• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Andhra Pradesh >  Visakhapatnam >  అసహనం...ఆగ్రహం...బీజేపీలో...

అసహనం...ఆగ్రహం...బీజేపీలో ఏమి జరుగుతోంది ?

| స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు తగిన ప్రాధాన్యం దక్కలేదని ఏపీ బీజేపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భీమవరం, జమ్మలమడుగు తర్వాత తాజాగా జీవీఎంసీ డిప్యూటీ మేయర్ పదవి విషయంలోనూ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అసహనం వ్యక్తం చేశారు. 2029 ఎన్నికల్లోనూ సీట్ల కేటాయింపుపై బీజేపీ నేతల్లో సందేహాలు మొదలయ్యాయి.

By - Satya P
Update: 2026-11-24 00:53 GMT

ఏపీ బీజేపీలో అసంతృప్తి బాహాటం అవుతోంది. తమకు స్థానిక సంస్థల ఎన్నికల్లో సరైన అవకాశాలు దక్కలేదని కాషాయం పార్టీలో చర్చ సాగుతోంది. చాలా మంది మౌనంగా ఉంటే కొంత మంది బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. మొన్న కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ భీమవరంలో తమకు తక్కువ వార్డులు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తే నిన్న జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి జెడ్పీ చైర్ పర్సన్ పదవి ఇవ్వలేదని ఆగ్రహించారు. తాజాగా జీవీఎంసీలో డిప్యూటీ మేయర్ పదవిని బీజేపీకి కేటాయించక పోవడం పట్ల ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు మీడియా ముందే అసహనం వ్యక్తం చేశారు.

బీజేపీ జూనియర్ గానే :

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి మిత్రుల పట్ల పెద్దన్న టీడీపీ వ్యవహరించిన తీరు మీద చర్చ సాగుతోంది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, ఉత్తరాదిన ఆ పార్టీకి బలం ఉంది, కానీ ఏపీలో లేదు, ఈ సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఏ పార్టీ అయినా బలం పెంచుకోవడానికే పొత్తు పెట్టుకుంటాయి. కానీ అదేమిటో తెలియదు కానీ బీజేపీ ఎపుడు పొత్తు పెట్టుకున్నా కూడా ఎత్తిగిల్లలేకపోతోంది. ఇక తాజాగా చూస్తే జనసేన కూడా మిత్రపక్షంగా ఉంది. చిత్రమేంటి అంటే జనసేన కంటే కూడా బీజేపీని తక్కువ చేసి చూస్తున్నారు అని కాషాయ దళం ఆవేదన వ్యక్తం చేస్తోంది. తమ పార్టీకి కోరుకున్న సీట్లు ఇవ్వడం లేదని ఆవేదన చెందుతున్నారు.

ఇరవై అడిగామని :

విశాఖలో చూస్తే 120 వార్డులకు గానూ 20 వార్డులు బీజేపీ పొత్తులో భాగంగా అడిగింది. అయితే 11 మాత్రమే ఆ పార్టీకి ఇచ్చారు. అందులో 8 మంది గెలిచారు. అయితే ఆ మిగిలిన మూడు సీట్లలో కూడా ఇండిపెండెంట్లని దించి ఓడించారని బీజేపీ నాయకులు అంటున్నారు. మేయర్ పదవి అడిగితే డిప్యూటీ మేయర్ అయినా ఇవ్వలేదని ఆగ్రహిస్తున్నారు. ఇలాగైతే ఎలా అని వాపోతున్నారు. తాము పొత్తు ధర్మాన్ని కూటమి ఐక్యతను మనసులో ఉంచుకుని సర్దుకుని పోతున్నామని విష్ణు కుమార్ రాజు అయితే మీడియా ముందు ఓపెన్ అయిపోయారు.

ఎమ్మెల్యే సీట్లు కూడా :

ఇలాగైతే 2029 ఎన్నికల్లో ఎమ్మెల్యే సీట్లు కూడా తమకు దక్కుతాయా అని బీజేపీ నేతలు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఆనాటికి ఏవో కారణాలు చెప్పి అయినా తమను పక్కన పెడితే తమ పరిస్థితి ఏమిటి అని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ విధంగా బీజేపీలో చర్చ సాగుతూంటే జాతీయ నాయకత్వం కానీ రాష్ట్ర నాయకత్వం కానీ కూటమి పెద్దలతో చర్చించడం లేదా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. అయితే బీజేపీకి సీట్లు బాగానే ఇచ్చామని వారి బలం బట్టే అది కూడా అని కూటమిలో వినిపిస్తున్న మాట. అయితే సీట్లు ఇచ్చినా పొత్తులలో భాగంగా ఓట్ల బదలాయింపు అయితే కొన్ని చోట్ల సరిగ్గా జరగలేదని కాషాయదళంలో వినిపిస్తోంది. అందుకే తాము ఓటమి చెందామని అంటున్నారు.

ఆ ఓటమి వెనక :

విజయనగరం జిల్లాలోని నెల్లిమర్లలో మునిసిపల్ చైర్ పర్సన్ సీటుని బీజేపీకి కేటాయించారు. కానీ టీడీపీ నుంచి రెబెల్ పోటీ చేసి బీజేపీని అభ్యర్ధిని ఓడించారు అని గుర్తు చేస్తున్నారు. అలాగే అనంతపురం కార్పోరేషన్ విషయంలో కూడా మిత్రుల నుంచి పూర్తి సహకారం దక్కడంలేదని బీజేపీ నేతలు అంటున్నారు. మొత్తంగా చూస్తే ఏపీ బీజేపీలో అయితే అసంతృప్తి అధికంగానే ఉంది. పార్టీలో జరుగుతున్న ఈ పరిణామాలను జాతీయ నాయకత్వం అయినా గమనించి చక్కదిద్దుతుందా లేదా అన్నదే చర్చగా ఉంది మరి.

Tags:    
  • apbjp 
  • tdp 
  • bjp 
  • vishnukumarraju 
  • gvmc 

Similar News

పవన్ చెప్పారు... కార్యకర్త డిప్యూటీ మేయర్ అయ్యారు !

2026-11-24 00:28 GMT

విశాఖ రూపురేఖలు మార్చేసే అద్భుత కట్టడం !

2026-11-23 03:57 GMT

అట్రాక్షన్ లాగేస్తోంది.... బీచ్ మింగేస్తోంది !

2026-11-23 03:57 GMT

గోవా కేరళ తరహాలో విశాఖ....కూటమి యాక్షన్ ప్లాన్ !

2026-11-22 04:30 GMT

విశాఖ కొత్త మేయర్ ఇంట పెను విషాదం.. కూతురి ప్రమాణస్వీకారం చూడకుండానే తండ్రి కన్నుమూత

2026-11-20 17:23 GMT

విశాఖ నుంచి తిరుపతి వెళ్ళే భక్తులకు సూపర్ న్యూస్

2026-11-19 21:15 GMT

విశాఖ మరో గిఫ్ట్... కైలాసగిరికి కొత్త రోప్‌వే

2026-11-19 04:57 GMT

గంటా దూకుడు రాజకీయం...బొత్స కూతురు ఏం చేస్తున్నట్లు ?

2026-11-19 03:15 GMT

విశాఖలో ఎలక్ట్రిక్ బస్సులు...వారికి ఫ్రీగానే !

2026-11-16 18:55 GMT

అభివృద్ధి మ్యాప్ లో భీమిలీ మారుమూల గ్రామం !

2026-11-14 03:22 GMT

సమ్మిట్ సూపర్ హిట్... 303 ప్రాజెక్టులు...9.89 లక్షల కోట్ల పెట్టుబడులు !

2026-11-14 03:20 GMT

Copyright @2026

Powered by Blink CMS