• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పోటుకు రూ.2 లక్షలు ఫిక్స్...

పోటుకు రూ.2 లక్షలు ఫిక్స్ చేసి ఏసేశారట!

| ఏపీ వ్యాప్తంగా సంచలనంగా మారిన తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి హత్య ఉదంతానికి సంబంధించిన కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి.

By - Tupaki Desk
Update: 2025-04-28 08:26 GMT

ఏపీ వ్యాప్తంగా సంచలనంగా మారిన తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి హత్య ఉదంతానికి సంబంధించిన కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. హత్య జరిగిన రెండు వారాలు దాటుతున్నా.. ఈ హత్యకు కీలక సూత్రధారితో పాటు.. దారుణ హత్య చేసిన వారిలో కీలకవ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. దాదాపు మూడు నెలల ప్లానింగ్.. రెండు వారాలకు పైనే రెక్కీ నిర్వహించినన తర్వాతే తమ ప్లాన్ ను అమలు చేసినట్లుగా పోలీసుల విచారణలో తేలింది.

ఈ హత్యకు సంబంధించి మరో కీలక అంశాన్ని పోలీసులు గుర్తించారు. హత్య చేసేందుకు మాట్లాడిన సందర్భంగా.. ఎన్ని కత్తి పోట్లు ఎక్కువ వేయగలిగితే.. అన్ని వేయాలని.. ఒక్కో కత్తి పోటుకు రూ.2 లక్షలు చొప్పున ఆఫర్ చేసినట్లుగా చెబుతున్నారు. నిందితులకు.. సూత్రధారులకు మధ్య నడిచిన లావాదేవీలు పూర్తిగా వెల్లడి కావాలంటే.. కీలక సూత్రధారిని పోలీసులు అదుపులోకి తీసుకోవాల్సి ఉంటుంది.

పోలీసు వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. హత్య జరిగిన వెంటనే ఇద్దరు కీలక వ్యక్తులు అండర్ గ్రౌండ్ కు వెళ్లిపోయినట్లుగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వీరి కోసం హైదరాబాద్.. విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపడుతున్నారు. తాను దిగిన అన్నీ రంగాల్లో దూసుకెళ్లిపోతున్న వీరయ్యకు వ్యతిరేకలందరిని ఒక తాటి మీదకు తీసుకొచ్చి.. మర్డర్ ప్లాన్ చేసినట్లుగా భావిస్తున్నారు.

వీరయ్య హత్య కేసులో కీలక నిందితుడికి వైసీపీకి చెందిన ముఖ్యనేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇతడికి పేకాట ఎక్కువగా ఆడే అలవాటు ఉంటారని.. కొందరు వైసీపీ నేతలు అయితే.. నిందితుడి ఇంటికి వెళ్లి మరీ తీసుకెళతారని చెబుతున్నారు. అంతేకాదు జిల్లాకుచెందిన మాజీ ఎమ్మెల్యేతోనూ సన్నిహితంగా ఉంటారని చెబుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే హైదరాబాద్ లోనూ ఇతడికి కీలక స్థానాల్లో ఉండే అధికారులతో లింకులు ఉన్నట్లుగా సమాచారం. నిందితుడికి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి నెట్ వర్కు ఉందని అనుమానిస్తున్నారు.

హత్యకు ప్లాన్ చేసిన సందర్భంగా నిందితులు త్రోవగుంట సమీపంలో ఒక లాడ్జిని తీసుకొని వీరయ్య చౌదరి రోజువారీ కదలికల్ని గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఈ కేసు ఒక కొలిక్కి రావాలంటే హత్యకు కీలక నిందితుడితోపాటు.. దారుణంగా ప్లాన్ చేసిన వాడు దొరికితేనే.. ఈ హ్యత్య అసలు ఉద్దేశాలు వెలుగు చూస్తాయని చెబుతున్నారు.

Tags:    
  • TDP 
  • MurderCase 
  • AndhraPradesh 
  • CrimeInvestigation 
  • PoliticalCrime 
  • BreakingNews 
  • PoliceInvestigation 
  • ShockingMurder 
  • AndhraPradeshNews 
  • PoliticalNews 
  • VeerayyaChowdary 
  • VeerayyaChowdaryMurder 

Similar News

ఎమ్మెల్యే విందు.. గాల్లో ఎగిరిన ప్లేట్లు.. కరెంట్ టవర్లపై వేలాడిన మనుషులు..

2026-11-26 10:20 GMT

టీడీపీ కార్యకర్తల సంక్షేమానికి భారీ మొత్తం.. గ్రూప్ ఇన్సూరెన్స్ కే 191 శాతం నిధులు!

2026-11-26 10:19 GMT

ఫిట్‌గా ఉంటేనే లిక్కర్.. వైన్ షాపు ముందు మెడికల్ క్యాంప్.. మందుబాబులకు ఊహించని షాక్

2026-11-26 10:17 GMT

యూపీలో ఇండి కూటమికి అసలు పరీక్ష: 130 సీట్లపై కాంగ్రెస్ పట్టు.. గెలుపు గుర్రాలకే టికెట్లంటున్న అఖిలేశ్!

2026-11-26 10:14 GMT

తిరుమలేశుడికి 121 కేజీల బంగారం ఇచ్చింది ఎవరో తెలుసా? ఎందుకిచ్చాడంటే?

2026-11-26 09:03 GMT

జగన్ దూరం.. విజయమ్మ ఆశీస్సులతో ముగిసిన అంజలీ రెడ్డి వివాహం!

2026-11-26 09:00 GMT

చిన్నారులకు కడుపునొప్పి వస్తే వాతలా? ప్రాణాలకే ముప్పు తెచ్చే మూఢనమ్మకాలు!

2026-11-26 08:58 GMT

కూటమిలో జనసేన పంచాయితీ.. సేనాని పవర్ ఫుల్ వ్యూహమేనా?

2026-11-26 08:57 GMT

ఇరాన్‌తో మళ్లీ యుద్ధం తప్పదా?.. ఇజ్రాయెల్ జ్యోతిష్యుల సంచలన అంచనాలు!

2026-11-26 08:55 GMT

అమెరికా పిల్లలకు SpaceX షేర్లు ఇవ్వనున్న ఎలాన్ మస్క్.. ఎప్పటి నుంచి అంటే?

2026-11-26 08:52 GMT

చేతిలో డిగ్రీలు.. ఉద్యోగం కోసం రోడ్లపై.. బీటెక్ బతుకులు దుర్భరం.. ఇంటర్వ్యూ కోసం కిలోమీటర్ల క్యూ

2026-11-26 08:51 GMT

అంతరిక్షాన్ని ఆక్రమించేస్తున్నావా మస్క్ మావా..

2026-11-26 08:44 GMT

Copyright @2026

Powered by Blink CMS