• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  District News >  Madhya Pradesh >  ఫిట్‌గా ఉంటేనే లిక్కర్.....

ఫిట్‌గా ఉంటేనే లిక్కర్.. వైన్ షాపు ముందు మెడికల్ క్యాంప్.. మందుబాబులకు ఊహించని షాక్

| మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లా బీనా ప్రాంతంలో ఓ లిక్కర్ షాపు వద్ద వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. మద్యం కొనుగోలుకు వచ్చిన వారికి బీపీ, షుగర్ పరీక్షలతో పాటు లివర్, కిడ్నీల ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. పరీక్షల్లో ఆరోగ్యంగా ఉన్నంత మాత్రాన మద్యం సురక్షితం కాదని, దానికి సురక్షితమైన మోతాదు లేదని వైద్యులు సూచించారు.

By - A.N.Kumar
Update: 2026-11-26 10:17 GMT

సాధారణంగా వైన్ షాపు ముందు క్యూలో నిలబడిన వారి ముఖాల్లో ఏదో తెలియని ఉత్సాహం.. జేబులో డబ్బుల గలగల.. ఏ బ్రాండ్ తక్కువ ధరకు వస్తుందన్న ఆరాటం కనిపిస్తాయి. కానీ మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లా బీనా ప్రాంతంలోని ఓ లిక్కర్ షాపు వద్ద మాత్రం సీన్ ఒక్కసారిగా రివర్స్ అయింది. మందు బాటిల్ కోసం ఆశగా వచ్చిన వారికి అక్కడ స్వాగతం పలికింది కౌంటర్‌లోని సేల్స్‌మ్యాన్ కాదు.. స్టెతస్కోప్‌తో సిద్ధంగా ఉన్న వైద్య బృందం..

ఇన్నాళ్లూ మనకు డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటేనో.. ఫిట్‌నెస్ టెస్ట్ ఉంటేనో ఏదైనా అనుమతి లభించేది. కానీ బీనాలో మాత్రం మందు బాటిల్ పట్టుకోవాలంటే ముందుగా హెల్త్ రిపోర్ట్ చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మద్యం ప్రియులకు బీపీ, షుగర్ పరీక్షలతో పాటు మద్యంతో నేరుగా దెబ్బతినే లివర్, కిడ్నీల పనితీరుపై కూడా ఈ క్యాంప్‌లో అవగాహన కల్పిస్తున్నారు. అన్నా.. నాకు ఆ క్వార్టర్ ఇవ్వు అని అడిగేలోపే.. ముందు చేయి ఇటు పెట్టు.. బీపీ చూద్దాం.. తర్వాత షుగర్, లివర్ సంగతి తేలుద్దాం అంటే ఎవరికైనా గుండెల్లో రైళ్లు పరిగెత్తడం ఖాయం కదా.. అదే జరిగింది..

మద్యం వల్ల కలిగే నష్టాల గురించి టీవీల్లో ప్రకటనలు వేసినా.. బాటిళ్ల మీద హెచ్చరికలు రాసినా చాలామంది వాటిని పట్టించుకోకుండా పక్కన పెట్టేస్తారు. నాకేం కాదులే.. నా లివర్ ఉక్కు లాంటిది అని బిల్డప్ ఇచ్చే వీరులకు ఈ క్యాంప్ ఒక చిన్న కళ్లెం లాంటిది. మందుబాబులు ఎక్కువగా గుమిగూడే చోటుకే వెళ్లి వారి కళ్ల ముందే వారి ఆరోగ్య స్థితిని నిలదీయడం నిజంగానే ఒక వినూత్న ప్రయత్నం. రేపు ఆసుపత్రి బెడ్ మీద పడి క్యూ కట్టే బదులు.. ఇప్పుడే వైన్ షాపు దగ్గర హెల్త్ చెకప్ చేయించుకోవడం మేలన్న సందేశం ఇందులో దాగి ఉంది.

ఈ క్యాంప్ చూసి కొందరు అమ్మో.. రిపోర్ట్ నార్మల్ వస్తే హాయిగా తాగొచ్చుగా అని లెక్కలు వేసుకుంటుండొచ్చు. కానీ వైద్యులు చెబుతున్న అసలు విషయం వేరే ఉంది. ఆరోగ్య పరీక్షల్లో ప్రస్తుతానికి ఫిట్‌గా కనిపించినంత మాత్రాన మద్యం సేవించడం సురక్షితం కాదని... మద్యానికి సురక్షితమైన మోతాదు అంటూ ఏదీ లేదని మందుబాబులకు పట్టపగలు షాకిస్తున్నారు.

అందుకే ఇక్కడ అసలైన నినాదం ఫిట్‌గా ఉంటేనే మందు కొనడం కాదు.. ఫిట్‌గా ఉండాలంటే మందుకు దూరంగా ఉండటం అన్నమాట.. మందు బాటిల్ కంటే ఆరోగ్యమే అసలైన కిక్ అని గుర్తిస్తే చాలు.. ఏ క్యాంప్‌తోనూ పనిలేకుండా జీవితం హ్యాపీగా సాగిపోతుంది..

Tags:    
  • madhyapradesh 
  • liquorshop 
  • healthcheckup 
  • healthcamp 
  • alcoholawareness 

Similar News

నదిని వదలను...ఆసుపత్రి నుంచే బిట్టూ పట్టు !

2026-11-16 19:11 GMT

సమాజం కోసం నదిని క్లీన్ చేసి.. చివరికి ఆస్పత్రి పాలైన బిట్టు తబాహీ వ్యథ

2026-11-16 19:03 GMT

మేమిద్దరం.. మాకైదుగురు.. బీజేపీ ఎంపీ ‘ఫ్యామిలీ ఎక్స్‌పాన్షన్ ప్లాన్’పై సోషల్ మీడియా సెటైర్లు

2026-10-05 02:38 GMT

జపాన్ లో సెంచరీ...డెడ్ ఈజీ టాస్క్ !

2026-09-17 03:45 GMT

నదిని శుభ్రం చేశాడు.. విదేశీ ఉద్యోగం పొందాడు.. ఏకంగా నెదర్లాండ్ ఆహ్వానం

2026-09-07 02:23 GMT

హారన్ కొట్టాడని ప్రాణం తీశారు.. నిందితులకు పోలీసుల ట్రీట్‌మెంట్.. వైరల్ వీడియో

2026-08-30 08:09 GMT

ప్రేయ‌సి ముద్దుల‌కు.. ప్రియుడి ప‌రిహారం.. చిత్ర‌మైన ఘ‌ట‌న‌

2026-08-25 17:30 GMT

'రీల్'లో కోట్లు.. రియాలిటీలో రోకలిపోటు... ఒకే ఒక్క ఫేక్ వీడియోతో జీవితాలు నాశనం

2026-08-18 18:30 GMT

ఆటో డ్రైవర్ ఇంట్లో రూ.3 కోట్లు.. ఒక్క ఇన్‌స్టా పోస్టుతో తీగ లాగితే డొంక కదిలింది!

2026-08-17 16:30 GMT

109 ఏళ్ల నాటి అప్పు.. బ్రిటన్ ప్రభుత్వం నుంచి రూ. 10 కోట్లు క్లెయిమ్ చేస్తున్న భారతీయ కుటుంబం

2026-08-13 12:30 GMT

కేతన్ హత్య కేసుపై సెటైర్లు.. క్షమాపణ చెప్పినా వదల్లేదు.. లేడీ డాక్టర్‌ షాక్ లగా..

2026-07-01 17:28 GMT

Copyright @2026

Powered by Blink CMS