• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  District News >  Madhya Pradesh >  సమాజం కోసం నదిని క్లీన్...

సమాజం కోసం నదిని క్లీన్ చేసి.. చివరికి ఆస్పత్రి పాలైన బిట్టు తబాహీ వ్యథ

| మధ్యప్రదేశ్‌కు చెందిన బిట్టు తబాహీ అజ్నార్ నదిలో పేరుకుపోయిన ప్లాస్టిక్, చెత్తను స్వయంగా తొలగించి ప్రశంసలు అందుకున్నాడు. అయితే కలుషిత నీటిలో గంటల తరబడి పనిచేయడంతో చర్మ ఇన్ఫెక్షన్‌కు గురై ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తన ఆరోగ్య పరిస్థితిని ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించడంతో నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

By - A.N.Kumar
Update: 2026-11-16 19:03 GMT

సమాజంలో మార్పు తీసుకురావడానికి పెద్ద పెద్ద పదవులు.. హోదాలు అక్కర్లేదు... మనసులో మంచి ఆలోచన.. ఏదైనా సాధించాలనే పట్టుదల ఉంటే చాలు.. ఒక్క వ్యక్తి కూడా ఎంతోమందికి స్ఫూర్తిగా నిలవగలడు. ఈ మాటకు అక్షరాలా సరిపోతాడు మధ్యప్రదేశ్‌కు చెందిన యువకుడు బిట్టు తబాహీ. ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని ఎదురుచూడకుండా.. కాలక్రమేణా ప్లాస్టిక్, చెత్తాచెదారంతో పూర్తిగా కలుషితమైన అజ్నార్ నదిని శుభ్రం చేయడానికి తానే స్వయంగా నడుం బిగించాడు.

అజ్నార్ నదిని బాగు చేయాలన్న ఉద్దేశంతో బిట్టు చేసిన సాహసం సాధారణమైనది కాదు. ఎలాంటి రక్షణ పరికరాలు లేకుండా.. కలుషిత నీటిలో గంటల తరబడి శ్రమించి చెత్తను బయటకు తీశాడు. అతడి నిస్వార్థ సేవను చూసి స్థానికులతో పాటు సోషల్ మీడియా నెటిజన్లు సైతం ఫిదా అయ్యారు. "పర్యావరణ పరిరక్షణ అంటే ఇలా ఉండాలి" అంటూ బిట్టును ఇబ్బడిముబ్బడిగా ప్రశంసించారు. అప్పటివరకు అతడిని ఎవరూ పట్టించుకోకపోయినా ఈ ఒక్క సామాజిక సేవతో బిట్టు దేశవ్యాప్తంగా లక్షలాది మంది హృదయాలను గెలుచుకున్నాడు.

అయితే సమాజానికి మంచి చేయాలని తపించిన ఆ యువకుడికి ప్రకృతి నుంచి ఊహించని పరీక్ష ఎదురైంది. నదిని శుభ్రం చేసే క్రమంలో వ్యర్థాలతో నిండిన మురికి నీటిలో ఎక్కువ సమయం గడపడం వల్ల బిట్టు ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింది. కలుషిత నీటి ప్రభావంతో అతనికి తీవ్రమైన చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్ సోకినట్లు సమాచారం. ప్రస్తుతం చేతులు.. కాళ్లలో తీవ్రమైన దురద.. నొప్పితో అతను బాధపడుతున్నాడు. నదిని శుభ్రం చేసి అందరి మనసులు గెలిచిన హీరో.. ఇప్పుడు అదే నది నీటి కారణంగా ఆస్పత్రిపాలై మంచం పట్టడం అందరినీ కలచివేస్తోంది.

తన అనారోగ్య పరిస్థితికి సంబంధించిన వివరాలను బిట్టు స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో ద్వారా పంచుకున్నాడు. తాను ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నానని.. రాత్రి సమయంలో మందులు వేసుకుంటూ ఇబ్బంది పడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. ఒక మంచి పని కోసం ప్రాణాలను ఫణంగా పెట్టిన బిట్టుకు ఈ దుస్థితి రావడం పట్ల సర్వత్రా విచారం వ్యక్తమవుతోంది.

బిట్టు ఆస్పత్రి పాలయ్యాడన్న వార్త తెలిసిన నెటిజన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఏమోషనల్ పోస్టులు పెడుతున్నారు. బిట్టు త్వరగా కోలుకోవాలని కోరుకోవాలని ప్రార్థిస్తున్నారు.

పర్యావరణాన్ని కాపాడటం ఒక్క బిట్టు బాధ్యతే కాదు.. సమాజం మొత్తం పంచుకోవాల్సిన సామూహిక బాధ్యత. ఇలాంటి సాహసోపేతమైన పనులు చేసేటప్పుడు తగిన భద్రతా చర్యలు.. రక్షణ పరికరాలు వాడటం ఎంతైనా అవసరం. ఇతరుల కోసం పరితపించే మంచి మనసున్న బిట్టు తబాహీ త్వరగా కోలుకుని.. సంపూర్ణ ఆరోగ్యంతో మళ్లీ తన సామాజిక సేవా కార్యక్రమాల్లోకి రావాలని మనసారా కోరుకుందాం..

Tags:    
  • bittutabahi 
  • ajnarriver 
  • rivercleanup 
  • environmentprotection 

Similar News

నదిని వదలను...ఆసుపత్రి నుంచే బిట్టూ పట్టు !

2026-11-16 19:11 GMT

మేమిద్దరం.. మాకైదుగురు.. బీజేపీ ఎంపీ ‘ఫ్యామిలీ ఎక్స్‌పాన్షన్ ప్లాన్’పై సోషల్ మీడియా సెటైర్లు

2026-10-05 02:38 GMT

జపాన్ లో సెంచరీ...డెడ్ ఈజీ టాస్క్ !

2026-09-17 03:45 GMT

నదిని శుభ్రం చేశాడు.. విదేశీ ఉద్యోగం పొందాడు.. ఏకంగా నెదర్లాండ్ ఆహ్వానం

2026-09-07 02:23 GMT

హారన్ కొట్టాడని ప్రాణం తీశారు.. నిందితులకు పోలీసుల ట్రీట్‌మెంట్.. వైరల్ వీడియో

2026-08-30 08:09 GMT

ప్రేయ‌సి ముద్దుల‌కు.. ప్రియుడి ప‌రిహారం.. చిత్ర‌మైన ఘ‌ట‌న‌

2026-08-25 17:30 GMT

'రీల్'లో కోట్లు.. రియాలిటీలో రోకలిపోటు... ఒకే ఒక్క ఫేక్ వీడియోతో జీవితాలు నాశనం

2026-08-18 18:30 GMT

ఆటో డ్రైవర్ ఇంట్లో రూ.3 కోట్లు.. ఒక్క ఇన్‌స్టా పోస్టుతో తీగ లాగితే డొంక కదిలింది!

2026-08-17 16:30 GMT

109 ఏళ్ల నాటి అప్పు.. బ్రిటన్ ప్రభుత్వం నుంచి రూ. 10 కోట్లు క్లెయిమ్ చేస్తున్న భారతీయ కుటుంబం

2026-08-13 12:30 GMT

కేతన్ హత్య కేసుపై సెటైర్లు.. క్షమాపణ చెప్పినా వదల్లేదు.. లేడీ డాక్టర్‌ షాక్ లగా..

2026-07-01 17:28 GMT

8 ఉద్యోగాలు.. 25 మంది అర్హులు.. కానీ ఒక్కరే హాజరు: భయంతో భవిష్యత్తును బలి!

2026-06-25 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS