• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  USA >  అమెరికా కలకు బీటలు.. ఆ...

అమెరికా కలకు బీటలు.. ఆ బంగారు పంజరాన్ని వీడి సొంత గూటికి భారతీయ టెకీల పయనం

| ఒకప్పుడు అమెరికాలో ఉద్యోగం కోసం తహతహలాడిన భారతీయ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ఇప్పుడు అక్కడి నుంచి బయటపడేందుకు ప్రత్యామ్నాయాలు వెతుకుతున్నారు. హెచ్‌1బీ వీసా ఆంక్షలు, గ్రీన్‌కార్డ్ నిరీక్షణ, భవిష్యత్తుపై అనిశ్చితితో యూకే, కెనడా, యూఏఈ వైపు మొగ్గు చూపుతున్నారు. హైదరాబాద్, బెంగళూరులో పెరుగుతున్న ఐటీ అవకాశాలు కూడా స్వదేశానికి తిరిగొచ్చే వారి సంఖ్య పెరగడానికి కారణమవుతున్నాయి.

By - A.N.Kumar
Update: 2026-11-24 09:52 GMT

ఒకప్పుడు అమెరికా గడ్డపై అడుగుపెట్టడమే జీవిత పరమావధిగా భావించేవారు భారతీయ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు. సిలికాన్ వ్యాలీలో కొలువు.. కళ్లు చెదిరే ప్యాకేజీలు.. హెచ్‌1బీ వీసా.. ఆపై గ్రీన్‌కార్డ్.. ఇదే లక్షలాది మంది యువత కలల ప్రపంచం. కన్నవారిని.. పుట్టిన గడ్డను వదిలి వేల మైళ్ల దూరం వెళ్లినా ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్న ఆశతో ఎన్నో సవాళ్లను తట్టుకున్నారు. కానీ కాలం మారింది.. పరిస్థితులు తలకిందులయ్యాయి. ఒకప్పుడు అమెరికా వెళ్లాలని కలలు కన్నవారే ఇప్పుడు ఆ 'కలల దేశం' నుంచి బయటపడే మార్గాలను అన్వేషిస్తున్నారు. చేతినిండా డాలర్లు వస్తున్నా మనశ్శాంతి.. భద్రత కరువైన చోట ఉండటం ఎందుకన్న ఆలోచన భారతీయ టెకీలలో బలపడుతోంది.

అమెరికాలో మారుతున్న వలసదారుల మనోభావాలకు అద్దం పట్టేలా నవంబర్ 20న ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ 'బ్లూమ్‌బెర్గ్' ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. శాన్‌ఫ్రాన్సిస్కోలోని గూగుల్ సంస్థలో పనిచేస్తున్న 36 ఏళ్ల యశ్ శర్మ అనుభవం దీనికి నిదర్శనం. ఆరేళ్లుగా హెచ్‌1బీ వీసాపై అమెరికాలో స్థిరపడిన ఆయన ఉన్నతమైన ఉద్యోగాన్ని వదులుకుని యూకే గ్లోబల్ టాలెంట్ వీసాతో బ్రిటన్ వెళ్లేందుకు సిద్ధమయ్యారు.

అమెరికా జీవితాన్ని ఆయన బంగారు పంజరంగా అభివర్ణించడం అక్కడి పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. బయటకు అంతా వైభవంగా.. విలాసవంతంగా కనిపిస్తున్నా.. లోపల మాత్రం వీసా రెన్యువల్ భయాలు.. దశాబ్దాల తరబడి తేలని గ్రీన్‌కార్డ్ నిరీక్షణ.. రేపటిపై అనిశ్చితి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

భారతీయ నిపుణులు అమెరికాకు దూరం కావడానికి మారుతున్న వీసా విధానాలు ప్రధాన కారణమవుతున్నాయి. అమెరికా విదేశాంగ శాఖ గణాంకాల ప్రకారం.. 2025 ఆర్థిక సంవత్సరంay భారతీయులకు మొత్తం 1,48,298 హెచ్‌1బీ వీసాలు జారీ అయ్యాయి. 2026 జనవరి-ఫిబ్రవరిలో ఈ సంఖ్య అనూహ్యంగా కేవలం 3,047కు పడిపోయింది.. 2025లో ఇదే రెండు నెలల్లో 31,135 వీసాలు జారీ కావడం గమనార్హం. దీనికి తోడు ట్రంప్ యంత్రాంగం తెచ్చిన కఠిన నిబంధనలు అగ్నికి ఆజ్యం పోశాయి. 2025 సెప్టెంబర్‌లో కొత్తగా విదేశాల నుంచి వచ్చే నిర్దిష్ట హెచ్‌1బీ ఉద్యోగులపై 1,00,000 డాలర్ల భారీ రుసుము విధించే నిబంధనను ప్రకటించారు. దీనిని 2026 జూన్‌లో ఫెడరల్ కోర్టు కొట్టివేసినప్పటికీ ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్లడం.. ఆగస్టులో హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ఏకంగా 1,03,265 డాలర్ల ఫీజు ప్రతిపాదనను తెరపైకి తేవడం టెక్ కంపెనీలకు తలనొప్పిగా మారింది. ఫలితంగా ఐబీఎం వంటి దిగ్గజ సంస్థలు సైతం కన్సల్టింగ్ విభాగాల్లో వీసా స్పాన్సర్‌షిప్‌లను తగ్గించుకుంటూ ఇతర దేశాల్లో నియామకాలపై దృష్టి సారిస్తున్నాయి.

వేతనాల ఆధారిత వీసా ఎంపిక విధానం.. కఠినతరమవుతున్న గ్రీన్‌కార్డ్ నిబంధనల నేపథ్యంలో భారతీయ టెకీలు తమ ప్రాధాన్యతలను మార్చుకుంటున్నారు. అమెరికాకు ప్రత్యామ్నాయంగా యూకే, కెనడా, యూఏఈ వంటి దేశాల వైపు చూస్తున్నారు. స్వదేశానికి తిరిగి వచ్చే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలు అంతర్జాతీయ స్థాయి ఐటీ హబ్‌లుగా ఎదగడం.. ఇక్కడే అత్యుత్తమ వేతనాలు.. గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు అందుబాటులోకి రావడంతో 'రివర్స్ బ్రెయిన్ డ్రెయిన్' ఊపందుకుంటోంది.

ఎన్నో ఏళ్ల కష్టం.. పిల్లల చదువులు.. స్థిరపడిన జీవనశైలిని వదులుకుని ఒక దేశాన్ని వీడటం అంత సులభమైన నిర్ణయం కాదు. అయితే భవిష్యత్తుపై భరోసా లేనప్పుడు ఎంత పెద్ద జీతమైనా సంతృప్తిని ఇవ్వలేదని టెకీలు భావిస్తున్నారు. అమెరికా విశ్వవిద్యాలయాలు.. పరిశోధనా సంస్థలు ఇప్పటికీ ప్రతిభావంతులను ఆకర్షిస్తున్నప్పటికీ ఒకప్పటి ఏకపక్ష ఆకర్షణ మాత్రం తగ్గుతోంది. అమెరికా కల వెనుక పరుగెత్తడం కంటే.. తమకు.. తమ కుటుంబానికి ఎక్కడ భద్రత.. స్థిరత్వం.. సంతోషం లభిస్తాయో అక్కడే కొత్త జీవితాన్ని నిర్మించుకోవాలనే పరిణతి భారతీయ నిపుణుల్లో స్పష్టంగా కనిపిస్తోంది.

Tags:    
  • indiantechies 
  • h1bvisa 
  • americandream 
  • reversebraindrain 

Similar News

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. భారతీయుడి మృతి.. ఇద్దరు పిల్లలకు గాయాలు!

2026-11-24 05:42 GMT

11 రోజులకే మళ్లీ పగ్గాలు.. ఎన్విడియాలో జెన్సన్ హువాంగ్ రీఎంట్రీ వెనుక అసలేం జరిగింది?

2026-11-23 16:30 GMT

పాకిస్తాన్‌తో పాత సంబంధాలు.. భారత్‌తో బలమైన బంధం ఎందుకు? బైడెన్ పుస్తకంలో కీలక వ్యాఖ్యలు

2026-11-23 08:08 GMT

మార్కెట్లు పడిపోతుంటే డెమోక్రాట్లపై ట్రంప్ నిందలు.. అమెరికాలో కొత్త రాజకీయ రగడ!

2026-11-23 03:58 GMT

ఫోన్ సెట్టింగ్స్ మార్చమంటే.. జీవితమే రీసెట్ అయ్యే పరిస్థితి.. అమెరికాలో భారతీయ ఉద్యోగికి షాక్

2026-11-23 02:34 GMT

మొన్న ఎన్నిక‌లు.. నేడు వృద్ధి.. భార‌త్‌ను చూసి నేర్చుకోవాలంటున్న ట్రంప్‌

2026-11-21 17:41 GMT

ట్రంప్ కొత్త 'డేటా' దేశభక్తి పాఠం.. వినకపోతే ఖతమేనట..

2026-11-21 06:31 GMT

అమెరికాలో భారతీయ ఉద్యోగులకు ఊరట? H-1B వీసాలపై కీలక నిర్ణయం తీసుకోనున్న కొత్త గవర్నర్

2026-11-21 04:25 GMT

వాన్స్‌కు షాక్ ఇవ్వనున్న ట్రంప్.. 2028 రేసులో రూబియో పేరు!

2026-11-19 05:37 GMT

H-1B స్లాట్ల కోసం రోజూ ఎదురుచూపులు.. బుక్ చేసేలోపే మాయం!

2026-11-19 05:09 GMT

GTA 6 కోసం నాలుగు రోజులు సెలవు.. అమెరికా సైనికులకు అదిరిపోయే ఆఫర్!

2026-11-19 05:08 GMT

Copyright @2026

Powered by Blink CMS