వ్యభి*చార గృహాలతో లింకులు.. అమెరికాలో ఈ భారత సీఈవోది తప్పా? ఒప్పా?
ఎందరో భారతీయులు అమెరికాలో ఉన్నత పదవులు అలంకరించారు. మరెందరో అక్కడ సంస్థలు స్థాపించి ఉన్నత స్థాయికి ఎదిగారు.;
ఆయన ఓ ప్రత్యేకమైన అంశంలో పీహెచ్ డీ చేశారు.. అది ఉప్పు నీటిని తాగునీటిగా మార్చడం.. మురుగు నీటిని శుద్ధి చేయడం.. సొంతంగా ఓ కంపెనీనీ స్థాపించారు.. 12 ఏళ్లుగా దానిని డెవలప్ చేశారు. ఏకంగా బిలియన్ డాలర్ల సంస్థగా తీర్చిదిద్దారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఓ అనూహ్య వివాదంలో చిక్కుకున్నారు. అది కూడా వ్యభి*చార గృహాలతో సంబంధాల ఆరోపణలు కావడం గమనార్హం.
ఎందరో భారతీయులు అమెరికాలో ఉన్నత పదవులు అలంకరించారు. మరెందరో అక్కడ సంస్థలు స్థాపించి ఉన్నత స్థాయికి ఎదిగారు. అలాంటివారిలో ఒకరు తాజాగా ఇలాంటి వివాదంలో చిక్కుకోవడం ఏమిటా? అని ఆశ్చర్యపోయే పరిస్థితి వచ్చింది.
ఓ స్టార్టప్ సంస్థకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) అయిన భారత సంతతి యువకుడు (40) వ్య*భిచార గృహాలతో లింకులున్నట్లుగా ఆరోపణల్లో చిక్కుకున్నారు. దీంతో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. అమెరికాలోని ప్రముఖ మీడియా న్యూయార్క్ పోస్ట్ ఈ మేరకు కథనం ప్రచురించింది.
ఈ సీఈవోపై మోపుతున్న అభియోగాల్లో.. వ్య*భిచార గృహాల్లో గడిపి గంటకు 600 డాలర్లు డబ్బు చెల్లించిన వ్యక్తుల్లో ఒకరు. కోర్టుకు కూడా ఈ మేరకు పత్రాలు సమర్పించింది.
ఆసియా మహిళల ట్రాఫికింగ్లో..
వ్య*భిచార గృహాలలో డాక్టర్లు, లాయర్లు, ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ కాంట్రాక్టర్లకు చెందిన ప్రత్యేక క్లైంట్ల గ్రూప్ లోఈ సీఈవో పేరుందట. అయితే, ఇక్కడ విషయం ఏమంటే.. ఈ క్లయింట్లు అందరూ ఎంచుకున్న మహిళల్లో ఆసియా సంతతి వారు ఉండడం, వీరంతా మానవ అక్రమ రవాణా బాధితులని అనుమానం వ్యక్తం అవుతోంది. కాగా, భారత సంతతి సీఈవో సంస్థ సిబ్బంది ఆందోళనతో పాటే తమ అధికారి రాజీనామాకు డిమాండ్ చేస్తున్నారు. సంస్థ మాత్రం మద్దతు పలికింది. ఈ సంస్థ 25 దేశాల్లో సేవలందిస్తోంది.