• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  District News >  Uttar Pradesh >  యూపీలో ఇండి కూటమికి అసలు...

యూపీలో ఇండి కూటమికి అసలు పరీక్ష: 130 సీట్లపై కాంగ్రెస్ పట్టు.. గెలుపు గుర్రాలకే టికెట్లంటున్న అఖిలేశ్!

| 2027 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇండియా కూటమిలో సీట్ల సర్దుబాటు చర్చలు ప్రతిష్టంభనకు చేరాయి. కాంగ్రెస్ 181 స్థానాలు కోరుతుండగా, ఎస్పీ 26 సీట్లే ఇస్తామని ప్రతిపాదించినట్లు సమాచారం. చర్చలు జరుగుతుండగానే ఎస్పీ ఐదుగురు అభ్యర్థులను ప్రకటించడంపై కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

By - Tupaki Political Desk
Update: 2026-11-26 10:14 GMT

కీలకమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. వచ్చే ఏడాది జరగనున్న ఈ ఎన్నికలకు ప్రధాన పార్టీలు అప్పుడే సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా విపక్షం ఇండి కూటమిలో సీట్ల సర్దుబాటుపై చర్చలు తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. కూటమిలోని ప్రధాన భాగస్వామ్యమైన సమాజ్ వాది పార్టీకి.. జాతీయ స్థాయిలో కూటమికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీకి మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కిరావడం లేదు. గత అసెంబ్లీలో కేవలం రెండు సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ ఈ సారి 181 సీట్లు ఆశిస్తుండగా, సమాజ్ వాదీ మాత్రం కేవలం 26 సీట్లు మాత్రమే ఇస్తామని చెబుతుండటంతో చర్చల్లో పీటముడి నట్లైందని అంటున్నారు.

రాష్ట్రంలో 403 అసెంబ్లీ స్థానాలు ఉంగా, ఇండి కూటమిలోని ప్రధాన భాగస్వామ్య పక్షాలైన సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), కాంగ్రెస్ మధ్య భేదాభిప్రాయాలు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇరు పార్టీల నేతల మధ్య సీట్ల సర్దుబాటు చర్చలు కొనసాగుతుండగానే సమాజ్‌వాదీ పార్టీ ఐదుగురు అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ప్రకటించడం కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. ఒకవైపు సంప్రదింపులు జరుపుతూ మరోవైపు ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించడం కూటమి ధర్మానికి విరుద్ధమని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. అయితే గెలుపు అవకాశాలే ప్రాతిపదికగా తమ నిర్ణయాలు ఉంటాయని ఎస్పీ స్పష్టం చేస్తోంది.

ఏకపక్ష ప్రకటనల వివాదం

కాంగ్రెస్ సీనియర్ నేత ప్రమోద్ తివారీ నివాసంలో సీట్ల పంపకంపై చర్చలు ఆరంభంలో సానుకూలంగా కనిపించినా, రెండో విడత చర్చల నాటికి ప్రతిష్టంభనకు నెలకుందని చెబుతున్నారు. 403 స్థానాలున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్ తొలుత 170 నుంచి 180 సీట్ల వరకు ప్రతిపాదించగా, తాజా చర్చల్లో సుమారు 130 స్థానాలు (కనీసం 105 నుంచి 120 గౌరవప్రదమైన సీట్లు) కోసం పట్టుబట్టింది. ప్రతి జిల్లాలో కనీసం ఒక స్థానంలోనైనా పోటీ చేయాలన్నది కాంగ్రెస్ ఆలోచనగా చెబుతున్నారు. అయితే, సమాజ్‌వాదీ పార్టీ మాత్రం తొలి దశలో గెలిచే అవకాశాలు ఉన్నాయని చెబుతూ కేవలం 26 స్థానాలను మాత్రమే కాంగ్రెస్‌కు కేటాయిస్తామని ప్రతిపాదించడంతో చర్చల్లో ఉద్రిక్తత మొదలైంది.

సుమారు మూడున్నర గంటల పాటు సాగిన చర్చల అనంతరం, అదే రోజు రాత్రి ఎస్పీ ఐదుగురు అభ్యర్థుల జాబితాను విడుదల చేయడం పరిస్థితిని మరింత జటిలం చేసింది. ఈ ఐదు స్థానాల్లో నలుగురు సిట్టింగ్ ఎస్పీ ఎమ్మెల్యేలు ఉండగా, సహారన్‌పుర్ జిల్లాలోని బెహత్, సహారన్‌పుర్ స్థానాలపై కాంగ్రెస్ కన్నేసిందని చెబుతున్నారు. సహారన్‌పుర్ లోక్‌సభ ఎంపీ, యూపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇమ్రాన్ మసూద్ ఈ పరిణామంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘మేమేమైనా బిచ్చగాళ్లమా? పొత్తులో భాగస్వాములు ఉంటారు కానీ బిచ్చగాళ్లు ఉండరు.’’ అంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ను సున్నాగా భావించవద్దని, తాము ఎక్కడ ఉన్నా కూటమి బలాన్ని పదింతలు చేస్తామని, గౌరవప్రదమైన వాటా దక్కకపోతే పొత్తుపై పునరాలోచించాల్సి వస్తుందని హెచ్చరించారు.

మరోవైపు, యూపీ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ రాజేంద్ర పాల్ గౌతమ్, శాసనసభా పక్ష నేత ఆరాధన మిశ్రా 'మోనా' మాట్లాడుతూ 26 సీట్ల ఫార్ములాకు అంగీకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అయితే చర్చలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయని, రాహుల్ గాంధీ, అఖిలేశ్ యాదవ్ మధ్య ఉన్న సత్సంబంధాలతో త్వరలోనే గౌరవప్రదమైన ఒప్పందం కుదురుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వివాదంపై సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ స్పందిస్తూ, దీనిని 'సీట్ల పంపకం' కంటే 'సీట్ల సర్దుబాటు'గా చూడాలని పిలుపునిచ్చారు. 2027 ఎన్నికలు భాజపాను గద్దె దించడానికి ఒక చారిత్రాత్మక అవకాశమని పేర్కొంటూ, క్షేత్రస్థాయి బలం, గెలుపు అవకాశాలు, వెనుకబడిన, దళిత, మైనారిటీ వర్గాలు (పీడీఏ) వ్యూహం ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని వివరించారు. ఇదే సమయంలో అధికార బీజేపీ నేతలు ఈ విభేదాలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎన్నికలకు ముందే 'ఇండియా' కూటమి కుప్పకూలిందని, కాంగ్రెస్ పార్టీ నవ్వులపాలైందని ముఖ్యమంత్రి యోగి వ్యాఖ్యానించారు.

ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఎస్పీ, కాంగ్రెస్ మధ్య పొత్తుల చరిత్ర ఎన్నో ఒడుదొడుకులతో సాగిందని చెబుతున్నారు. గత మూడు ప్రధాన ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే, ప్రస్తుత సీట్ల బేరసారాల వెనుక ఉన్న రాజకీయ లెక్కలు స్పష్టమవుతాయని అంటున్నారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 'యూపీ కే దో లడ్కే' నినాదంతో అఖిలేశ్ యాదవ్, రాహుల్ గాంధీ కలిసి పోటీ చేసినప్పటికీ ఘోర పరాజయాన్ని చవిచూశారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ 114 స్థానాల్లో పోటీ చేసి కేవలం 7 సీట్లకే పరిమితం కాగా, ఎస్పీ 47 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. బీజేపీ 312 సీట్లతో ఏకపక్ష విజయం సాధించింది. ఆ తర్వాత 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఇరు పార్టీలు విడివిడిగా బరిలోకి దిగాయి. ఈ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ 347 స్థానాల్లో పోటీ చేసి 111 సీట్లు గెలుచుకుని ప్రధాన ప్రతిపక్షంగా బలపడగా, 399 స్థానాల్లో అభ్యర్థులను నిలిపిన కాంగ్రెస్ కేవలం 2 స్థానాలను మాత్రమే గెలుచుకుని చరిత్రలోనే అత్యంత బలహీన ప్రదర్శన నమోదు చేసింది.

ఇదే గణాంకాలను చూపుతూ ఎస్పీ ఇప్పుడు కాంగ్రెస్‌కు తక్కువ సీట్లు కేటాయింస్తోందని అంటున్నారు. అయితే 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఈ సమీకరణాలను పూర్తిగా మార్చివేశాయని కాంగ్రెస్ వాదిస్తోంది. 'ఇండియా' కూటమిగా కలిసి పోటీ చేయడం ద్వారా ఉత్తరప్రదేశ్‌లోని 80 లోక్‌సభ స్థానాల్లో కూటమి 43 సీట్లను కైవసం చేసుకుని భాజపాకు గట్టి షాక్ ఇచ్చిందని గుర్తు చేస్తున్నారు. ఇందులో ఎస్పీ 62 స్థానాల్లో పోటీ చేసి 37 చోట్ల, కాంగ్రెస్ 17 స్థానాల్లో పోటీ చేసి 6 చోట్ల విజయం సాధించాయి. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రభావం, రాజ్యాంగ పరిరక్షణ నినాదం వల్లే దళిత, మైనారిటీ ఓట్లు కూటమికి బదిలీ అయ్యాయని, కాబట్టి 2022 నాటి ఫలితాలను కాకుండా 2024 లోక్‌సభ ఫలితాలను ప్రామాణికంగా తీసుకోవాలని కాంగ్రెస్ వాదిస్తోంది.

Tags:    
  • upelections2027 
  • samajwadiparty 
  • congress 
  • indiacoalition 
  • akhileshyadav 

Similar News

కాంగ్రెస్ కి ఎస్పీ షాక్...మొదటి జాబితా రిలీజ్ !

2026-11-25 04:02 GMT

హిందువులకు ఇంటికో తుపాకీ.. లక్నో వేదికగా రాజాసింగ్ 'భద్రతా' మంత్రం

2026-11-21 18:50 GMT

రాముడు కాదు కృష్ణుడు...యూపీ కోసం బీజేపీ కొత్త అస్త్రం !

2026-11-16 19:13 GMT

యూపీలో యోగి కోసం ఒవైసీ.. ఉత్తరాది రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్

2026-11-15 09:41 GMT

సీఎం గా యోగీ హిట్...ఎమ్మెల్యేలు ఫట్ !

2026-11-14 03:29 GMT

'ఈవీఎంలు' త‌నిఖీ.. మ‌రో రాజ‌కీయ వివాదం!

2026-11-09 23:30 GMT

2027 లో భీకర యుద్ధం...ఎన్డీయే వర్సెస్ ఇండియా కూటమి !

2026-11-09 19:18 GMT

70 కోట్ల విలువైన‌ న‌కిలీ రూ.20 కాయిన్‌లు త‌యారు చేసిన కేటుగాళ్లు!

2026-11-09 14:30 GMT

వారణాసిలో దేశంలోనే తొలి అర్బన్ రోప్‌వే.. 45 నిమిషాల ప్రయాణం 15 నిమిషాల్లోనే!

2026-11-07 02:11 GMT

ఎన్నికల రాష్ట్రాలలో భారీగా ఓట్ల కోత... విపక్షాలు గగ్గోలు

2026-11-03 04:11 GMT

మోడీ వారణాసిలో సమాజ్‌వాదీ పార్టీ విజయం.. యూపీలో ఏం జరుగుతోంది?

2026-10-28 10:27 GMT

Copyright @2026

Powered by Blink CMS