• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Andhra Pradesh >  Visakhapatnam >  విశాఖ మేయర్...వెరీ పవర్...

విశాఖ మేయర్...వెరీ పవర్ ఫుల్ !

| విశాఖ మేయర్ ముక్కా శ్రావణికి కీలక అధికారాలు దక్కనున్నాయి. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ చైర్‌పర్సన్‌గా, బే టెక్ సిటీ కమిటీ సభ్యురాలిగా ఆమె వ్యవహరించనున్నారు. నగర అభివృద్ధికి సంబంధించిన కీలక నిర్ణయాల్లో భాగస్వామి కానున్నారు. తండ్రి మరణంతో ఈ నెల 24న ప్రమాణ స్వీకారం చేయలేకపోయిన ఆమె త్వరలో బాధ్యతలు చేపట్టనున్నారు.

By - Satya P
Update: 2026-11-26 03:50 GMT

విశాఖ కార్పోరేషన్ అంటేనే ఏపీలో అతి పెద్దది అన్నది తెలిసిందే. భౌగోళికంగానే కాదు ఆర్ధికంగా కూడా అతి పెద్దది. ఇక దేశంలో ఉన్న పది బృహత్ కార్పోరేషన్లలో విశాఖ ఒకటి. అలాంటి విశాఖకు డైరెక్ట్ ఎన్నికల్లో మేయర్ గా టీడీపీ నుంచి ముక్కా శ్రావణి ఏకంగా రెండున్నర లక్షల ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. ఆమె ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు రెండు ఎంపీ సీట్ల పరిధితో పాటు సువిశాలమైన జీవీఎంసీకి ప్రధమ పాలకురాలిగా ఉంటున్నారు. ఇదిలా ఉంటే విశాఖ మేయర్ కి విశేష అధికారాలు దఖలు పడబోతున్నాయి. అవేంటో తెలిస్తే అమ్మో మేయర్ ఇంత పవర్ ఫుల్ నా అని ఎవరైనా అనుకోవాల్సిందే.

పూర్తి నిర్ణయాధికారం తోనే :

విశాఖ మేయర్ గా ముక్కా శ్రావణి పూర్తి నిర్ణయాధికారాన్ని చలాయించే స్థానంలో ఉండబోతున్నారు. ఆమె నగర ప్రధమ పౌరురాలిగా ప్రత్యేక హోదాను కలిగి ఉంటారు. అలాగే జీవీఎంసీ స్టాండింగ్ కమిటీకి చైర్ పర్సన్ గా వ్యవహరిస్తారు. ఇక ఈ స్టాండింగ్ కమిటీలో మొత్తానికి మొత్తం కూటమి పార్టీలదే ఆధిపత్యం. అంతే కాదు విపక్షం అన్నది జీవీఎంసీలో పెద్దగా లేదు, వైసీపీ కేవలం 13 మంది కార్పోరేటర్లను గెలిచి నామమాత్రంగా ఉంది. దాంతో మేయర్ నిర్ణయాలు అన్నీ అమలు అవుతాయి. ఎక్కడా అభ్యంతరం చెప్పే పరిస్థితి ఉండదు. ఇక విశాఖను వైజాగ్ బే సిటీగా కూటమి ప్రభుత్వం రీ డిజైన్ చేయనుంది. దీంతో బే టెక్ సిటీ కమిటీని ఏర్పాటు చేశారు. అందులో కూడా విశాఖ మేయర్ సభ్యురాలిగా ఉండబోతున్నారు. ఇది కీలకమైన పదవిగా చెబుతున్నారు. ఎందుకంటే విశాఖ ఫ్యూచర్ డెవలప్మెంట్ ని నిర్ణయించే ప్రాజెక్టులకు ఈ కమిటీ ఒక వేదికగా పనిచేస్తూ నిర్ణయాలు తీసుకుంటుంది.

బ్రహ్మాండంగా వేడుక :

ఇక ముక్కా శ్రావణి భారీ మెజారిటీతో మేయర్ గా గెలిచినప్పటికీ ఈ నెల 24న ఆమె పదవీ ప్రమాణం చేయలేకపోయారు. దానికి కారణం ఆమె తండ్రి మరణించడం. దాంతో ఈ బాధ నుంచి కోలుకున్న మీదట తొందరలో ఆమె మంచి రోజు చూసుకుని విశాఖ మేయర్ గా బాధ్యతలు స్వీకరిస్తారు అని అంటున్నారు. అది మామూలుగా ఉండదని బ్రహ్మాండంగా ఈ వేడుకను నిర్వహిస్తారని అంటున్నారు. అతి రథ మహా రథులు కూటమి పార్టీలకు చెందిన పెద్దలు అంతా ఈ కార్యక్రమానికి హాజరవుతారని అంటున్నారు. ఇవన్నీ ఇలా ఉంచితే విశాఖ కార్పోరేషన్ 1979లో ఏర్పాటు అయ్యాక ఇప్పటిదాకా ఏడుగురు మేయర్లు పనిచేశారు. వారిలో అతి పిన్న వయసులో ఈ అత్యున్నత పీఠాన్ని అధిరోహించిన శ్రావణి ఎనిమిదవ మేయర్ గా ఉన్నారు. ఉన్నత విద్యావంతురాలైన ఆమె తనదైన పనితీరుతో రాణించాలని అంతా కోరుకుంటున్నారు.

Tags:    
  • vizag 
  • mukkasravani 
  • gvmc 
  • vizagmayor 
  • baytechcity 

Similar News

విశాఖ పేరు మారుతోందా...క్లారిటీ ఇదే !

2026-11-25 04:03 GMT

అసహనం...ఆగ్రహం...బీజేపీలో ఏమి జరుగుతోంది ?

2026-11-24 00:53 GMT

పవన్ చెప్పారు... కార్యకర్త డిప్యూటీ మేయర్ అయ్యారు !

2026-11-24 00:28 GMT

విశాఖ రూపురేఖలు మార్చేసే అద్భుత కట్టడం !

2026-11-23 03:57 GMT

అట్రాక్షన్ లాగేస్తోంది.... బీచ్ మింగేస్తోంది !

2026-11-23 03:57 GMT

గోవా కేరళ తరహాలో విశాఖ....కూటమి యాక్షన్ ప్లాన్ !

2026-11-22 04:30 GMT

విశాఖ కొత్త మేయర్ ఇంట పెను విషాదం.. కూతురి ప్రమాణస్వీకారం చూడకుండానే తండ్రి కన్నుమూత

2026-11-20 17:23 GMT

విశాఖ నుంచి తిరుపతి వెళ్ళే భక్తులకు సూపర్ న్యూస్

2026-11-19 21:15 GMT

విశాఖ మరో గిఫ్ట్... కైలాసగిరికి కొత్త రోప్‌వే

2026-11-19 04:57 GMT

గంటా దూకుడు రాజకీయం...బొత్స కూతురు ఏం చేస్తున్నట్లు ?

2026-11-19 03:15 GMT

విశాఖలో ఎలక్ట్రిక్ బస్సులు...వారికి ఫ్రీగానే !

2026-11-16 18:55 GMT

Copyright @2026

Powered by Blink CMS