• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  District News >  Uttar Pradesh >  సీఎం గా యోగీ...

సీఎం గా యోగీ హిట్...ఎమ్మెల్యేలు ఫట్ !

| 2027 యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నిర్వహించిన సర్వేలో సీఎం యోగీ ఆదిత్యనాథ్‌కు 44.1 శాతం మద్దతు లభించింది. అఖిలేష్ యాదవ్‌కు 34.5 శాతం మద్దతు ఉంది. బీజేపీ కూటమికి 41.9 శాతం, ఎస్పీ-కాంగ్రెస్ కూటమికి 39.1 శాతం మద్దతు లభించింది. అయితే 50.2 శాతం మంది బీజేపీ ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నిరుద్యోగం ప్రధాన సమస్యగా నిలిచింది.

By - Satya P
Update: 2026-11-14 03:29 GMT

దేశంలో పెద్దదైన రాష్ట్రం యూపీలో 2027 మొదట్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అన్నది కేవలం యూపీకే పరిమితం అయిన చర్చ కాదు, దేశమంతా ఆసక్తిగా చూసే పరిణామం. ఎందుకంటే యూపీలో 80 మంది ఎంపీలు ఉన్నారు. అక్కడ రాజకీయంతో దేశ రాజకీయమే మారుతుంది. దాంతో యూపీ ఎన్నికలు మరోసారి జాతీయ స్థాయిని ఆకర్షిస్తున్నాయి. ఇదిలా ఉండగా అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందుగా తాజాగా నిర్వహించిన ఒక సర్వేలో చూస్తే రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నా ఆదిత్య నాథ్ యోగీ మీద జనాలకు మోజు అలాగే ఉందని అంటున్నారు. సీఎం గా ఆయన బెస్ట్ అని జనం మద్దతు తెలిపారు.

దూరంగా అఖిలేష్ :

ఈ సర్వే ప్రకారం చూస్తే యోగీకి 44.1 శాతం మంది మద్దతు ఉంటే ఎస్పీ అధినేత మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్ కి 34.5 శాతం మంది మద్దతు తెలిపారు. అంటే దాదాపుగా పది శాతం గ్యాప్ ఈ ఇద్దరి మధ్యన ఉంది అన్న మాట. ఇక యూపీ మీద ప్రత్యేక దృష్టి పెట్టిన కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీకి 6.5 శాతం, మాయావతికి 5.8 శాతం మంది మద్దతు తెలపడం గమనార్హం. ఇక ఎస్పీకి బీజేపీకి మధ్య చూస్తే స్వల్ప ఆధిక్యంలో బీజేపీ ఉంది. 41.9 శాతం మంది బీజేపీ కూటమికి ఓటు వేయాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ-కాంగ్రెస్ కూటమికి 39.1 శాతం మంది మద్దతు ప్రకటించారని ఈ సర్వే చెబుతోంది. ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కాబట్టి ఈ స్వల్ప ఆధిక్యతను ఎస్పీ కూటమి దాటేస్తుందా అన్నది కూడా చూడాల్సి ఉంది.

బీజేపీ ఎమ్మెల్యేల మీద :

ఇక బీజేపీ ఎమ్మెల్యేల మీద అయితే జనాగ్రహం గట్టిగానే ఉంది అని సర్వే తేల్చింది. ఏకంగా 50.2 శాతం మంది ప్రజలు బీజేపీ ఎమ్మెల్యేల పనితీరుపై ఆగ్రహంతో ఉన్నట్లుగా సర్వేలో వెల్లడైంది. మరి సగానికి సగం మంది జనం ఎమ్మెల్యేల మీద మండిపోతూంటే మూడవసారి బీజేపీ అధికారంలోకి ఎలా వస్తుంది అన్నదే ప్రశ్న. పనితీరు సరిగ్గా లేని ఎమ్మెల్యేలను బీజేపీ పక్కన పెట్టకపోతే మాత్రం యూపీలో బీజేపీ హ్యాట్రిక్ విజయానికి ఇబ్బంది రావచ్చు అని అంటున్నారు. యోగీ బెస్ట్ సీఎం అయినా ఎమ్మెల్యేల పని తీరే రేపటి ఎన్నికల్లో విజయాన్ని నిర్ణయించబోతోంది అని అంటున్నారు.

పట్టణాలలో బీజేపీ :

ఇక చదువరులు విద్యావంతులు ఉద్యోగులు ఎక్కువగా ఉండే పట్టణాలలో బీజేపీకి మద్దతు గణనీయంగా ఉందని సర్వే చెబుతోంది. అలాగే పల్లెలలో చూస్తే బీజేపీకి ఎస్పీ కూటమికి మధ్య గట్టి ఫైట్ తప్పదని అంటున్నారు. కులాల వారీగా చూసుకుంటే యాదవ సామాజిక వర్గం మద్దతు సమాజ్‌వాదీ కూటమికి అధికంగా ఉందని సర్వే తెలిపింది. యాదవేతర ఓబీసీ వర్గాలు బీజేపీకి జై కొడుతున్నాయి. జాటవేతర ఎస్సీల్లో బీజేపీకి, జాటవ ఓటర్లలో మాయవతి బీఎస్పీకి మద్దతు ఉందని సర్వే చెబుతోంది. అగ్రవర్ణ ఓటర్లలో బీజేపీకి 66 శాతం మద్దతు ఉంటే ముస్లిం ఓటర్లలో 63 శాతం మంది ఎస్పీ వైపు నిలవడం మరో కీలక పరిణామంగా ఉంది.

ఓటు చోరీ ఎక్కలేదు :

దేశంలో ఓటు చోరీ జరిగింది అని ఇండియా కూటమి గగ్గోలు పెడుతోంది. అయితే అది ఎన్నికల అంశంగా మారడం లేదని ఇప్పటికే జరిగిన బీహార్ పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలలో తేలిపోయింది. యూపీ ఓటర్లు కూడా ఓటు చోరీ గురించి పట్టించుకున్నట్లుగా లేరని అంటున్నారు. సర్ ప్రక్రియ వివాదం మీద 3.6 శాతం జనాలే స్పందించారు. అదే సమయంలో యూపీ వంటి పెద్ద రాష్ట్రంలో నిరుద్యోగం ప్రధాన సమస్యగా ఉంది. 26.5 శాతం మంది నిరుద్యోగమే అసలు సమస్య అంటున్నారు. అలాగే 11.3 శాతం మంది రైతు సమస్యలు కీలకం అంటున్నారు. 9.9 శాతం మంది శాంతి భద్రతలు సమస్యల గురించి, విద్య వైద్యం పై 8.9 శాతం ప్రస్తావిస్తున్నారు. విపక్షాలు వీటి మీద పోరాడితే మేలు అన్న సూచనలు అయితే ఈ సర్వే ఇచ్చినట్లుగా కనిపిస్తోంది.

Tags:    
  • yogiadityanath 
  • akhileshyadav 
  • upelections2027 
  • bjp 
  • samajwadiparty 

Similar News

రాముడు కాదు కృష్ణుడు...యూపీ కోసం బీజేపీ కొత్త అస్త్రం !

2026-11-16 19:13 GMT

యూపీలో యోగి కోసం ఒవైసీ.. ఉత్తరాది రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్

2026-11-15 09:41 GMT

'ఈవీఎంలు' త‌నిఖీ.. మ‌రో రాజ‌కీయ వివాదం!

2026-11-09 23:30 GMT

2027 లో భీకర యుద్ధం...ఎన్డీయే వర్సెస్ ఇండియా కూటమి !

2026-11-09 19:18 GMT

70 కోట్ల విలువైన‌ న‌కిలీ రూ.20 కాయిన్‌లు త‌యారు చేసిన కేటుగాళ్లు!

2026-11-09 14:30 GMT

వారణాసిలో దేశంలోనే తొలి అర్బన్ రోప్‌వే.. 45 నిమిషాల ప్రయాణం 15 నిమిషాల్లోనే!

2026-11-07 02:11 GMT

ఎన్నికల రాష్ట్రాలలో భారీగా ఓట్ల కోత... విపక్షాలు గగ్గోలు

2026-11-03 04:11 GMT

మోడీ వారణాసిలో సమాజ్‌వాదీ పార్టీ విజయం.. యూపీలో ఏం జరుగుతోంది?

2026-10-28 10:27 GMT

రాహుల్ యూపీ స్కెచ్...పీఎం సీటుకు గేట్ వే !

2026-10-19 05:30 GMT

బ్లూ డ్రమ్ హత్య కేసులో సంచలన తీర్పు.. ఇద్దరికీ మరణశిక్ష!

2026-10-14 14:26 GMT

యోగీ వర్సెస్ అఖిలేష్ ... అయోధ్యలో తేల్చుకుందామా ?

2026-10-11 01:50 GMT

Copyright @2026

Powered by Blink CMS