• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  USA >  అంతరిక్షాన్ని...

అంతరిక్షాన్ని ఆక్రమించేస్తున్నావా మస్క్ మావా..

| లాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ మరో 10 లక్షల ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపేందుకు అమెరికా ఎఫ్‌సీసీ అనుమతి ఇచ్చినట్లు కథనం పేర్కొంది. అంతరిక్షంలో సౌరశక్తితో ఏఐ డేటా సెంటర్లు ఏర్పాటు చేయడం ఈ ప్రణాళిక లక్ష్యం. అయితే ఇన్ని ఉపగ్రహాలతో స్పేస్ ట్రాఫిక్, వ్యర్థాల సమస్యలు పెరుగుతాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

By - A.N.Kumar
Update: 2026-11-26 08:44 GMT

భూమి మీద రోడ్ల రద్దీ చాలదన్నట్లు.. ఇక అంతరిక్షంలోనూ ట్రాఫిక్ జామ్‌లు తప్పవా? సాధారణ జనం ఇంటి పక్కన కరెంటు స్తంభం ఎప్పుడు వేస్తారా అని ఎదురుచూస్తుంటే.. ఎలాన్ మస్క్ మాత్రం ఏకంగా సూర్యుడి పక్కనే డేటా సెంటర్ల సామ్రాజ్యం కట్టేందుకు రెడీ అవుతున్నారు.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 10 లక్షల ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపేందుకు స్పేస్ఎక్స్‌కు అమెరికా ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (ఎఫ్.సీసీ) అనుమతి ఇవ్వడం ఇప్పుడు టెక్ లోకంలో పెద్ద సంచలనమైంది.. అంతకుమించి పెద్ద చర్చలా మారింది.

ఇప్పటివరకు అంతరిక్షం అనగానే చంద్రుడు.. అంగారకుడు.. రాకెట్లు గుర్తొచ్చేవి. కానీ మస్క్ స్పీడ్ చూస్తుంటే.. రేపు మన ప్రశ్నలకు జవాబులు చెప్పే ఏఐ సర్వర్లు కూడా పైనుంచే పనిచేసేలా ఉన్నాయి. భూమి మీద డేటా సెంటర్లు కట్టాలంటే స్థలం చాలడం లేదు.. విద్యుత్ గ్రిడ్లపై లోడ్ పెరిగిపోతోంది.. కూలింగ్ కోసం నీటి వినియోగం తడిసిమోపెడవుతోంది. దీనికి మస్క్ ఇచ్చిన ఆకాశమంత పరిష్కారమే ఈ లక్షల ఉపగ్రహాల ప్లాన్. 2033లో ప్రయోగాలు మొదలుపెట్టి.. 2035 నాటికి 10 శాతం.. 2038 నాటికి 50 శాతం ఉపగ్రహాలను కక్ష్యలోకి చేర్చాలన్నది లక్ష్యం. ఇది ప్రపంచానికి గొప్ప ఆస్తిగా మారుతుందని మస్క్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.

ఏఐ చాట్‌బాట్స్ నుంచి రోబోట్ల వరకు ప్రతిదానికీ భారీ కంప్యూటింగ్ శక్తి కావాలి. భూమి మీద సర్వర్లు నడపాలంటే కరెంటు బిల్లులు చూసి సామాన్యుడికి గుండె ఆగినంత పనవుతోంది. మస్క్ మాత్రం సౌరశక్తిని వాడుకుంటూ.. భూమిపై వనరుల ఒత్తిడి తగ్గిస్తూ అంతరిక్షంలోనే డేటా ప్రాసెసింగ్ చేయాలని చూస్తున్నారు.

ప్రస్తుతం అంతరిక్షంలో సుమారు 17 వేల యాక్టివ్ శాటిలైట్లు ఉన్నాయట... అలాంటిది మరో 10 లక్షల ఉపగ్రహాలు చేరితే.. పైనున్న రద్దీని స్పేస్ ట్రాఫిక్ పోలీసులు ఎలా కంట్రోల్ చేస్తారో మరి.. అంతరిక్ష వ్యర్థాలు పెరిగిపోయి.. ఉపగ్రహాలు ఒకదానికొకటి ఢీకొనే ప్రమాదం ఉండదా? అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.

భూమి మీద సిగ్నల్ సరిగ్గా రాక టవర్ల కోసం ఎదురుచూసే రోజుల నుంచి రేపు ఏఐ సర్వర్ డౌన్ అయితే అంతరిక్షంలోని ఉపగ్రహానికి కంప్లైంట్ చేసే రోజులు వస్తాయేమో.. వ్యాపారవేత్తలు భూమిపై మార్కెట్ వెతుక్కుంటే మస్క్ మార్కెట్ కోసమే ఆకాశాన్ని సిద్ధం చేస్తున్నారు. ఇది నిజంగానే టెక్ ప్రపంచాన్ని కొత్త పుంతలు తొక్కిస్తుందా? లేక కక్ష్యలో మరో ట్రాఫిక్ తలనొప్పిగా మారుతుందా అన్నది కాలమే చెప్పాలి.

Tags:    
  • elonmusk 
  • spacex 
  • satellites 
  • a idatacenters 
  • space technology 
  • fcc 
  • artificialintelligence 

Similar News

అమెరికా పిల్లలకు SpaceX షేర్లు ఇవ్వనున్న ఎలాన్ మస్క్.. ఎప్పటి నుంచి అంటే?

2026-11-26 08:52 GMT

పంది కిడ్నీతో ఏడాది గడిపిన మహిళ.. డయాలసిస్ అవసరం లేకుండా!

2026-11-25 17:53 GMT

భారత్‌కు ట్రంప్ మరో షాక్.. ఎగుమతులపై కొత్త టారిఫ్‌ల ప్రతిపాదన!

2026-11-25 17:53 GMT

అమెరికా కల ఎంత గొప్పదైనా.. చిన్నారుల ప్రాణాల కంటే గొప్పది కాదు...

2026-11-25 13:13 GMT

అమెరికా కల చెదిరిందా? భారతీయ టెక్కీల గుండెల్లో ఐబీఎం పెట్టిన 'డిసెంబర్ 31' పిడుగు

2026-11-25 12:51 GMT

మళ్లీ టారిఫ్ లా? కుక్కతోక వంకర.. ఈ ట్రంప్ బుద్ది ఇక మారదా?

2026-11-25 07:06 GMT

అమెరికా కలకు బీటలు.. ఆ బంగారు పంజరాన్ని వీడి సొంత గూటికి భారతీయ టెకీల పయనం

2026-11-24 09:52 GMT

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. భారతీయుడి మృతి.. ఇద్దరు పిల్లలకు గాయాలు!

2026-11-24 05:42 GMT

11 రోజులకే మళ్లీ పగ్గాలు.. ఎన్విడియాలో జెన్సన్ హువాంగ్ రీఎంట్రీ వెనుక అసలేం జరిగింది?

2026-11-23 16:30 GMT

పాకిస్తాన్‌తో పాత సంబంధాలు.. భారత్‌తో బలమైన బంధం ఎందుకు? బైడెన్ పుస్తకంలో కీలక వ్యాఖ్యలు

2026-11-23 08:08 GMT

మార్కెట్లు పడిపోతుంటే డెమోక్రాట్లపై ట్రంప్ నిందలు.. అమెరికాలో కొత్త రాజకీయ రగడ!

2026-11-23 03:58 GMT

Copyright @2026

Powered by Blink CMS