• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Overseas >  ట్రంప్ కొత్త 'డేటా'...

ట్రంప్ కొత్త 'డేటా' దేశభక్తి పాఠం.. వినకపోతే ఖతమేనట..

| అమెరికా టెక్ కంపెనీలు విదేశాల్లో డేటా సెంటర్లు నిర్మిస్తే భారీ పన్నులు, జరిమానాలు విధిస్తామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఏఐ రంగంలో అమెరికా ఆధిపత్యాన్ని కాపాడటంతో పాటు పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు దేశంలోనే ఉండాలన్నది తన ఉద్దేశమని తెలిపారు. ఈ ప్రణాళికపై సొంత ప్రభుత్వ అధికారులతోనూ ఇంకా చర్చించలేదని వెల్లడించారు.

By - A.N.Kumar
Update: 2026-11-21 06:31 GMT

అంట ఆగడు పడుకుంటే లేవడు అన్నట్టు.. ట్రంప్ ఏది కల వస్తే పొద్దున్నే వచ్చే కనీసం అమెరికా ప్రభుత్వానికి, అధికారులకు చెప్పకుండానే ప్రకటించేస్తాడు.. ఇప్పుడు అదే జరిగింది.. కంప్యూటింగ్ మేధస్సు అమెరికాది.. చిప్‌లు అమెరికావి.. సర్వర్లు అమెరికావి.. మరి ఆ డేటా సెంటర్లను మాత్రం విదేశీ గడ్డపై కట్టి చైనాకు వడ్డించి పెడతారా? అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టెక్ దిగ్గజాలకు మేక్ ఏఐ గ్రేట్ అగైన్ అంటూ క్లాస్ పీకారు. స్వంత అధికారులకే ఇంకా వివరించని తన కొత్త ట్యాక్స్-అండ్-ఫైన్ అస్త్రాన్ని బయటకు తీస్తూ.. విదేశాల్లో సర్వర్లు పెడితే జరిమానాల మోత మోగిస్తానని.. సర్వర్ల వేడి నుంచి సర్కారు బడుల టీచర్ల జీతాల వరకు అన్నీ అమెరికా గడ్డపైనే తేలాలని ట్రంప్ కొత్త డేటా దేశభక్తి పాఠం మొదలుపెట్టారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన అమెరికా ఫస్ట్ నినాదాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగానికి అన్వయించారు. అమెరికన్ టెక్ కంపెనీలు విదేశాల్లో డేటా సెంటర్లను నిర్మించడాన్ని అనుమతించబోమని ట్రంప్ స్పష్టం చేశారు. ఒకవేళ విదేశాల్లో డేటా సెంటర్ల నిర్మాణానికి ప్రయత్నిస్తే భారీ పన్నులు.. జరిమానాలు తప్పవని ఆయన హెచ్చరించారు.

ప్రపంచవ్యాప్తంగా ఏఐ ఆధిపత్యం కోసం తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో అమెరికా సాంకేతిక మౌలిక సదుపాయాలు చైనా చేతుల్లోకి వెళ్లకుండా అడ్డుకోవడమే తన ప్రధాన ఉద్దేశమని ట్రంప్ పేర్కొన్నారు. విదేశాల్లో డేటా సెంటర్లు నిర్మిస్తే వాటిని చైనా తన ఆధీనంలోకి తీసుకునే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ ప్రణాళిక గురించి తన ప్రభుత్వ అధికారులకు కూడా ఇంకా పూర్తిస్థాయిలో వివరించలేదని ఆయనే స్వయంగా పేర్కొనడం చూసి అందరూ ముక్కున వేలేసుకున్నారు.

సూపర్ ఇంటెలిజెన్స్ రంగంలో అమెరికా ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందని.. చైనా రెండో స్థానంలో ఉందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. మిగతా దేశాలు ఈ రెండు దేశాలకు దరిదాపుల్లో కూడా లేవని అమెరికా సాంకేతిక పురోగతిని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ కూడా అభినందించారని ఆయన తెలిపారు. మరోవైపు డేటా సెంటర్లను కేవలం టెక్ కంపెనీల వ్యాపారంగా కాకుండా స్థానిక అమెరికన్లకు ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చే వనరులుగా చూడాలని ట్రంప్ సూచించారు. విదేశాలకు బదులు అమెరికాలోనే వీటిని నిర్మిస్తే దేశంలోనే సంపద, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ప్రభుత్వాలకు పన్నుల రూపంలో ఆదాయం సమకూరుతుంది. విద్యా సంస్థలకు నిధులు, ఉపాధ్యాయులకు అదనపు ప్రయోజనాలు కల్పించేలా కంపెనీలతో స్థానికులు ఒప్పందాలు చేసుకోవాలని ట్రంప్ ఆకాంక్షించారు.

ట్రంప్ హెచ్చరికలు అమల్లోకి వస్తే అమెరికన్ టెక్ దిగ్గజాల అంతర్జాతీయ విస్తరణ ప్రణాళికలపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పటికే పలు కంపెనీలు యూరప్, ఆసియా దేశాల్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. స్థానిక వినియోగదారులకు వేగవంతమైన సేవలు అందించడానికి ఆయా దేశాల డేటా నిల్వ నిబంధనలను పాటించడానికి విదేశీ డేటా సెంటర్లు ఎంతో అవసరం.

అదే సమయంలో అన్ని డేటా సెంటర్లను అమెరికాలోనే నిర్మించడం వల్ల దేశీయంగా విద్యుత్ వినియోగం.. నీటి వనరుల లభ్యత.. పర్యావరణ ప్రభావం వంటి కొత్త సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఏఐ ఆధిపత్యం కోసం ట్రంప్ ప్రతిపాదించిన ఈ కొత్త విధానం ప్రపంచ టెక్నాలజీ పెట్టుబడుల దిశను ఎలా మారుస్తుందో వేచి చూడాలి.

Tags:    
  • donaldtrump 
  • aipolicy 
  • datacentres 
  • artificialintelligence 
  • usgovernment 

Similar News

అమెరికాలో భారతీయ ఉద్యోగులకు ఊరట? H-1B వీసాలపై కీలక నిర్ణయం తీసుకోనున్న కొత్త గవర్నర్

2026-11-21 04:25 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

ట్రంప్ మీడియాతో మాట్లాడుతుండగా.. ‘షాల్ వుయ్ మూవ్?’ అన్న మోదీ!

2026-11-18 06:50 GMT

మొన్న మైక్రోసాఫ్ట్.. నేడు అమెరికా బ్యాంకులు.. అగ్రరాజ్యంలో అసలేం జరుగుతోంది?

2026-11-17 10:30 GMT

అమెరికాలో భారతీయ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ట్రంప్ తెచ్చిన కొత్త రూల్‌ను కొట్టేసిన కోర్టు!

2026-11-17 10:20 GMT

డర్టీ బాంబ్‌.. పేలుడు కంటే రేడియేషన్‌తోనే ఎక్కువ ముప్పు!

2026-11-17 10:01 GMT

రోడ్లపై 'ఎర్ర' సముద్రం.. ఇదీ ప్రకృతి సృష్టిస్తున్న అద్భుత దృశ్యం

2026-11-17 05:35 GMT

అమెరికాలో ఇరాన్ దాడికి ప్లాన్ చేస్తోందా? ట్రంప్ అధికారులకు భద్రత పెంపు!

2026-11-17 05:35 GMT

ఆస్ట్రేలియాలో చదువుతున్న వారికి కొత్త తలనొప్పి.. కుటుంబ సభ్యుల వీసాపై మారిన రూల్స్!

2026-11-17 04:41 GMT

అమెరికాలో భారతీయ విద్యార్థుల సంఖ్య తగ్గింది.. మాస్టర్స్ చదువుపైనే ఎక్కువ ప్రభావం!

2026-11-17 04:38 GMT

ఇంట్లో తినడానికి గుప్పెడు పిండి లేదు.. కానీ భారత్‌ను కొట్టడానికి టర్కీ నుంచి ఏకంగా లక్ష డ్రోన్లట..

2026-11-16 07:57 GMT

Copyright @2026

Powered by Blink CMS