• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  District News >  Bihar >  ₹50 కోట్ల పెళ్లి.. 4...

₹50 కోట్ల పెళ్లి.. 4 లక్షల మంది అతిథులు.. విజేతకు థార్ కారు.. ఇలాంటిది చూడలేదప్పుడు?

| బిహార్ ఎమ్మెల్యే అనంత్ సింగ్ కుమార్తె శివాంగి వివాహం నవంబర్ 25న భారీ స్థాయిలో జరగనుంది. ఈ వేడుకకు 4 లక్షల మంది వస్తారని ఆయన ప్రకటించారు. పాకిస్థాన్‌లోని పరిచయస్తులకూ ఆహ్వానాలు పంపినట్లు తెలిపారు. గుర్రాల పందేల్లో విజేతకు థార్ కారు బహుమతిగా ఇవ్వనుండగా, పెళ్లి కోసం రూ.50 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

By - A.N.Kumar
Update: 2026-11-19 03:12 GMT

బిహార్ రాజకీయాల్లో ఎప్పుడూ విభిన్నమైన శైలితో వార్తల్లో నిలిచే ఎమ్మెల్యే అనంత్ సింగ్.. తాజాగా తన కుమార్తె శివాంగి వివాహ ఏర్పాట్లతో మరోసారి జాతీయ స్థాయిలో చర్చకు తెరలేపారు. సాధారణంగా పెళ్లిళ్లు అంటే కుటుంబ సభ్యులు.. బంధుమిత్రుల కలయికతో కూడిన వేడుకలుగా ఉంటాయి. కానీ ఈ నెల 25న జరగనున్న ఈ వివాహ వేడుకలకు సంబంధించి బయటకు వస్తున్న వివరాలు చూస్తుంటే మైండ్ బ్లాక్ అవుతోంది. ఇది ఒక వివాహ వేడుకలా కాకుండా ఒక భారీ విందు జనానికి పంచిపెడుతున్నారనేలా సాగుతోంది.

సాధారణంగా సెలబ్రిటీలు లేదా రాజకీయ నాయకుల ఇళ్లలో జరిగే శుభకార్యాలకు వేల సంఖ్యలో అతిథులు హాజరవుతుంటారు. అయితే తన కుమార్తె వివాహానికి ఏకంగా 4 లక్షల మంది వస్తారని స్వయంగా అనంత్ సింగ్ ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇంతటి భారీ సంఖ్యలో జనం వస్తే అది పెళ్లి విందులా ఉంటుందా లేక ఎన్నికల ప్రచార సభలా మారుతుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీనికి తోడు పాకిస్థాన్‌లో ఉన్న తన పరిచయస్థులకు కూడా పెళ్లి ఆహ్వానాలు పంపినట్లు ఆయన వెల్లడించడంతో ఈ వేడుక స్థానిక స్థాయి దాటి అంతర్జాతీయ చర్చకు కూడా దారితీసింది. అయితే సరిహద్దు దాటి ఎంతమంది అతిథులు వస్తారన్నది వేచి చూడాలి.

పెళ్లికి వచ్చే అతిథుల కోసం సాధారణంగా సంగీత విభావరి లేదా సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తుంటారు. కానీ ఇక్కడ వినోదం కోసం ఏకంగా గుర్రాల రేసును నిర్వహిస్తుండటం విశేషం. అంతేకాదు ఈ రేసులో విజేతగా నిలిచిన వారికి మహీంద్రా థార్ కారును బహుమతిగా అందించనున్నట్లు అనంత్ సింగ్ ప్రకటించారు. పెళ్లి వేడుకల్లో అతిథులకు రిటర్న్ గిఫ్ట్‌లు ఇవ్వడం చూశాం కానీ ఇలా పోటీలు పెట్టి ఖరీదైన కారును బహుమతిగా ప్రకటించడం ఈ వివాహాన్ని ప్రత్యేకంగా నిలబెడుతోంది.

ఈ వేడుకకు సంబంధించి మరో ఆసక్తికరమైన చర్చ ఖర్చుల విషయంలో నడుస్తోంది. అనంత్ సింగ్ కుటుంబానికి సుమారు రూ. 100 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు ప్రచారం జరుగుతుండగా ఈ ఒక్క పెళ్లి కోసమే దాదాపు రూ. 50 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. అంటే ఉన్న ఆస్తిలో సగం మొత్తాన్ని కుమార్తె వివాహానికే వెచ్చిస్తున్నారన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఒక తండ్రి తన కుమార్తె వివాహాన్ని జీవితాంతం గుర్తుండిపోయేలా ఘనంగా చేయాలని కోరుకోవడం సహజమే. అయితే నాలుగు లక్షల మంది అతిథులు.. విదేశీ ఆహ్వానాలు.. గుర్రాల పందేలు.. కోట్ల రూపాయల వ్యయం వంటి అంశాలు ఈ వేడుకను కేవలం ఒక కుటుంబ కార్యక్రమంగా కాకుండా ఒక రాజకీయ శక్తి ప్రదర్శన కనిపిస్తోంది. అటు విందుకు విందు.. ఇటు జనాదరణతో ఓట్లు సంపాదించే ప్లాన్ లాగా తోస్తోంది. మరి నవంబర్ 25న జరగనున్న ఈ వేడుక దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించడం ఖాయంగా కనిపిస్తోంది.

Tags:    
  • anantsingh 
  • biharpolitics 
  • shivangiwedding 

Similar News

నితీష్ మీద కాంగ్రెస్ సాఫ్ట్ కార్నర్...బీజేపీ మీద నిప్పులు !

2026-10-26 03:45 GMT

పీకే ప్రశంసలు...ఇండియా కూటమి వైపు నితిన్ ?

2026-10-19 04:30 GMT

పీకే ‘పీచేముడ్’.. ఈ ట్విస్ట్ ఊహించలేదు సామీ!

2026-10-18 16:30 GMT

బీహార్ యువకుడిని పెళ్లాడేందుకు రష్యా మహిళ.. వైరల్ వార్తలో నిజమెంత?

2026-10-14 18:15 GMT

బిహార్‌లో ఘోరం: పదో తరగతి విద్యార్థినిపై మూకుమ్మడి వేధింపులు.. తీవ్రంగా స్పందించిన రాహుల్ గాంధీ

2026-09-21 13:33 GMT

అఫిడవిట్‌లో యాక్టివా.. రోల్స్ రాయిస్‌లో షికారు! అసలు ఈ యువ లేడి ఎమ్మెల్యే కథేంటంటే?

2026-09-21 08:33 GMT

అచ్చం దానం కేసు మాదిరే మ‌హాచంద్ర ప్ర‌సాద్ సింగ్ ఉదంతం

2026-09-20 16:39 GMT

యూసీసీకి నో ...బీజేపీకి జేడీయూ గట్టి షాక్

2026-09-15 04:15 GMT

వీడియో : ఇలాంటివి మీరు చేయొద్దన్న ఆనంద్ మహీంద్ర

2026-09-10 06:18 GMT

ఆలయంలో మృత్యుఘోష‌: ప్ర‌చార‌మే ముంచింది!

2026-08-17 14:59 GMT

నితీష్ గుర్రుగా ఉన్నారా...ఎన్నాళ్ళీ వెయిటింగ్ ?

2026-08-09 04:20 GMT

Copyright @2026

Powered by Blink CMS