• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  NRI >  టెక్సాస్ లో తెలుగు...

టెక్సాస్ లో తెలుగు కంపెనీస్ మీద ఇన్వెస్టిగేషన్ : అటార్నీ జనరల్

| అమెరికాలో ఐటీ కొలువుల కోటగా పేరుగాంచిన టెక్సాస్ రాష్ట్రంలో హెచ్-1బి వీసాల దుర్వినియోగం ఉదంతం కలకలం రేపుతోంది.

By - A.N.Kumar
Update: 2026-01-29 11:30 GMT

అమెరికాలో ఐటీ కొలువుల కోటగా పేరుగాంచిన టెక్సాస్ రాష్ట్రంలో హెచ్-1బి వీసాల దుర్వినియోగం ఉదంతం కలకలం రేపుతోంది. ముఖ్యంగా భారతీయులు.. అందునా తెలుగు వారు నడుపుతున్నట్లుగా భావిస్తున్న కొన్ని కన్సల్టెన్సీలపై టెక్సాస్ అటార్నీ జనరల్ కెన్ పాక్స్టన్ విచారణకు ఆదేశించడం ప్రవాస వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది.

'గోస్ట్ ఆఫీసులు'.. నకిలీ వెబ్‌సైట్లు!

ఈ దర్యాప్తులో వెలుగుచూసిన అంశాలు విస్మయానికి గురిచేస్తున్నాయి. మూడు నార్త్ టెక్సాస్ కంపెనీలు అక్రమాలకు పాల్పడినట్లు ప్రాథమిక ఆధారాలు లభించడంతో వాటికి సివిల్ ఇన్వెస్టిగేటివ్ డిమాండ్స్ (సీఐడీస్) జారీ చేశారు. ఒక కంపెనీ తన వ్యాపార చిరునామాగా ఒక సాధారణ ఇళ్లను చూపగా, మరో కంపెనీ కనీసం నిర్మాణం కూడా పూర్తికాని భవనాన్ని వర్క్‌సైట్‌గా పేర్కొంది. వెబ్‌సైట్లలో లేని ఉత్పత్తులను, సేవలను ఉన్నట్లుగా చూపిస్తూ ఈ సంస్థలు కేవలం వీసాల స్పాన్సర్‌షిప్ కోసమే 'కాగితపు కంపెనీలను' సృష్టించాయని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.టెక్సాస్ ప్రజల ఉద్యోగ అవకాశాలను దెబ్బతీస్తూ మోసపూరిత పద్ధతులతో హెచ్-1బి ప్రోగ్రామ్‌ను అపహాస్యం చేసే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని కెన్ పాక్స్టన్ స్పష్టం చేశారు.

గవర్నర్ అబాట్ సంచలన నిర్ణయం

అటార్నీ జనరల్ విచారణకు ముందే టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ ఒక కీలక ఆదేశం జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు, పబ్లిక్ యూనివర్సిటీల్లో కొత్త హెచ్-1బి వీసా పిటిషన్లపై తక్షణ ఫ్రీజ్ నిలిపివేత విధించారు. అమెరికన్ల పన్ను డబ్బుతో నడిచే ఉద్యోగాలు ముందుగా స్థానికులకే దక్కాలన్నది ఆయన వాదన.

ట్రంప్ సంస్కరణల సెగ

ఇప్పటికే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన కఠిన నిబంధనలు ఐటీ రంగాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దరఖాస్తు రుసుమును ఏకంగా 1 లక్ష డాలర్లకు పెంచడం.. కేవలం లాటరీ ద్వారా కాకుండా అత్యధిక జీతాలు ఇచ్చే కంపెనీలకే వీసాలు దక్కేలా నిబంధనలు మార్చడం వీసాదారులకు పెను భారమవుతోంది.

నిపుణుల ఆందోళన

ఒకవైపు మోసపూరిత కంపెనీల ఏరివేత మంచిదే అయినప్పటికీ, కఠినతరమైన నిబంధనలు.. ఫీజుల పెంపు వల్ల నిజమైన ప్రతిభావంతులు అమెరికాకు దూరం అయ్యే ప్రమాదం ఉందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. టెక్సాస్‌లో మొదలైన ఈ విచారణ మున్ముందు ఇతర రాష్ట్రాలకు కూడా పాకే అవకాశం ఉంది. అమెరికాలో ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారు లేదా ఇప్పటికే వీసాపై ఉన్న వారు తమ కంపెనీల చట్టబద్ధతను సరిచూసుకోవడం ఇప్పుడు అనివార్యంగా మారింది.



Full View


Tags:    
  • h1bvisa 
  • h1bscam 
  • texasimmigration 
  • kenpaxton 
  • gregabbott 
  • h1bfraud 
  • visafraud 
  • texasworkforce 

Similar News

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

కేరళ నుంచి అమెరికా వరకు.. లాస్ ఏంజెలెస్ తొలి భారతీయ సంతతి మేయర్‌గా నిత్యా రామన్!

2026-11-06 04:57 GMT

అమెరికాలో దీపావళి వేడుకలపై ఆంక్షలు.. బాణసంచా కాల్చితే $2,000 ఫైన్!

2026-11-05 04:16 GMT

అమెరికా కాంగ్రెస్‌లోకి మరో భారత సంతతి మహిళ.. ఫ్లోరిడాలో పియా దండియా చారిత్రాత్మక విజయం!

2026-11-04 08:52 GMT

విశాఖ యువకుల వ్యథ.. యువకులకు యుద్ధమే ఆహ్వానం పలికింది... బయటపడేదెలా?

2026-11-02 13:49 GMT

డాలర్లతో సొంతింటి కల.. తల్లిదండ్రుల భద్రతే ఎన్నారైల తొలి ప్రాధాన్యం

2026-10-31 23:30 GMT

స్వదేశంతో తెగని బంధం.. ఎన్‌ఆర్‌ఐల కలల ఆస్తులకు ఇన్నాళ్లకు లభించిన విముక్తి

2026-10-30 10:30 GMT

అమెరికాలో భారత సంతతి మహిళ సంచలనం.. మేయర్ రేసులో నిత్యా రామన్!

2026-10-29 05:05 GMT

యూకేలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు భారతీయులకు 28 ఏళ్ల జైలు శిక్ష!

2026-10-27 05:01 GMT

ఫుడ్ బ్యాంక్ వివాదం.. అమెరికాలో భారతీయ విద్యార్థులపై ద్వేషానికి మరో అస్త్రం

2026-10-25 08:30 GMT

F-1 వీసా రిజెక్ట్ అయితే 300 రోజులు ఆగాలా?

2026-10-25 04:52 GMT

అమెరికాలో గుండెపోటుతో ఖమ్మం యువతి మృతి.. తండ్రితో ఫోన్ మాట్లాడిన కాసేపటికే విషాదం!

2026-10-23 14:17 GMT

Copyright @2026

Powered by Blink CMS