భార్యతో పాటు బంధువులను కాల్చి చంపిన ఎన్నారై భర్త.. భయంతో పిల్లలు ఏం చేశారంటే?
అయితే పోలీసులకు కాల్ చేసింది మాత్రం విజయ్ కొడుకు. ఆ ఇంట్లో ఉన్న మరో ఇద్దరు పిల్లలు.;
కుటుంబ కలహాలు కూర్చొని పరీష్కరించుకునేలా ఉండాలే కానీ ఒకరిపై ఒకరు దాడులు చేసుకొని ఏకంగా ప్రాణాలు తీసేలా ఉండకూడదు. కానీ ఒక ఎన్నారై వ్యక్తి క్షణికావేశంలో చేసిన తప్పిదం భార్యతో పాటు ఆమె తరఫు బంధువులను హతమార్చేలా చేసింది. ఇక భయం గుప్పెట్లో పిల్లలు ప్రాణాలతో పోరాడిన వైనం అందరికీ కంటతడి తెప్పిస్తోంది. మరి ఇది ఎక్కడ జరిగింది ? అసలు ఏమైంది? అనే విషయం ఇప్పుడే చూద్దాం..
అమెరికాలో భారత సంతతికి చెందిన విజయ్ కుమార్ అనే వ్యక్తి తన భార్య మీనూ డోగ్రా, కొడుకు (12)తో కలిసి అట్లాంటాలో నివాసం ఉంటున్నారు. అయితే ఏదో ఒక విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగిందంట. దీంతో కొడుకుని తీసుకొని మీనూ డోగ్రా తన భర్తతో పాటూ గ్వినెట్ కౌంటిలోని బ్రూక్ ఐవీ కోర్ట్ లో ఉన్న తన బంధువుల ఇంటికి వెళ్లారు. అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ కాసేపటికి 112 ఎమర్జెన్సీ నెంబర్ ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అయితే పోలీసులకు కాల్ చేసింది మాత్రం విజయ్ కొడుకు. ఆ ఇంట్లో ఉన్న మరో ఇద్దరు పిల్లలు.
అక్కడికి చేరుకున్న పోలీసులతో విజయ్ కొడుకు మాట్లాడుతూ.. తన తల్లితో తండ్రికి గొడవ జరిగిందని, అది పెద్దదై తుపాకీతో తన తల్లితో పాటు బంధువులు గౌరవ్ కుమార్ (33), హరీష్ చందర్ (38), నిధి చందర్ (37) లను తన తండ్రి కాల్చి చంపారని విజయ్ కొడుకు పోలీసులకు తెలిపారు. అయితే కాల్పులు జరుగుతున్న సమయంలో మేము ముగ్గురం ఉన్నాము. ఆత్మరక్షణ కోసం ఏం చేయాలో తెలియక ఒక గదిలోని అల్మారాలో దాక్కున్నాము అంటూ పిల్లలు పోలీసులతో తెలిపారు.
ఇకపోతే వెంటనే నిందితుడు కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఇంటి వెనుక గుండా సమీపంలోని అడవిలోకి పారిపోయిన విజయ్ ఆచూకీ గుర్తించి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇకపోతే విజయ్ భార్య మీనూ పాటు కాల్చి చంపబడ్డ బాధితులు ఆమె తరఫు బంధువులుగా పోలీసులు నిర్ధారించుకున్నారు. ప్రస్తుతం విజయ్ పై హత్యా కేసు, పిల్లలపై క్రూరత్వం తదితర నేరాల కింద కేసు నమోదు చేశారు. ఇక ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అయితే గొడవకు గల కారణాలు ఏంటి? అనే విషయాలపై అతడి నుంచి తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
జార్జియాలో జరిగిన ఈ కాల్పుల ఘటనపై అట్లాంటాలోని భారత కాన్సులేట్ స్పందిస్తూ.. కుటుంబ గొడవలు.. విషాదంగా ముగియడం అత్యంత బాధాకరం. బాధిత కుటుంబానికి అవసరమైన సాయం అందిస్తాము అంటూ తెలిపారు.