• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Overseas >  రోడ్లపై 'ఎర్ర' సముద్రం.....

రోడ్లపై 'ఎర్ర' సముద్రం.. ఇదీ ప్రకృతి సృష్టిస్తున్న అద్భుత దృశ్యం

| ఆస్ట్రేలియాలోని క్రిస్‌మస్ ఐలాండ్‌లో కోట్లాది ఎర్ర పీతల వలస ప్రయాణం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సంతానోత్పత్తి కోసం అడవుల నుంచి సముద్రం వైపు పీతలు గుంపులుగా కదులుతున్నాయి. వాటి రాకతో రోడ్లన్నీ ఎర్రగా మారుతున్నాయి. పీతలకు ప్రమాదం జరగకుండా అధికారులు రోడ్లు మూసివేయడంతో పాటు ప్రత్యేక బ్రిడ్జిలు, అండర్‌పాస్‌లు ఏర్పాటు చేశారు.

By - A.N.Kumar
Update: 2026-11-17 05:35 GMT

వేల సంఖ్యలో కాదు.. లక్షల్లో కాదు.. కోట్లాది ఎర్ర పీతలు ఒకేసారి అడవిని వీడి రోడ్లపైకి వస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఎక్కడ చూసినా ఎరుపురంగు పరుచుకున్నట్లుగా కనిపించే ఈ అద్భుత దృశ్యం ఇప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. ఆస్ట్రేలియాలోని క్రిస్ మస్ ఐలాండ్ లో ప్రారంభమైన రెడ్ క్రాబ్స్ గ్రేట్ మైగ్రేషన్ ప్రకృతి అద్భుతాలకు మరో నిదర్శనంగా నిలుస్తోంది.

సాధారణంగా మనం రోడ్లపై కార్లు.. బైక్‌లు.. వాహనాల రద్దీని చూస్తుంటాం. కానీ ఈ దీవిలో మాత్రం కార్ల కంటే ఎర్ర పీతలే అధికంగా కనిపిస్తున్నాయి. దట్టమైన అడవుల్లో నివసించే కోట్లాది ఎర్ర పీతలు సంతానోత్పత్తి సమయం ఆసన్నమవగానే సముద్రం వైపు తమ ప్రయాణాన్ని ప్రారంభిస్తాయి. వర్షాకాలం ప్రారంభమై నేలలో తేమ శాతం అనుకూలించిన క్షణాల నుంచి ఈ చిన్న జీవుల పెద్ద ప్రయాణం ఊపందుకుంటుంది. అడవుల నుంచి బయటపడ్డ ఆ జీవులు రోడ్లు.. కాలిబాటలు.. చివరికి ఇళ్ల ముందటి నుంచి కూడా గుంపులు గుంపులుగా కదులుతూ తీర ప్రాంతాల వైపు సాగిపోతాయి. ఈ మహా ప్రయాణంలో రోడ్లన్నీ పూర్తిగా ఎర్రటి రంగులోకి మారిపోయి కనువిందు చేస్తాయి.

ఈ అద్భుత ప్రయాణంలో అత్యంత మానవీయ కోణం ఏమిటంటే.. అక్కడి అధికారులు.. ప్రజలు ఈ మూగజీవాల రాకపోకలకు ఇస్తున్న ప్రాధాన్యత. వాహనాల వేగానికి కోట్లాది పీతలు బలి కాకూడదనే ఉద్దేశంతో యంత్రాంగం అప్రమత్తమవుతుంది. పీతలు సురక్షితంగా రోడ్లు దాటేందుకు వీలుగా అత్యధిక రద్దీ ఉండే మార్గాలను తాత్కాలికంగా మూసివేస్తారు. కేవలం రోడ్ల మూసివేత మాత్రమే కాకుండా పీతల కోసం ప్రత్యేకంగా 'క్రాబ్ బ్రిడ్జిలు', అండర్‌పాస్‌లను సైతం నిర్మించారు. అభివృద్ధి హడావుడిలో మనుషులు ప్రకృతిని విస్మరిస్తున్న ఈ రోజుల్లో.. మూగజీవాల ప్రాణాలకు కూడా విలువనిచ్చి ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్న ఆ అధికారుల తీరు ప్రతి ఒక్కరిచేతా ప్రశంసలు అందుకుంటోంది.

ఈ కోట్లాది పీతల ప్రయాణం కేవలం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మారడం కాదు.. అదొక సృష్టి ధర్మం.. జీవన చక్రం. సముద్ర తీరానికి చేరిన ఆడ పీతలు తమ గుడ్లను సముద్రపు నీటిలో విడుదల చేస్తాయి. ఆ గుడ్ల నుంచి వచ్చే లార్వాలు క్రమంగా సముద్రంలోనే ఎదిగి.. చిన్న పీతలుగా మారి తిరిగి భూమిపైకి వస్తాయి. ఇలా తరతరాలుగా వస్తున్న ఈ జీవన ప్రవాహం ప్రకృతిలోని సమతుల్యతను కాపాడుతూ వస్తోంది.

క్రిస్‌మస్ ఐలాండ్‌లో సాగుతున్న ఈ ఎర్రటి వలస కేవలం ఓ దృశ్య కావ్యమే కాదు.. మనిషికి ప్రకృతి ఇస్తున్న హెచ్చరిక.. చక్కటి సందేశం కూడా.. ఈ భూమి కేవలం మానవుల కోసమే కాదు.. సమస్త కోట్లాది జీవరాశులకూ సమానమైన హక్కే ఉందని ఈ సంఘటన గుర్తుచేస్తుంది. ప్రకృతి సహజమైన ప్రయాణానికి మనిషి అడ్డంకులు సృష్టించకుండా.. బాధ్యతగా అండగా నిలిస్తేనే జీవవైవిధ్యం పరిమళిస్తుంది. నేడు వైరల్ అవుతున్న ఈ వీడియోలు కేవలం వినోదానికే కాదు సుమా.... పర్యావరణం పట్ల మన బాధ్యత ఏంటో కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది.. ఆ ప్రకృతిని మనమూ గౌరవిద్దాం.. ఇతర జీవులను బతకనిద్దాం..



#ViralVideo: ఎర్ర పీతలతో ఎరుపెక్కిన క్రిస్మస్ ఐలాండ్ ఆస్ట్రేలియాలోని క్రిస్మస్ ఐలాండ్‌లో అరుదైన దృశ్యం కనిపించింది. కోట్లాది ఎర్ర పీతలు అడవుల నుంచి సముద్ర తీరం వైపు భారీగా తరలివెళ్తున్నాయి. బ్రీడింగ్ కోసం ఏటా జరిగే ఈ వలసలో భాగంగా రోడ్లు, బ్రిడ్జిలను దాటుతూ పీతలు ప్రయాణిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వాటి ప్రయాణానికి ఆటంకం కలగకుండా అధికారులు కొన్ని రోజుల పాటు పలు రహదారులను మూసివేస్తారు. #ViralNews #ChristmasIsland #RedCrabs #CrabMigration #Australia #Nature #Wildlife #TeluguNews #Tupaki Follow 👉 @tupaki_official

— Tupaki (@tupaki_official) November 17, 2026


Tags:    
  • redcrabmigration 
  • christmasisland 
  • australia 
  • naturewonder 
  • wildlifemigration 

Similar News

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

ట్రంప్ మీడియాతో మాట్లాడుతుండగా.. ‘షాల్ వుయ్ మూవ్?’ అన్న మోదీ!

2026-11-18 06:50 GMT

మొన్న మైక్రోసాఫ్ట్.. నేడు అమెరికా బ్యాంకులు.. అగ్రరాజ్యంలో అసలేం జరుగుతోంది?

2026-11-17 10:30 GMT

అమెరికాలో భారతీయ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ట్రంప్ తెచ్చిన కొత్త రూల్‌ను కొట్టేసిన కోర్టు!

2026-11-17 10:20 GMT

డర్టీ బాంబ్‌.. పేలుడు కంటే రేడియేషన్‌తోనే ఎక్కువ ముప్పు!

2026-11-17 10:01 GMT

అమెరికాలో ఇరాన్ దాడికి ప్లాన్ చేస్తోందా? ట్రంప్ అధికారులకు భద్రత పెంపు!

2026-11-17 05:35 GMT

ఆస్ట్రేలియాలో చదువుతున్న వారికి కొత్త తలనొప్పి.. కుటుంబ సభ్యుల వీసాపై మారిన రూల్స్!

2026-11-17 04:41 GMT

అమెరికాలో భారతీయ విద్యార్థుల సంఖ్య తగ్గింది.. మాస్టర్స్ చదువుపైనే ఎక్కువ ప్రభావం!

2026-11-17 04:38 GMT

ఇంట్లో తినడానికి గుప్పెడు పిండి లేదు.. కానీ భారత్‌ను కొట్టడానికి టర్కీ నుంచి ఏకంగా లక్ష డ్రోన్లట..

2026-11-16 07:57 GMT

భారత ఐటీ కంపెనీలకు అమెరికాలో కొత్త చిక్కులు.. H-1B వీసాలపై పెరుగుతున్న ఆంక్షలు!

2026-11-16 04:28 GMT

ఆర్థిక ఇబ్బందులతో ఇరాన్ ప్రజల కఠిన నిర్ణయాలు.. అవయవాల విక్రయానికి ప్రకటనలు!

2026-11-16 04:26 GMT

Copyright @2026

Powered by Blink CMS