అమెరికాలో తెలుగు టెక్కీ మృతి... భార్య విజ్ఞప్తి ఇదే!

అవును... అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తూ.. భార్యా, 4 ఏళ్ల బాబుతో అక్కడే ఉంటున్న 34 ఏళ్ల మహేష్ చిట్టోజు మృతి చెందారు.

Update: 2024-03-28 09:31 GMT

అమెరికాలో ఊహించని రీతిలో మృతిచెందుతున్న భారతీయుల జాబితా రోజు రోజుకీ పెరిగిపోతోంది! ఈ క్రమంలో హైదరాబాద్ కు చెందిన మహేష్ చిట్టోజు (34) జార్జియాలోని కమ్మింగ్ లో ఆఫీసులో ఉండగా హఠాత్తుగా గుండెపోటు రావడంతో మరణించాడు. ఈ సమయంలో అతని భార్య రాధ... అతని మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి నిధులను సేకరించడానికి “గో ఫండ్ మీ” పేజీని ఏర్పాటు చేసింది.

అవును... అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తూ.. భార్యా, 4 ఏళ్ల బాబుతో అక్కడే ఉంటున్న 34 ఏళ్ల మహేష్ చిట్టోజు మృతి చెందారు. ఈ దంపతులు 15 నెలల క్రితం ఉజ్వల భవిష్యత్తుపై ఆశలు పెట్టుకుని అమెరికాకు వెళ్లారు. ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయింది. ఈ సందర్భంగా గో ఫండ్ మీ లో పేజ్ క్రియేట్ చేసిన రాధ.. తన ఆవేదనను, అభ్యర్థనను పంచుకుంది.

ఇందులో భాగంగా... తాము అనుభవిస్తున్న దిగ్భ్రాంతి, దుఃఖం మాటల్లో చెప్పలేనంతా ఉందని.. తమ స్వస్థలానికి మహేష్ మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నామని, అది తమకు మించిన భారమని ఆమె తెలిపింది. ఈ సందర్భంగా ఈ సమయంలో తనపై ఉన్న ఆర్థికపరమైన ఒత్తిడి విషయంలో సహాయం చాలా అవసరమని కోరారు. ఈ సమయంలో గో ఫండ్ లో విరాళాలు వస్తున్నాయి.

మహేష్ చిట్టోజు ఫేస్‌ బుక్ ప్రొఫైల్ ప్రకారం.. అతను ఎడిపిలో అప్లికేషన్ డెవలపర్‌ గా పనిచేస్తున్నాడు. రాధ గతంలో హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్‌ లో పనిచేశారని తెలుస్తుంది. ఇక, జనగామ జిల్ల, బచ్చన్నపేట మండలం, వంగ సుదర్శన్ రెడ్డి నగర్.. మహేష్ స్వగ్రామం!

Tags:    

Similar News