• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  District News >  Uttar Pradesh >  రాముడు కాదు...

రాముడు కాదు కృష్ణుడు...యూపీ కోసం బీజేపీ కొత్త అస్త్రం !

| 2027 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ మధుర శ్రీకృష్ణ జన్మభూమి అంశాన్ని ప్రధాన ఎజెండాగా తెరపైకి తెస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయోధ్య రామమందిరం తరహాలో మధురలోనూ కృష్ణుడి ఆలయ నిర్మాణం జరగాలని పార్టీ నేతలు కోరుకుంటున్నట్లు సమాచారం. 13.37 ఎకరాల భూమికి సంబంధించిన శ్రీకృష్ణ జన్మభూమి–షాహీ ఈద్గా వివాదం ఎన్నికల వేళ రాజకీయంగా కీలకంగా మారే అవకాశం ఉంది.

By - Satya P
Update: 2026-11-16 19:13 GMT

దేశ ప్రజల మౌలికమైన మనోభావాలను అర్ధం చేసుకుని వాటిని తమ వ్యూహాలుగా మార్చుకోవడంలో బీజేపీకి సరి సాటి ఏ రాజకీయ పార్టీ లేదని అంటారు. బీజేపీ రెండు అజెండాలతో తన రాజకీయాన్ని విజయవంతంగా కొనసాగిస్తుందని కూడా అంటారు. ఒకటి దేశభక్తి, రెండు దైవ భక్తి. ఈ రెండూ కూడా ప్రతీ దేశ పౌరులకు ఎంతో ప్రాధాన్యత కలిగినవి. అంతే కాదు ఎమోషనల్ గా టచ్ అయ్యే విషయాలు. అందుకే వీటిని బీజేపీ ఎక్కువగా ప్రస్తావిస్తుంది అంటారు. బీజేపీ ఈ వ్యూహాల మీద ప్రత్యర్థి పార్టీలు విమర్శలు చేస్తాయి కానీ అది ఆ పార్టీ విజయ రహస్యంగా ఉంటోంది. అందుకే ఒకనాడు అయోధ్యా రాముడిని తలచిన బీజేపీ ఇపుడు మధురలోని శ్రీకృష్ణుడిని కొలుస్తోంది అని అంటున్నారు.

క్రిష్ణ జన్మ భూమితో :

యూపీలో 2027 మొదట్లో ఎన్నికలు జరగనున్నాయి. దాంతో అసెంబ్లీ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ మధుర శ్రీ కృష్ణ జన్మభూమి అంశాన్ని ప్రధాన ఎజెండాగా అనూహ్యంగా తెరపైకి తెచ్చింది. ఇప్పటికి అయితే అయోధ్య, వారణాసి తర్వాత కాషాయ పార్టీ మధురపై ప్రత్యేక దృష్టి సారించినట్లుగా చెబుతున్నరు. తాజాగా బీజేపీ పెద్దలు మధుర చింతన్ సమావేశం నిర్వహించారు. మధురలో జరిగిన బీజేపీ రెండు రోజుల కోర్ గ్రూప్ చింతన్ సమావేశంలో శ్రీ కృష్ణ జన్మభూమి వివాదం ప్రధాన అంశంగా చర్చకు వచ్చిందని చెబుతున్నారు. ఈ అంశానికి త్వరగా పరిష్కారం లభించాలని పార్టీ నేతలు కోరుతున్నట్లుగా పేర్కొంటున్నారు.

రామమందిర తరహా నిర్మాణం :

బీజేపీ ఎంతగానో పూనుకుని ఎన్నో ఉద్యమాలు చేసిన మీదట మొత్తానికి అయోధ్య రామమందిరం నిర్మాణం పూర్తి అయింది. అదే తరహాలోనే మధురలో కూడా కృష్ణ జన్మభూమి ఆలయ నిర్మాణం జరగాలని మధుర ఎంపీ హేమమాలిని ఆకాంక్షించినట్లుగా చెబుతున్నారు. దీని కంటే ముందు ఇదే ఏడాది సెప్టెంబర్ 4న శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మధురలో భవ్యమైన ఆలయ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటించినట్లుగా కూడా గుర్తు చేస్తున్నారు. ఇక తాజా మధుర సమావేశంలో యోగి ఆదిత్యనాథ్, కేశవ్ మౌర్య వంటి కీలక నేతలు పాల్గొన్నట్లు తెలుస్తోంది.

వ్యూహాత్మకంగానే :

యూపీలో అనేక రాజకీయ సమీకరణాలు సామాజిక సమీకరణలు బేరీజు వేసుకుంటున్న బీజేపీ 2027 ఉత్తరప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో కృష్ణ జన్మభూమి నినాదం ఎత్తుకోవాలని చూస్తోంది అని అంటున్నారు. అయితే ఇదే అంశం మీద బీజేపీ సమాజ్‌వాదీ పార్టీల మధ్య రాజకీయంగా విమర్శల యుద్ధం కూడా సాగనుంది అని అంటున్నారు. బీజేపీ విషయం తీసుకుంటే అయోధ్యలో భవ్యమైన రామాలయం నిర్మించిన ఘనత తన ఖాతాలో వేసుకుంది. అదే తీరున మధురలో కూడా బ్రహ్మాండమైన కృష్ణుడు ఆలయం నిర్మించాలని చూస్తోంది అని అంటున్నారు. దానికే బీజేపీ వచ్చే ఎన్నికల్లో ప్రస్తావించడం ద్వారా పదునైన అజెండాగా చేసుకుంటుందని అంటున్నారు.

ఇంతకీ మధుర వివాదమేంటి :

ఉత్తరప్రదేశ్‌లోని మథురలో ఉన్న శ్రీకృష్ణ జన్మభూమి ఆలయ సముదాయం అలాగే దానికి ఆనుకుని ఉన్న షాహీ ఈద్గా మసీదు మధ్య ఉన్న 13.37 ఎకరాల భూమి యాజమాన్య హక్కుల చుట్టూ ఈ వివాదం చాలా కాలంగా నడుస్తోంది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు క్రీస్తు శకం 1670 లో ప్రాచీన కేశవదేవ్ ఆలయాన్ని కూల్చివేసి శిథిలాలపైనే షాహీ ఈద్గా మసీదును నిర్మించారని హిందూ పక్షాలు ఎప్పటి నుంచో వాదిస్తున్నాయి. బీజేపీ కూడా శ్రీ కృష్ణ జన్మభూమి విషయంలో సానుకూలంగానే మాట్లాడుతోంది అని గుర్తు చేస్తున్నారు. మరి సరిగ్గా ఎన్నికల ముందు బీజేపీ ఈ నినాదం ఎత్తుకుంటే ఏ తరహా ఫలితాలు వస్తాయన్నది కూడా చర్చగా ఉంది మరి. చూడాలి ఏమి జరుగుతుందో.

Tags:    
  • bjp 
  • mathura 
  • krishnajanmabhoomi 
  • upelections2027 

Similar News

యూపీలో యోగి కోసం ఒవైసీ.. ఉత్తరాది రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్

2026-11-15 09:41 GMT

సీఎం గా యోగీ హిట్...ఎమ్మెల్యేలు ఫట్ !

2026-11-14 03:29 GMT

'ఈవీఎంలు' త‌నిఖీ.. మ‌రో రాజ‌కీయ వివాదం!

2026-11-09 23:30 GMT

2027 లో భీకర యుద్ధం...ఎన్డీయే వర్సెస్ ఇండియా కూటమి !

2026-11-09 19:18 GMT

70 కోట్ల విలువైన‌ న‌కిలీ రూ.20 కాయిన్‌లు త‌యారు చేసిన కేటుగాళ్లు!

2026-11-09 14:30 GMT

వారణాసిలో దేశంలోనే తొలి అర్బన్ రోప్‌వే.. 45 నిమిషాల ప్రయాణం 15 నిమిషాల్లోనే!

2026-11-07 02:11 GMT

ఎన్నికల రాష్ట్రాలలో భారీగా ఓట్ల కోత... విపక్షాలు గగ్గోలు

2026-11-03 04:11 GMT

మోడీ వారణాసిలో సమాజ్‌వాదీ పార్టీ విజయం.. యూపీలో ఏం జరుగుతోంది?

2026-10-28 10:27 GMT

రాహుల్ యూపీ స్కెచ్...పీఎం సీటుకు గేట్ వే !

2026-10-19 05:30 GMT

బ్లూ డ్రమ్ హత్య కేసులో సంచలన తీర్పు.. ఇద్దరికీ మరణశిక్ష!

2026-10-14 14:26 GMT

యోగీ వర్సెస్ అఖిలేష్ ... అయోధ్యలో తేల్చుకుందామా ?

2026-10-11 01:50 GMT

Copyright @2026

Powered by Blink CMS