వీసా, గ్రీన్ కార్డులపై (భారతీయులకు) యూఎస్ స్పష్టమైన హెచ్చరిక!

ఈ సమయంలో వీసా, గ్రీన్ కార్డులపై బహిరంగ నోటీసు వెలువడింది.;

Update: 2025-04-30 03:56 GMT

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచీ డొనాల్డ్ ట్రంప్.. వలసదారులపై పూర్తి దృష్టి కేంద్రీకరించిన సంగతి తెలిసిందే. హెచ్1బీ వీసాదారులకు బర్త్ రైట్ సిటిజన్ షిప్ రద్దు నుంచి, పలువురు విదేశీ విద్యార్థులను బహిష్కరించడం వరకూ ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమయంలో వీసా, గ్రీన్ కార్డులపై బహిరంగ నోటీసు వెలువడింది.

అవును... "ప్రతీ ఒక్కరూ గమనించాలి.. మీరు మన దేశంలో అతిథి అయితే అలాగే వ్యవహరించండి.. జాతీయ భద్రత, ప్రజా భద్రతా ప్రమాదాలను గుర్తించడానికి మా సోషల్ మీడియా పరిశీలన కార్యక్రమం ఎప్పటికీ ఆగదు.. మన దేశానికి, మన జీవన విధానానికి ముప్పు కలిగించే ఏదైనా ఆన్ లైన్ లో కనుగొనడానికి యూ.ఎస్.సీ.ఐ.ఎస్. నిఘా ఉంచింది".

అంటూ యునైటెడ్ స్టేట్స్ సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూ.ఎస్.సీ.ఐ.ఎస్.) వారి అధికారిక ఎక్స్ హ్యాండిల్ లో ఈ బహిరంగ హెచ్చరిక లేదా నోటీసు జారీ చేసింది. ఈ సందర్భంగా పోస్ట్ చేసిన ఫోటోలో.. "గ్రీన్ కార్డు, వీసాలు ప్రివిలైజ్ మాత్రమే తప్ప హక్కు కాదు" అని స్పష్టం చేసింది.

వాస్తవానికి ప్రతీ ఏడాది వేలాది మంది భారతీయులు ఉన్నత చదువుల కోసం, ఉద్యోగాల కోసం అమెరికాకు వలస వెళ్తారనే సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఉన్నత చదువుల కోసం లక్షలాది మంది ఎఫ్-1 విద్యార్థి వీసాలతోనూ, ఉజ్వల భవిష్యత్తు కోసం హెచ్1-బీ వర్క్ వీసాల కోసం దరఖాస్తు చేసుకుంటారనే సంగతి తెలిసిందే.

కాగా... యూదు వ్యతిరేకంగా భావించే పోస్టులు పెట్టే వ్యక్తులకు వీసాలు, నివాస అనుమతులు రద్దు చేస్తామని అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు ఈ నెల మొదట్లో ఓ ప్రకటనలో తెలిపిన సంగతి తెలిసిందే. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ పబ్లిక్ అఫైర్స్ అసిస్టెంట్ సెక్రటరీ ట్రిసియా మెక్ లాఫ్లిన్ స్పందిస్తూ.. కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా... ప్రపంచంలోని ఉగ్రవాద సానుభూతిపరులకు అమెరికాలో స్థానం లేదని.. వారిని తమ దేశంలోని అనుమతించడం లేదా నివాసం ఉండటానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించమని స్పష్టం చేశారు. విదేశాంగ మంత్రి మార్కో రూబియో మాట్లాడుతూ.. ఇప్పటివరకూ 300 మంది అంతర్జాతీయ విద్యార్థుల వీసాలను రద్దు చేశామని తెలిపారు.

Tags:    

Similar News