విదేశాలకు విద్యార్థుల్లో ఆంధ్రా టాప్.. గమ్యస్థానాల్లో కీలక మార్పులివే!

ఈ క్రమంలో.. భారత్ లో ప్రధానంగా ఐదు రాష్ట్రాలు విదేశాలకు విద్యార్థులను పంపడంలో కాస్త అటు ఇటుగా టాప్ - 5లో కొనసాగుతుండగా.. వీటిలో తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ టాప్ లో కొనసాగుతోంది.;

Update: 2026-01-28 04:56 GMT

విదేశాలకు వెళ్లి ఉన్నత చదువులు చదువుకునే విద్యార్థుల్లో భారతీయుల సంఖ్య ఎక్కువగానే ఉంటుందని అంటారు. అనంతర స్థానం చైనాదని చెబుతారు. ఈ క్రమంలో.. భారత్ లో ప్రధానంగా ఐదు రాష్ట్రాలు విదేశాలకు విద్యార్థులను పంపడంలో కాస్త అటు ఇటుగా టాప్ - 5లో కొనసాగుతుండగా.. వీటిలో తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ టాప్ లో కొనసాగుతోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన నీతి ఆయోగ్ డేటా దీనికి సంబంధించిన పలు కీలక విషయాలు వెల్లడించింది.

అవును... ఉన్నత విద్య అంతర్జాతీయీకరణపై నీతి ఆయోగ్ విడుదల చేసిన డేటా ప్రకారం... దేశంలోని అన్ని ప్రాంతాలతో పోలిస్తే, అత్యధిక సంఖ్యలో విద్యార్థులను విదేశాలకు పంపడంలో ఐదు రాష్ట్రాలు స్థిరంగా ముందుకు కొనసాగుతుండగా.. ఇందులో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. ఇదే సమయంలో... ఈ సంఖ్యలో 2016, 2020 మధ్య భారతీయ విద్యార్థుల అగ్ర అధ్యయన గమ్యస్థానాలలో వచ్చిన స్పష్టమైన మార్పును ఈ నివేదిక వెల్లడించింది.

ఈ జాబితాలో 2016, 2018, 2020లలో వరుసగా ఆంధ్రప్రదేశ్ టాప్ ప్లేస్ లో నిలవగా.. రెండు, మూడు స్థానాల్లో పంజాబ్, మహారాష్ట్రలు పోటీ పడుతూ, ఎక్కుతూ దిగుతూ ఉన్నాయి! ఇదే సమయంలో... నాలుగు, ఐదు స్థానాల్లో తమిళనాడు, గుజరాత్, ఢిల్లీ మధ్య గట్టి పోటీ నెలకొంటున్నా.. గుజరాత్ ఆధిపత్యాన్ని కనబరుస్తుంది. ఢిల్లీ గత కొంతకాలంగా ఐదో స్థానంలో నిలుస్తుంది. అయితే కేరళ, కర్ణాటక రాష్ట్రాలు ఈ జాబితాలో ఏడు, ఎనిమిది స్థానాల్లో నిలవడం గమనార్హం.

2016లో విదేశాలకు విద్యార్థులను ఎక్కువగా పంపిన టాప్ - 5 రాష్ట్రాలు!:

1. ఆంధ్రప్రదేశ్ - 46,818

2. మహారాష్ట్ర - 45,560

3. పంజాబ్ - 36,743

4. తమిళనాడు - 27,518

5. ఢిల్లీ - 27,016

2018లో విదేశాలకు విద్యార్థులను ఎక్కువగా పంపిన టాప్ - 5 రాష్ట్రాలు!:

1. ఆంధ్రప్రదేశ్ - 62,771

2. పంజాబ్ - 60,331

3. మహారాష్ట్ర - 58,850

4. గుజరాత్ - 41,413

5. తమిళనాడు - 38,983

2020లో విదేశాలకు విద్యార్థులను ఎక్కువగా పంపిన టాప్ - 5 రాష్ట్రాలు!:

1. ఆంధ్రప్రదేశ్ - 35,614

2. పంజాబ్ - 33,412

3. మహారాష్ట్ర - 29,079

4. గుజరాత్ - 23,156

5. ఢిల్లీ - 18,482

2016, 2020 మధ్య మారిన గమ్యస్థానాలు!:

2016, 2020 మధ్య భారతీయ విద్యార్థులు ఎక్కడికి వెళ్లారనే దాని భౌగోళికం గణనీయంగా మారిపోయింది. ఇందులో భాగంగా... 2016లో భారతీయ విద్యార్థుల గమ్యస్థానంగా అమెరికా అగ్రస్థానంలో ఉండగా.. కెనడా, ఆస్ట్రేలియా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.. యూకే ఈ జాబితాలో మరింత దిగువన ఉంది. అయితే.. 2020 నాటికి ఆ ఆర్డర్ మారిపోయింది. ఇందులో భాగంగా... ఈ జాబితాలో కెనడా అగ్రస్థానానికి చేరుకోగా.. యూఎస్ రెండో స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా ఓ ప్రధాన గమ్యస్థానంగా మారగా.. యూకే పైకి ఎగబాకింది.. జర్మనీ ప్రత్యామ్నాయంగా మారింది.

2016లో భారతీయ విద్యార్థులు ఎక్కువగా వెళ్లిన టాప్ - 5 దేశాలు!:

1. అమెరికా - 4,23,863

2. కెనడా - 94,240

3. ఆస్ట్రేలియా - 78,103

4. యూకే - 16,599

5. ఉక్రెయిన్ - 10,963

2020లో భారతీయ విద్యార్థులు ఎక్కువగా వెళ్లిన టాప్ - 5 దేశాలు!:

1. కెనడా - 1,79,480

2. అమెరికా - 1,67,582

3. ఆస్ట్రేలియా - 1,15,137

4. యూకే - 90,300

5. జర్మనీ - 35,147

Tags:    

Similar News