ప్రేయ‌సి ముద్దుల‌కు.. ప్రియుడి ప‌రిహారం.. చిత్ర‌మైన ఘ‌ట‌న‌

ప్రేయ‌సి ముద్దులంటే ఇష్ట‌ప‌డ‌ని వారు ఎవ‌రుంటారు. అయితే.. ఆ ముద్ద‌లే.. ప్రియుడి కొంప మీద‌కు తెచ్చాయి. చేతిలో ఉన్న సొమ్మును వ‌దిలించుకోవ‌డంతో పాటు.. ముద్దుల‌ను త‌నే స్వ‌యంగా తుడ‌పాల్సి వ‌చ్చింది!.

Update: 2026-08-25 17:30 GMT

ప్రేయ‌సి ముద్దులంటే ఇష్ట‌ప‌డ‌ని వారు ఎవ‌రుంటారు. అయితే.. ఆ ముద్ద‌లే.. ప్రియుడి కొంప మీద‌కు తెచ్చాయి. చేతిలో ఉన్న సొమ్మును వ‌దిలించుకోవ‌డంతో పాటు.. ముద్దుల‌ను త‌నే స్వ‌యంగా తుడ‌పాల్సి వ‌చ్చింది!. చిత్ర‌మైన ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో జ‌రిగింది. యూట్యూబ్ రీల్స్ కోసం.. చేసిన ప్ర‌యోగం విక‌టించి.. పోలీసుల నుంచి జ‌రిమానా ఎదుర్కొనాల్సి వ‌చ్చింది. చివ‌రకు క్ష‌మాప‌ణ‌ల‌తో కానీ.. ముద్దుల క‌థ ముగియ‌లేదు!!.

ఏం జ‌రిగింది?

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని గ్వాలియ‌ర్ కు చెందిన ఆదిత్య ఓ యువ‌తిని ప్రేమించాడు. ఆమె కూడా అత‌న్ని ఇష్ట‌పడింది. వీరి ప్రేమ కొన్నాళ్లుగా సాగుతోంది. ప్రియుడి కోరిక మేర‌కు ఆమె.. ఆదిత్య న‌డిపే కారును ముద్దుల తో ముంచెత్తింది. లిప్ స్టిక్ పెదాల‌తో కారు మొత్తం 3400 ముద్దులు కురిపించింది. ఆ త‌ర్వాత‌.. ఇద్ద‌రికీ ఓ ఐడియా వ‌చ్చింది. దీనిని రీల్ చేసి యూట్యూబ్‌లో పెట్టారు. అంతే.. ఇంకేముంది.. దీనిపై అనేక కామెంట్లు కురిశాయి. కొంద‌రు పిచ్చి చేష్ట‌లు అంటూ వ్యాఖ్యానించారు.

ఈ వ్య‌వ‌హారం గ్వాలియ‌ర్ ట్రాఫిక్ పోలీసుల దృష్టికి వెళ్లింది. వారు చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రించి.. కారును గుర్తించారు. అనంత‌రం స్టేష‌న్‌కు తీసుకువెళ్లి ఆదిత్య‌కు కౌన్సెలింగ్ ఇచ్చారు. కారు నిబంధ‌న‌ల మేర‌కు ఉండాల‌ని, రంగులు ఉండాల్సిన చోట ముద్దుల‌కు తావులేద‌ని పేర్కొన్నారు. పైగా దీనిని రీల్ రూపంలో చేయ‌డం, సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డాన్ని సీరియ‌స్‌గా తీసుకున్నారు. అనంత‌రం.. ఆదిత్య‌కు 5500 రూపాయ‌ల మేర‌కు ఫైన్ విధించారు. దానిని ఆదిత్య అక్క‌డే క‌ట్టేశారు.

దీంతో ఆశ్చ‌ర్య పోయిన పోలీసులు.. ఇలా కాద‌ని భావించి.. స‌ద‌రు లిప్ స్టిక్ ముద్దుల‌ను అత‌నితోనే త‌డి వ‌స్త్రంతో తుడిపించి.. దీనిని కూడా రీల్ చేయించారు. అనంత‌రం యూట్యూబ్‌లో పోస్టు చేశారు. ఎవ‌రూ ట్రాఫిక్ నిబంధ‌న‌లు, ర‌వాణా శాఖ నిబంధ‌న‌ల‌ను మీర కూడ‌ద‌ని.. మీరితే ఇలానే ఉంటుంద‌ని గ‌ట్టి హెచ్చ‌రిక పంపారు. కాగా, ఆదిత్య కారు డ్రైవ‌ర్‌గా ప‌నిచేస్తున్నాడ‌ని.. పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News