వీడియో : ఇలాంటివి మీరు చేయొద్దన్న ఆనంద్ మహీంద్ర
కారును కాపాడుకోవడం కోసం మనోజ్ యాదవ్, అతడి కుటుంబ సభ్యులు చూపించిన క్రియేటివిటీని ఆనంద్ మహీంద్ర అభినందించాడు.
బీహార్‌లో ఒక వ్యక్తి ఇటీవల తన ఇంటి పై కప్పు మీదకి క్రేన్ సాయంతో స్కార్పియో క్లాసిక్ కారును ఎక్కించి, అక్కడ పార్క్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బీహార్‌లో దొంగల భయం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా రోడ్డు మీద పార్క్ చేసిన వాహనాలను తీసుకు వెళ్లి, కనీసం గుర్తించకుండా మార్చేసి అమ్మేస్తున్నారట. అందుకే కార్లను కొనుగోలు చేయడానికి కూడా అక్కడి వారు భయపడుతున్నారని అంటారు. ప్రభుత్వ వాహనాలను సైతం దొంగలు ఎత్తుకు వెళ్లిన కేసులు అక్కడ చాలానే నమోదు అవుతున్నాయి. ఖరీదైన కార్లు రోడ్డు మీద కనిపిస్తే చాలు దాన్ని ఎత్తుకు పోతున్న దొంగలు బీహార్‌లో ఎక్కువ మంది అయ్యారు. బీహార్‌లోనే ఆ కారును మొత్తం మార్చేసి, పక్క రాష్ట్రాల్లో తక్కువ రేట్లకు అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. అందుకే ఆ వ్యక్తి తన కారును డాబాపై పార్క్ చేశాడు.
బీహార్‌లో దొంగల భయం కారణంగా కారును...
విదేశాల్లో వర్క్ చేసే వ్యక్తి కొత్త కారు కొనుగోలు చేశాడు. తిరిగి విదేశాలకు వెళ్లాల్సి వచ్చిన సమయంలో ఆ కారు రోజుల తరబడి పార్క్ చేసి ఉంటే కచ్చితంగా దొంగలు పడుతారు అని ఆయన భావించాడు. అందుకే కాస్త ఖర్చు అయినా పర్వాలేదు, రిస్క్ తీసుకుని మరీ స్లాబ్ మీద కారును పార్క్ చేయడం జరిగిందనే వార్తలు వస్తున్నాయి. కారును అంత ఎత్తులో పార్కింగ్ చేయడం ఏంటంటూ కొందరు అతడి తీరును విమర్శిస్తూ ఉంటే, కొందరు ఆయన ఐడియా సూపర్ అంటూ ప్రశంసిస్తున్నారు. తాజాగా ఈ విషయమై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర స్పందించాడు. ఆ వైరల్ వీడియోను తన ఎక్స్‌లో షేర్ చేసిన ఆనంద్ మహీంద్ర ఆ వీడియో వెనుక తాను తెలుసుకున్న అసలు విషయాన్ని వివరించాడు. అయితే దీన్ని మీ ఇంటి వద్ద ప్రయత్నం చేయకండి అంటూ కూడా చివర్లో విజ్ఞప్తి చేయడం జరిగింది.
ఆనంద్ మహీంద్ర తన ఎక్స్‌లో వీడియో...
ఆనంద్ మహీంద్ర తన ఎక్స్‌లో... ఇజ్రాయిల్ కంపెనీలో పని చేసే గోపాల్‌గంజ్ ప్రాంతానికి చెందిన మనోజ్ యాదవ్ ఇటీవల ఇండియాకు వచ్చిన సమయంలో తన కుటుంబ అవరాసరాల కోసం మహీంద్ర స్కార్పియో క్లాసిక్ కొత్త మోడల్ కారును కొనుగోలు చేయడం జరిగింది. మనోజ్ తిరిగి ఇజ్రాయిల్ వెళ్లాల్సి వచ్చింది. అయితే ఎస్‌యూవీని నడిపే వారు ఫ్యామిలీలో ఎవరు లేకపోవడంతో, ఆ వాహనం యొక్క భద్రతను దృష్టిలో పెట్టుకుని ఇంటి పై కప్పు మీద క్రేన్ సాయంతో పెట్టాలని నిర్ణయించుకున్నాడు. అందుకు తగ్గట్లుగానే భారీ క్రేన్‌ను తీసుకు వచ్చి కారును పైన పెట్టాడు. మేము స్కార్పియో దాదాపు ఎక్కడికైనా వెళ్తుందని అంటాము. దాన్ని మనోజ్ సీరియస్‌గా తీసుకుని ఉంటాడు. అందుకే స్కార్పియోను ఏకంగా స్లామ్ మీదకు తీసుకు వెళ్లాడని ఆనంద్ మహీంద్ర సరదాగా వ్యాఖ్యలు చేశారు.
మహీంద్రా స్కార్పియో కారు...
కారును కాపాడుకోవడం కోసం మనోజ్ యాదవ్, అతడి కుటుంబ సభ్యులు చూపించిన క్రియేటివిటీని ఆనంద్ మహీంద్ర అభినందించాడు. అయితే వారి ఇంటి పై కప్పు ఆ కారు వెయిట్‌ను ఆపేంత బలంగా ఉందా అనే ఆందోళనను ఆనంద్ మహీంద్ర వ్యక్తం చేశాడు. అంత భారీ వాహనం వెయిట్‌ను ఆపే శక్తి ఆ ఇంటి పై కప్పుకు ఉంటే ఎలాంటి ఇబ్బంది లేదు అన్నట్లుగా ఆనంద్ మహీంద్ర పేర్కొన్నాడు. అయితే తనను ఫాలో అయ్యే ఏ ఒక్కరు ఇలాంటివి ఇంటి వద్ద ప్రయత్నించొద్దు అంటూ విజ్ఞప్తి చేశాడు. ఆనంద్ మహీంద్ర చేసిన పోస్ట్‌కు పెద్ద ఎత్తున స్పందన లభించింది. చాలా మంది ఆ వ్యక్తి చేసిన పనిని సమర్ధిస్తే, కొందరు మాత్రం ఆ వ్యక్తి పార్క్ చేసిన విధానం కరెక్ట్ కాదని అంటున్నారు. కొన్ని వారాలు లేదా నెలల తర్వాత అయినా ఆ ఇంటి పై కప్పు భారం ఆపలేక కృంగి పోయే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే వైరల్ అయిన ఆ వీడియోను ఆనంద్ మహీంద్ర షేర్ చేయడంతో మరింత వైరల్ అవుతోంది.