చేస్తోంది.

చ‌క్రం తిప్పుతున్న ధ‌ర్మాన‌

ఇలా.. టీడీపీ లో నెల‌కొన్న అంత‌ర్గ‌త కుమ్ములాట‌ల‌ను చూస్తున్న మాజీ మంత్రి, వైసీపీ నేత ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు త‌న‌దైన శైలిలో పాలిటిక్స్ చేస్తున్నారు. అసంతృప్తితో ఉన్న గుండ‌మ్మ‌ను వైసీపీలోకి తీసుకు రావాల‌న్న‌ది ధ‌ర్మాన ప్లాన్‌గా ప్ర‌చారం జ‌రుగుతోంది. వాస్త‌వానికి ఇరు కుటుంబాల మ‌ధ్య ద‌శాబ్దాల నాటి వైరం ఉంది. అయిన‌ప్ప‌టికీ.. ప్ర‌స్తుతం నెల‌కొన్న ప‌రిణామాల మ‌ధ్య‌.. గుండ‌మ్మ‌ను వైసీపీలోకి తీసుకువ‌స్తే.. ఆమె సానుకూల ఓటు బ్యాంకు స‌హా.. మ‌హిళా ఓటుబ్యాంకు కూడా త‌మ‌కు ద‌క్క‌వ‌చ్చ‌ని ధ‌ర్మాన మాస్ట‌ర్ ప్లాన్ వేస్తున్నార‌ట‌. మ‌రి గుండ‌మ్మ దీనికి అంగీక‌రిస్తారా? చంద్ర‌బాబు ను కాద‌ని ఆమె బ‌య‌ట‌కు వ‌స్తారా? అనేది చూడాలి.

Tags:    

Similar News