• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Andhra Pradesh >  టీడీపీ కార్యకర్తల...

టీడీపీ కార్యకర్తల సంక్షేమానికి భారీ మొత్తం.. గ్రూప్ ఇన్సూరెన్స్ కే 191 శాతం నిధులు!

| 2025–26లో టీడీపీ ఆదాయం 60.29 శాతం తగ్గి రూ.90.64 కోట్లకు పరిమితమైనా, కార్యకర్తల గ్రూప్ ఇన్సూరెన్స్ ఖర్చును 191 శాతం పెంచి రూ.46.25 కోట్లు వెచ్చించింది. పార్టీ మొత్తం ఆస్తుల విలువ రూ.526 కోట్లకు చేరినట్లు ఈసీకి సమర్పించిన వార్షిక నివేదిక వెల్లడించింది.

By - Tupaki Political Desk
Update: 2026-11-26 10:19 GMT

అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఆదాయంలో సింహభాగాన్ని కార్యకర్తల సంక్షేమానికే వెచ్చిస్తూ సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. గత ఆర్థిక సంవత్సరంలో (2025–26) పార్టీ వార్షిక ఆదాయంలో భారీ తగ్గుదల నమోదైనప్పటికీ, కార్యకర్తల గ్రూప్ ఇన్సూరెన్స్ వ్యయాన్ని ఏకంగా 191 శాతం పెంచడం విశేషంగా చెబుతున్నారు. మార్చి 31 నాటికి ముగిసిన ఆర్థిక సంవత్సరంలో టీడీపీ మొత్తం ఆస్తుల విలువ రూ. 526 కోట్ల మైలురాయిని చేరుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘానికి (ఈసీ) సమర్పించిన వార్షిక నివేదికలో స్పష్టం చేశారు. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే తెలుగుదేశం పార్టీ ఆస్తుల విలువ రూ. 50.10 కోట్లు వృద్ధి చెందడం విశేషం.

ఎన్నికల సంవత్సరమైన 2024–25లో టీడీపీకి రూ. 228.31 కోట్ల ఆదాయం రాగా, 2025–26 ఆర్థిక సంవత్సరంలో అది 60.29 శాతం తగ్గింది. కేవలం రూ. 90.64 కోట్లకు పరిమితమైంది. ఈ ఏడాది సమకూరిన మొత్తం ఆదాయంలో స్వచ్ఛంద విరాళాల రూపంలోనే అత్యధికంగా రూ. 58.33 కోట్లు లభించాయి. రూ. 20 వేలకు పైబడిన విరాళాలలో సుమారు 77 శాతం 'ప్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్' ద్వారా ఆరు విడతల్లో పార్టీకి అందాయి. ఇక బ్యాంకు డిపాజిట్లపై వచ్చే వడ్డీ, ఇతర వనరుల ద్వారా రూ. 30.63 కోట్లు రాగా, సభ్యత్వ రుసుములు, చందాల రూపంలో రూ. 1.67 కోట్లు సమకూరాయి.

పార్టీ మొత్తం ఆస్తుల నిల్వ రూ.526 కోట్లకు చేరడంలో బ్యాంకు డిపాజిట్లదే కీలక పాత్రగా టీడీపీ స్పష్టం చేసింది. ఈసీకి సమర్పించిన లెక్కల ప్రకారం, వివిధ బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు, నగదు రూపంలో ఏకంగా రూ. 412 కోట్లు నిల్వ ఉన్నాయి. పార్టీ కార్యాలయాలకు సంబంధించిన భూములు, భవనాలు, ఇతర పరికరాల విలువ రూ. 63.35 కోట్లుగా ఉండగా, రుణాలు, అడ్వాన్సుల రూపంలో రూ. 51.37 కోట్లు ఉన్నాయి. 2024–25 ఆర్థిక సంవత్సరం ముగింపు నిల్వ రూ. 469.42 కోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి బదిలీ అయినట్లు ఆడిట్ నివేదిక వెల్లడించింది.

ఆదాయం తగ్గినప్పటికీ, టీడీపీ తన ఖర్చులను రూ. 74.28 కోట్లకే కట్టడి చేసి, మిగిలిన రూ. 16.35 కోట్లను పార్టీ జనరల్ ఫండ్‌కు జమ చేసింది. ఈ మొత్తం వ్యయంలో కార్యకర్తల సంక్షేమానికి ఇచ్చిన ప్రాధాన్యత స్పష్టంగా కనిపిస్తోంది. పరిపాలన, ఇతర సాధారణ ఖర్చుల కింద వెచ్చించిన రూ. 51.57 కోట్లలో, కేవలం పార్టీ కార్యకర్తల గ్రూప్ ఇన్సూరెన్స్ కోసమే రూ. 46.25 కోట్లు ఖర్చు చేశారు. అంతకుముందు ఏడాది ఇన్సూరెన్స్ కోసం రూ. 15.84 కోట్లు వ్యయం చేయగా, ఈసారి దానిని ఏకంగా మూడు రెట్లు (191 శాతం) పెంచడం గమనార్హం. అంటే పార్టీకి వచ్చిన మొత్తం రూ. 90.64 కోట్ల ఆదాయంలో సగానికి పైగా నిధులను క్యాడర్ బీమా రక్షణకే కేటాయించింది.

ఇతర ఖర్చుల వివరాలను చూస్తే, ఎన్నికల సంబంధిత కార్యకలాపాల కోసం రూ. 16.52 కోట్లు వెచ్చించగా, అందులో విమానాలు, హెలికాప్టర్ల ప్రయాణాల కోసమే రూ. 10.02 కోట్లు ఖర్చయ్యాయి. ఆస్తుల తరుగుదల (డిప్రిసియేషన్) కింద రూ. 4.26 కోట్లు, ఆర్థికపరమైన ఛార్జీల కింద రూ. 1.40 కోట్లు, పార్టీ కార్యాలయ ఉద్యోగుల జీతభత్యాల కోసం రూ. 51.97 లక్షలు వ్యయమైనట్లు నివేదిక పేర్కొంది. ఆర్థిక లావాదేవీల విషయంలో మొదటి నుంచీ పారదర్శకతను పాటిస్తున్న తెలుగుదేశం పార్టీ, కేవలం ఎన్నికల సంఘానికి నివేదికలు సమర్పించడమే కాకుండా ప్రతి ఏటా 'మహానాడు' వేదికగానూ పార్టీ జమాఖర్చులను కార్యకర్తల ముందు బహిరంగంగా ప్రకటిస్తోంది.

Tags:    
  • tdp 
  • telugudesamparty 
  • chandrababunaidu 
  • tdpworkers 

Similar News

తిరుమలేశుడికి 121 కేజీల బంగారం ఇచ్చింది ఎవరో తెలుసా? ఎందుకిచ్చాడంటే?

2026-11-26 09:03 GMT

కూటమిలో జనసేన పంచాయితీ.. సేనాని పవర్ ఫుల్ వ్యూహమేనా?

2026-11-26 08:57 GMT

ఎవరీ జగన్ మోహన్... విజయసాయి నోట అదే పిలుపు !

2026-11-26 05:38 GMT

లోకేష్ మమేకం.. ఇతర పార్టీలూ నేర్చాల్సిందే !

2026-11-26 03:50 GMT

విశాఖ మేయర్...వెరీ పవర్ ఫుల్ !

2026-11-26 03:50 GMT

ఢిల్లీకి ఫిర్యాదు...ఏపీ బీజేపీ నేతల వ్యూహం

2026-11-26 03:49 GMT

ఎందుకు ధిక్కరించానో పవన్ కే చెబుతా !

2026-11-26 03:44 GMT

కారం పొడితో పోలింగ్ బూత్‌లకు ....ఇదేమి పోరాటం వైసీపీ నాయకా ?

2026-11-26 03:43 GMT

యలహంక ఆస్తుల వివాదం.....విజయసాయి హాట్ కామెంట్స్

2026-11-25 17:55 GMT

వైసీపీ బోణీ కొడుతుందా ?

2026-11-25 17:54 GMT

నేనూ పాద‌యాత్ర చేస్తా.. ఎప్పుడంటే: సాయిరెడ్డి

2026-11-25 17:54 GMT

Copyright @2026

Powered by Blink CMS