100 కోట్ల కరోనా వ్యాక్సిన్లు ... ఇక భయం అక్కర్లేదట !

Update: 2021-10-20 05:42 GMT
గత ఏడాదికిపైగా కరోనా మహమ్మారి విజృంభించగా, ప్రస్తుతం ఆ మహమ్మారి వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కరోనా కట్టడికి తీసుకున్న చర్యల వల్ల ప్రస్తుతం పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టాయి. అయితే దేశంలో కరోనా వైరస్ ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. దీంతో దేశమంతటా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. ప్రతి ఒక్కరూ కరోనా టీకాను తీసుకునేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. దీంతో ప్రతి ఒక్కరు కూడా టీకాలు వేయించుకుంటున్నారు. నేటితో భారత్‌ లో కరోనా టీకాల డోసులు 100 కోట్లకు చేరుకోనున్నాయి. 1

30 కోట్ల భారతావనిలో ఇప్పటివరకు 70 కోట్ల మంది ప్రజలు కరోనా టీకా మొదటి డోసు, 29 కోట్ల మంది ప్రజలు సెకండ్ డోస్‌ లను వేయించుకున్నారు. జనవరి 16న కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ కరోనా టీకాలను కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. ఈ మేరకు కోవిన్ పోర్టల్‌ ను అందుబాటులోకి తెచ్చి వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేసింది కేంద్ర ప్రభుత్వం. వ్యాక్సినేషన్‌ పై ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు చేస్తూ ప్రతి ఒక్కరు వ్యాక్సిన్‌ వేసుకునేలా చర్యలు చేపట్టింది. ఇందుకు రాష్ట్రాలు కూడా వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేశాయి. డిసెంబర్ 31 లోగా అర్హులైన వారందరికీ కరోనా టీకాలను అందించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.

ఈనెల 20తో వ్యాక్సినేషన్ ప్రక్రియ 100 కోట్ల డోసులకు చేరుతుండటంతో కేంద్ర ప్రభుత్వం భారీ కార్యక్రమాలను చేపట్టేందుకు రెడీ అయిపోయింది. కాగా ప్రస్తుతంలో దేశంలో కొవాగ్జిన్, కొవిషీల్డ్, స్పుత్నిక్ వంటి కరోనా టీకాలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో ఈ టీకాలను ఉచితంగా అందిస్తుండగా, ప్రైవేట్ సెక్టారులో మాత్రం నిర్దిష్టమైన ధరలకు కరోనా వ్యాక్సిన్ అందిస్తున్నారు. దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతం చేయడంతో కరోనా కేసులు కూడా తగ్గుముఖం పట్టాయి. ఇక దాదాపు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమ వంతు పాత్ర పోషించాయి. అయితే, ఇందులో పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే చిన్న రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు వ్యాక్సినేషన్‌లో మిన్నగా ఉన్నాయి.

ప్రస్తుతం కోవిడ్‌ దేశంలో బలహీనపడిందని నిపుణులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్‌ వేసుకునేందుకు ముందుకు వస్తున్నారని, దీంతో ప్రతి ఒక్కరిలో ఇమ్యూనిటీ పవర్‌ పెరిగిందని వెల్లడిస్తున్నారు. వ్యాక్సిన్‌ వేసుకున్న కారణంగా వైరస్‌ను అడ్డుకునేందుకు రోగనిరోధక శక్తి ఎంతగానో ఉపయోగపడిందని పేర్కొంటున్నారు. దేశంలో కొత్త‌గా 14,623 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న‌ 19,446 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. 197 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 3,41,08,996 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దేశంలో 1,78,098 మంది ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో చికిత్స పొందుతున్నారు. ఇక ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 3,34,78,247 మంది కోలుకున్నారు. మొత్తం 4,52,651 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న‌ 41,36,142 క‌రోనా డోసులు వినియోగించారు. దీంతో మొత్తం వినియోగించిన క‌రోనా డోసుల సంఖ్య 99,12,82,283కు చేరింది. కేర‌ళ‌లో నిన్న 7,643 కొత్త క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. నిన్న 77 మంది మృతి చెందారు.
Tags:    

Similar News