• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  District News >  Bihar >  ఎమ్మెల్యే విందు.. గాల్లో...

ఎమ్మెల్యే విందు.. గాల్లో ఎగిరిన ప్లేట్లు.. కరెంట్ టవర్లపై వేలాడిన మనుషులు..

| బీహార్‌లో మొకామా ఎమ్మెల్యే అనంత్ సింగ్ కుమార్తె పెళ్లి వేడుకలో గందరగోళం చోటుచేసుకుంది. విందు సమయంలో ప్లేట్ల కోసం అతిథులు తోసుకోవడంతో పాటు నిర్వాహకులు ప్లేట్లు విసిరారు. గుర్రపు పందేలు చూసేందుకు కొందరు హైటెన్షన్ విద్యుత్ టవర్లు ఎక్కారు. ఈ హంగామాతో 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. భద్రతా కారణాలతో పందేలను వాయిదా వేశారు.

By - A.N.Kumar
Update: 2026-11-26 10:20 GMT

సాధారణంగా పెళ్లి అంటే రెండు మనసుల కలయిక.. బంధుమిత్రుల ఆత్మీయ పలకరింపులు.. కమ్మని విందు భోజనాలు.. కానీ అదే ఓ ప్రజాప్రతినిధి ఇంట పెళ్లయితే? ఆ లెక్కే వేరు.. అక్కడ ఆత్మీయత కంటే ఆడంబరం.. ఆతిథ్యం కంటే అరాచకమే హైలైట్ అవుతుంటాయి. తాజాగా బీహార్‌లోని మొకామా ఎమ్మెల్యే అనంత్ సింగ్ కుమార్తె వివాహ వేడుక ఇందుకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. కక్కుర్తిలో కమండలం అన్నట్లు.. అక్కడ జరిగిన విందు, వినోదాల తంతు చూస్తే నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి..

పాట్నా జిల్లా నద్వాన్ గ్రామంలో జరిగిన ఈ పెళ్లి వేడుకకు జనం ఇసుకేస్తే రాలనంతగా తరలివచ్చారు. ఇక భోజనాల సమయం రానే వచ్చింది. అంతే.. అతిథులు కాస్తా ఆకలి దెయ్యాలుగా మారిపోయారు. నాకు ప్లేట్ కావాలంటే నాకు కావాలి అంటూ ఒకరిపై ఒకరు పడి తోసుకోవడం మొదలెట్టారు. నిర్వాహకులు కూడా ఏమాత్రం తగ్గకుండా ప్లేట్లను గాల్లోకి విసురుతూ తమ రాచమర్యాదలను ప్రదర్శించారు. ఫ్రీగా బిర్యానీ, స్వీట్లు దొరికితే కడుపు నింపుకోవడం కాదు కదా.. పక్కవాడి ప్లేటు కూడా లాక్కునేంత ఉత్సాహం మన జనాలకు ఎక్కడి నుంచి వస్తుందో ఆ దేవుడికే తెలియాలి..

విందు దగ్గర యుద్ధం ముగిశాక అసలైన సినిమా మొదలైంది. పెళ్లికి వచ్చిన వారిని అలరించడానికి ఎమ్మెల్యే ఏకంగా గుర్రపు పందేలే ఏర్పాటు చేశారు. విజేతకు మహీంద్రా థార్, రన్నరప్‌కు బైక్ అని ప్రకటించేసరికి జనంలో పూనకాలు వచ్చేశాయి. కింద నిలబడి చూస్తే కిక్కు ఏముంటుంది అనుకున్నారో ఏమో.. కొందరు ఏకంగా హైటెన్షన్ విద్యుత్ టవర్లనే ఎక్కేశారు..

కింద గుర్రాలు పరిగెడుతుంటే పైన హై-వోల్టేజ్ తీగల పక్కన కూర్చుని మన వాళ్లు చప్పట్లు కొడుతుంటే.. చూసేవారికి గుండెలు ఆగిపోయినంత పనైంది. కరెంట్ షాక్ కొడితే ఏమవుతుందో అన్న కనీస భయం కూడా లేకుండా ప్రాణాలను గాలికి వదిలేసి మరీ ఆ టవర్ వ్యూ ని ఎంజాయ్ చేశారు. మరోవైపు ఈ హంగామా దెబ్బకు రోడ్లపై ఏకంగా 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయి వాహనదారులకు చుక్కలు కనిపించాయి.

వేలాది మందిని పోగేసి 10 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ సృష్టించి చివరికి భద్రతా కారణాలతో పందేలను వాయిదా వేయాల్సి రావడం నిర్వాహకుల ముందుచూపుకు అద్దం పడుతోంది. పెళ్లికి వచ్చిన వారికి కనీసం కూర్చునే చోటు.. భద్రత కల్పించలేనప్పుడు ఇంత భారీ స్థాయిలో హంగామా చేయడం ఎందుకో? వారికే తెలియాలి..

ఈ పెళ్లిలో వధూవరుల ఆశీర్వాదాల కంటే.. గాల్లో ఎగిరిన ప్లేట్లు.. కరెంట్ టవర్లపై వేలాడిన మనుషులే సోషల్ మీడియాలో సూపర్ హిట్ అయ్యారు. విందు కోసం కక్కుర్తి పడటం.. వినోదం కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవడం మన జనాలకు కొత్తేమీ కాదు కానీ.. ఇలాంటి హై-వోల్టేజ్ పెళ్లిళ్లు మాత్రం చరిత్రలో నిలిచిపోతాయి.



ఎమ్మెల్యే ఇంట పెళ్లి సందడి.. భోజనాల దగ్గర జన సందోహం! బిహార్ ఎమ్మెల్యే అనంత్ సింగ్ కుమార్తె పెళ్లికి వేలాదిగా తరలివచ్చిన జనం భోజనాల దగ్గర పోటెత్తారు. ఆహారం కోసం ఎగబడటం, ప్లేట్లు విసిరేయడం వంటి దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి! #AnantSingh #Bihar #WeddingViral #ViralVideos #TeluguNews #Tupaki Follow 👉 @tupaki_official

— Tupaki (@tupaki_official) November 26, 2026


Tags:    
  • anantsingh 
  • mokama 
  • biharwedding 
  • weddingchaos 
  • horseracing 

Similar News

నడిచే బంగారు దుకాణంలా 'గోల్డ్ మ్యాన్'.. రూ.7 కోట్ల ఆభరణాలతో వైరల్

2026-11-20 17:37 GMT

₹50 కోట్ల పెళ్లి.. 4 లక్షల మంది అతిథులు.. విజేతకు థార్ కారు.. ఇలాంటిది చూడలేదప్పుడు?

2026-11-19 03:12 GMT

నితీష్ మీద కాంగ్రెస్ సాఫ్ట్ కార్నర్...బీజేపీ మీద నిప్పులు !

2026-10-26 03:45 GMT

పీకే ప్రశంసలు...ఇండియా కూటమి వైపు నితిన్ ?

2026-10-19 04:30 GMT

పీకే ‘పీచేముడ్’.. ఈ ట్విస్ట్ ఊహించలేదు సామీ!

2026-10-18 16:30 GMT

బీహార్ యువకుడిని పెళ్లాడేందుకు రష్యా మహిళ.. వైరల్ వార్తలో నిజమెంత?

2026-10-14 18:15 GMT

బిహార్‌లో ఘోరం: పదో తరగతి విద్యార్థినిపై మూకుమ్మడి వేధింపులు.. తీవ్రంగా స్పందించిన రాహుల్ గాంధీ

2026-09-21 13:33 GMT

అఫిడవిట్‌లో యాక్టివా.. రోల్స్ రాయిస్‌లో షికారు! అసలు ఈ యువ లేడి ఎమ్మెల్యే కథేంటంటే?

2026-09-21 08:33 GMT

అచ్చం దానం కేసు మాదిరే మ‌హాచంద్ర ప్ర‌సాద్ సింగ్ ఉదంతం

2026-09-20 16:39 GMT

యూసీసీకి నో ...బీజేపీకి జేడీయూ గట్టి షాక్

2026-09-15 04:15 GMT

వీడియో : ఇలాంటివి మీరు చేయొద్దన్న ఆనంద్ మహీంద్ర

2026-09-10 06:18 GMT

Copyright @2026

Powered by Blink CMS