అమెరికాలో తెలంగాణకు చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి మృతి!
వివరాళ్లోకి వెళ్తే... తెలంగాణ రాష్ట్రం, వనపర్తి జిల్లా, వీపనగండ్ల మండలం, బొల్లారం గ్రామానికి చెందిన హర్షవర్ధన్ రెడ్డి (45) అమెరికాలోని ఫ్లోరిడాలో నివాసముంటూ... ఓ ఐటీ సంస్థలో పనిచేస్తున్నారు.;
అమెరికాలో మృతి చెందుతున్న భారతీయులు, ప్రధానంగా తెలుగువారి జాబితాలో మరో దారుణం తోడయ్యింది. ఇందులో భాగంగా.. అమెరికాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి మృతి చెందారు. ఆయన మృతికి గుండెపోటు కారణమని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో.. తెలంగాణాలోని ఆయన స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
అవును.. అమెరికాలో మరో తెలుగు వ్యక్తి మృత్యువాతపడ్డారు! వర్క్ ఫ్రం హోంలో ఉండగా సడన్ గా ఆయనకు గుండెపోటు వచ్చిందని చెబుతున్నారు. దీంతో ఆతడు మృతి చెందారని అంటున్నారు. ఈయన దాదాపు పదేళ్లుగా అమెరికాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నట్లు చెబుతున్నారు. ఆయనకు భార్య, కుమారుడు ఉండగా.. తండ్రి సుదర్శన్ రెడ్డి సర్పంచ్ గా ఉన్నారు.
వివరాళ్లోకి వెళ్తే... తెలంగాణ రాష్ట్రం, వనపర్తి జిల్లా, వీపనగండ్ల మండలం, బొల్లారం గ్రామానికి చెందిన హర్షవర్ధన్ రెడ్డి (45) అమెరికాలోని ఫ్లోరిడాలో నివాసముంటూ... ఓ ఐటీ సంస్థలో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి సమయంలో వర్క్ ఫ్రం హోం చేస్తుండగా గుండెపోటు రావడంతో ఆతను మృతిచెందారు.
గత పదేళ్లుగా అమెరికాలో సాఫ్ట్ వేర్ రంగంలో పని చేస్తున్న హర్షవర్ధన్ రెడ్డికి.. భార్య, కుమారుడు ఉండగా... ఆయన తండ్రి సుదర్శన్ రెడ్డి బొల్లారం గ్రామ సర్పంచ్ గా ఉన్నారు. ఈ నేపథ్యంలో కుటుంబంలోనూ, గ్రామంలోనూ తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.
కాగా... కాలిఫోర్నియాలో నివసిస్తున్న తెలంగాణకు చెందిన ఇద్దరు మహిళలు పులఖండం మేఘనా రాణి (25), కడియాల భావన (24) గత ఏడాది డిసెంబర్ నెలాఖరున మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ ఇద్దరు మహిళలు తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా గార్ల మండలానికి చెందినవారు! వీరిద్ధరూ మాస్టర్స్ డిగ్రీలను పూర్తి చేసి, ఉద్యోగ వేటలో ఉన్నారు.
వీరిలో మేఘన తండ్రి నాగేశ్వరరావు.. గార్ల మండలోనే మీ-సేవా కేంద్రాన్ని నడుపుతుండగా.. కడియాల భావన తండ్రి ముల్కనూర్ గ్రామానికి డిప్యూటీ సర్పంచ్ గా పనిచేస్తున్నారు.