• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  District News >  Madhya Pradesh >  నదిని వదలను...ఆసుపత్రి...

నదిని వదలను...ఆసుపత్రి నుంచే బిట్టూ పట్టు !

| మధ్యప్రదేశ్‌కు చెందిన 20 ఏళ్ల బీఎస్సీ విద్యార్థి సురేంద్ర సింగ్ చౌదరి అలియాస్ బిట్టూ, జనవరి 26 నుంచి అజ్నార్ నదిలోని ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించే కార్యక్రమం చేపట్టాడు. తన సొంత ఖర్చుతో పలు ప్రాంతాల్లో శుభ్రత కార్యక్రమాలు నిర్వహించాడు. కలుషిత నీటిలో పనిచేయడంతో చేతులు, కాళ్లకు తీవ్ర చర్మ ఇన్ఫెక్షన్లు సోకి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయినా నదుల శుభ్రత కోసం తన ప్రయత్నాలను కొనసాగిస్తానని చెబుతున్నాడు.

By - Satya P
Update: 2026-11-16 19:11 GMT

నదులు మన జీవాలు, మన జీవితాలు. నీరు లేకపోతే మనిషి ఎన్ని రోజులు బతుకుతాడు అన్నది తెలిసిందే. గాలి నీరు మనుషుల బతుకులు. కానీ వాటిని అభివృద్ధి పేరుతో కానీ అతి నిర్లక్షంతో కానీ కలుషితం చేసి పారేస్తున్న వర్తమానం మనది. నాగరిక సమాజం అని ఎంత గొప్పగా చెప్పుకుంటూ వ్యర్ధాలతో నిండిన నీటిని తాగుతూ విషం గాలిని పీలుస్తున్న తరం మనది. గంగ గోదావరి వంటి జీవ నదులు ఎన్నో ఉన్న ఈ దేశం పుణ్య భూమి. మరి ఆ పుణ్యాన్ని పది కాలాల పాటు కాపాడుకోకుండా పాపం పనులు చేస్తూ నదులను కలుషితం చేస్తున్న జనాలు రేపటి గురించి కనీసంగా ఆలోచించడం లేదు. నదీ జలాలలోకి కర్మాగారాల వ్యర్ధాలను నేరుగా వదిలేస్తూ దర్జాగా తిరిగే పెత్తందార్లు ఉన్న కఠిక సమాజం మనది. అన్నీ చూస్తూ చేష్టలుడిపోయిన చట్టాలు, ఏ మాత్ర పట్టని పాలకులు ఉన్న సమాజం కూడా మనది.

నదీ పుత్రుడిగా :

మరి ఏ నది మొక్కుకుందో. ఏ జలమాత కన్న పేగుగా తెచ్చుకుందో తెలియదు కానీ బిట్టూ అనే ఒక టీనేజ్ యువకుడు నూనూగు మీసాల నూత్న యవ్వనంతో అందరిలాగానే విలాసంగా కులాసాగా తిరగాల్సిన బిట్టూ మాత్రం నదులకు పట్టిన బురదను కడగాలని నిర్ణయించుకున్నాడు. అది లగాయితూ ఒక యజ్ఞంగా అదే పనిలో నిమగ్నం అవుతూ కఠో పరిశ్రమ చేస్తున్నాడు. ఈ క్రమంలో వ్యర్ధాలను చెత్తా చెదారాన్ని చేతులతో ఎత్తి పోస్తూ చర్మ వ్యాధులను కూడా కోరి తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఆసుపత్రి బెడ్ మీద ఉన్న బిట్టూ అయితే నదిని వదిలే ప్రసక్తి లేదని పట్టుదల ప్రదర్శిస్తున్నాడు అంటే సమాజం సిగ్గుపడి తన బాధ్యత ఏమిటో గుర్తెరగాల్సి ఉంది. అంతే కాదు పాలకులు కూడా పర్యావరణం మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాల్సి ఉంది.

పర్యావరణ కార్యకర్తగా :

బిట్టూ అసలు పేరు సురేంద్ర సింగ్‌ చౌదరి. మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లా బియావ్రా ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల బీఎస్సీ విద్యార్థి. బిట్టూకి ఒక మంచి ఆలోచన వచ్చింది. అదే నదులను చెరువులను శుభ్రం చేయాలని. అంతే ఈ ఏడాది జనవరి 26న తన సొంత ఊరిలోని అజ్నార్ నదిలో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించే పనిని అతడు ఒంటరిగా ప్రారంభించాడు. ఎటువంటి భారీ యంత్రాలు లేకుండా తన సొంత ఖర్చుతో నెలల తరబడి కష్టపడి నదిని శుభ్రం చేశాడు. దాంతో అతగాడి కృషికి ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాతో పాటు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ అభినందనలు తెలిపారు. అంతేకాకుండా నెదర్లాండ్స్‌కు చెందిన 'ది ఓషన్ క్లీనప్' సంస్థ సీఈఓ బోయాన్ స్లాట్ తన సంస్థలో పనిచేయాలని బిట్టూకి బహిరంగంగా జాబ్ ఆఫర్ ఇచ్చారు.

తీవ్ర అసహనంతోనే :

అయితే ఒక వైపు బిట్టూ నదీ జలాలలో చెత్తను వెలికి తీసి శుభ్రం చేస్తూంటే మరో వైపు జనాలు మాత్రం మరింతగా చెత్తను తెచ్చి నదులలో పడేసి కలుషితం చేస్తున్నారు. ఇది బిట్టూని తీవ్ర అసహనానికి గురి చేస్తోంది. ఇలా నెలల తరబడి కష్టపడి శుభ్రం చేసిన నదిలో ప్రజలు మళ్లీ చెత్త వేయడం పట్ల బిట్టూ ఆవేదన వ్యక్తం చేశాడు. కలుషిత నీటిలో నిరంతరం పనిచేయడం వల్ల తన చేతులు, కాళ్లకు తీవ్రమైన చర్మ ఇన్ఫెక్షన్లు సోకి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వీడియోను తాజాగా బిట్టూ సోషల్ మాధ్యమంలో పోస్టు చేశాడు.

ఆరోగ్యం దెబ్బతింటోంది :

తాను నదులు చెరువు శుభ్రం చేసే పనుల వల్ల తన ఆరోగ్యం కూడా దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశాడు.తన చేతులకు ఇన్‌ఫెక్షన్లు సోకిందంటూ బాధ వ్యక్తం చేశాడు. అయినా తన ప్రయత్నాలను కొనసాగిస్తానని పరిశుభ్రతపై ప్రజల ఆలోచనా విధానం ఎప్పటికైనా మారుతుందని ఆశిస్తున్నట్లు బిట్టూ చెప్పుకొచ్చాడు. గత సెప్టెంబర్‌లో తీవ్ర కాలుష్యానికి గురైన అంజర్‌ నదిని బిట్టూ శుభ్రం చేశాడు. ఆ తర్వాత తన పరిశుభ్రత కార్యక్రమాన్ని బెంగళూరుకు విస్తరించారు. తురహళ్లి అటవీ ప్రాంతంలో పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు 100 మందితో కూడిన బృందానికి నాయకత్వం వహించాడు. అనంతరం ఢిల్లీ యమునా నదితోపాటు జాతీయ రాజధాని ప్రాంతంలోని ఇతర ప్రాంతాల్లోనూ శుభ్రత కార్యక్రమాలు చేపట్టాడు. మూడు రోజులపాటు నిర్వహించిన క్లీని విత్ బిట్టూ కార్యక్రమంలో భాగంగా గురుగ్రామ్‌లోని ఖేడ్కీ దౌలాలో ఆయన బృందం 2,435 కిలోల చెత్తను తొలగించింది.

అందరి బాధ్యతగా :

నదులు, అటవీ ప్రాంతాలను శుభ్రం చేసేందుకు బిట్టూ చేస్తున్న ప్రయత్నాలు ఒకవైపు కొనసాగుతుండగానే మరోవైపు ప్రజలు మళ్లీ చెత్త వేస్తుండటం ఆ యువకుడిని తీవ్రంగా కలచివేస్తోంది. అందుకే ప్రజలలో మార్పు రావాలని బిట్టూ కోరుకుంటున్నాడు.

ఇదిలా ఉంటే బిట్టూ తాజా వీడియోపై పలువురు నెటిజన్లు సానుకూలంగా స్పందించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూనే చెరువులునదులను కలుషితం చేయకుండా ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. జలవనరుల పరిశుభ్రతను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.

Tags:    
  • bittu 
  • rivercleaning 
  • environmentalist 

Similar News

సమాజం కోసం నదిని క్లీన్ చేసి.. చివరికి ఆస్పత్రి పాలైన బిట్టు తబాహీ వ్యథ

2026-11-16 19:03 GMT

మేమిద్దరం.. మాకైదుగురు.. బీజేపీ ఎంపీ ‘ఫ్యామిలీ ఎక్స్‌పాన్షన్ ప్లాన్’పై సోషల్ మీడియా సెటైర్లు

2026-10-05 02:38 GMT

జపాన్ లో సెంచరీ...డెడ్ ఈజీ టాస్క్ !

2026-09-17 03:45 GMT

నదిని శుభ్రం చేశాడు.. విదేశీ ఉద్యోగం పొందాడు.. ఏకంగా నెదర్లాండ్ ఆహ్వానం

2026-09-07 02:23 GMT

హారన్ కొట్టాడని ప్రాణం తీశారు.. నిందితులకు పోలీసుల ట్రీట్‌మెంట్.. వైరల్ వీడియో

2026-08-30 08:09 GMT

ప్రేయ‌సి ముద్దుల‌కు.. ప్రియుడి ప‌రిహారం.. చిత్ర‌మైన ఘ‌ట‌న‌

2026-08-25 17:30 GMT

'రీల్'లో కోట్లు.. రియాలిటీలో రోకలిపోటు... ఒకే ఒక్క ఫేక్ వీడియోతో జీవితాలు నాశనం

2026-08-18 18:30 GMT

ఆటో డ్రైవర్ ఇంట్లో రూ.3 కోట్లు.. ఒక్క ఇన్‌స్టా పోస్టుతో తీగ లాగితే డొంక కదిలింది!

2026-08-17 16:30 GMT

109 ఏళ్ల నాటి అప్పు.. బ్రిటన్ ప్రభుత్వం నుంచి రూ. 10 కోట్లు క్లెయిమ్ చేస్తున్న భారతీయ కుటుంబం

2026-08-13 12:30 GMT

కేతన్ హత్య కేసుపై సెటైర్లు.. క్షమాపణ చెప్పినా వదల్లేదు.. లేడీ డాక్టర్‌ షాక్ లగా..

2026-07-01 17:28 GMT

8 ఉద్యోగాలు.. 25 మంది అర్హులు.. కానీ ఒక్కరే హాజరు: భయంతో భవిష్యత్తును బలి!

2026-06-25 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS