• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Andhra Pradesh >  Visakhapatnam >  అభివృద్ధి మ్యాప్ లో ...

అభివృద్ధి మ్యాప్ లో భీమిలీ మారుమూల గ్రామం !

| విశాఖ జిల్లా భీమిలీ మండలంలోని అవనాం గ్రామంలో రూ.31,387 కోట్లతో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 27 ఎకరాల భూమిని సేకరించనుంది. భోగాపురం ఎయిర్‌పోర్టు, దివీస్ ఫ్యాక్టరీకి సమీపంలో ఈ ప్రాజెక్టు రావడంతో గ్రామంలో అభివృద్ధి, భూముల ధరలు పెరుగుతాయని స్థానికులు ఆశిస్తున్నారు.

By - Satya P
Update: 2026-11-14 03:22 GMT

విశాఖ జిల్లా భీమిలీ అంటే అందమైన ప్రాంతంగా అందరికీ తలపునకు వస్తుంది. భీమిలీ మున్సిపాలిటీ వరకూ బాగానే ప్రగతి సాధించినా మండలాలు మూడు ఉన్నాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం విశాఖ జిల్లా మీద ప్రత్యేక ఫోకస్ పెడుతూండడంతో వాటి దశ తిరుగుతోంది. ఇప్పటికే ఆనందపురం మండలంలోని గుడిలోవ ప్రాంతాలలో గూగుల్ డేటా సెంటర్ రావడంతో అక్కడ ఒక్కసారిగా ప్రగతి గతి మారిపోయింది. 2028 నాటికి తొలిదశ డేటా సెంటర్ పనులు మొదలవుతున్న వేళ ఈ ప్రాంతం ప్రధాన ప్రగతి కేంద్రంగా మారబోతోంది.

భీమిలీకి సైతం :

ఇప్పుడు చూస్తే భీమిలీ మండలంలోని మారుమూల గ్రామానికి ఒక్కసారిగా అదృష్టం తలుపు తడుతోంది. భీమిలీ మండలంలో అవనాం గ్రామం ఉంది. ఇది విజయనగరం జిల్లాకు సరిహద్దుగా ఉంటుంది. భోగాపురం వెళ్ళే దారిలో ఉంటుంది. ఇప్పుడు అవనాం ని అభివృద్ధి దశ పట్టనుంది. ఆ మధ్య దాకా సీసీ రోడ్లకు సైతం ఇబ్బందులు పడిన ఈ గ్రామానికి కోరి మరీ ప్రగతి దారులు తెరుచుకుంటున్నాయి. ఈ పల్లెలో ఏకంగా ఏఇ డేటా సెంటర్ ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. దాంతో అవనాం ఇపుడు అభివృద్ధి మ్యాప్ లో అందంగా కనిపించబోతోంది అని అంటున్నారు.

భారీ ప్రాజెక్ట్ గానే :

ఈ డేటా సెంటర్ ఏర్పాటు కోసం 31 వేల 387 కోట్ల రూపాయలను ప్రభుత్వం వెచ్చించనుంది. దీని కోసం 27 ఎకరాల భూములను సేకరించాలని నిర్ణయించారు. ఇప్పటికే అవనాం కి దగ్గరలో భోగాపురం ఎయిర్ పోర్టు వచ్చింది, మరో వైపు దివీస్ ఫ్యాక్టరీ ఉంది. ఇపుడు గ్రామంలోనే ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు కావడం వల్ల తమ భూములకు రెక్కలు వస్తాయని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు దాకా ఇక్కడ ఎకరం భూమి మూడు నాలుగు లక్షల దాకా ఉంటే ఇపుడు పది రెట్లు పెరిగినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.

ఏఐదే రోజులు :

ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ఏఐదే ముందున్న రోజులు అని చెబుతున్నారు. నిన్నటి దాకా ఐటీ గురించి మాట్లాడామని, ఇపుడు ఏఐ తోనే ప్రయాణం అని అంటున్నారు. అలా కూటమి ప్రభుత్వం ఏఐని ప్రమోట్ చేస్తున్న క్రమంలో ఏపీకి ప్రత్యేకించి విశాఖ జిల్లాకు పెద్ద ఎత్తున డేటా సెంటర్లు వస్తున్నాయి. గూగుల్ తో మొదలైన ఈ తాకిడి ఇపుడు పెద్ద ఎత్తున విస్తరిస్తోంది. వరుసగా విజయనగరం జిల్లా దాకా డేటా సెంటర్లను ఏర్పాటు చేసేందుకు అనేక దిగ్గజ సంస్థలు ముందుకు వస్తున్న నేపథ్యం ఉంది. దాంతో మారు మూల ప్రాంతాలలో భూములకు సైతం రెక్కలు వస్తున్నాయని అంటున్నారు. అలాగే అభివృద్ధిలో అవి భాగం అవుతున్నాయి. ఈ పరిణామం విశాఖ జిల్లాతో పాటు ఉత్తరాంధ్ర రూపు రేఖలనే మార్చేస్తుందని అంటున్నారు.

Tags:    
  • vizag 
  • avanam 
  • aidatacentre 
  • andhrapradesh 
  • bheemili 

Similar News

సమ్మిట్ సూపర్ హిట్... 303 ప్రాజెక్టులు...9.89 లక్షల కోట్ల పెట్టుబడులు !

2026-11-14 03:20 GMT

ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు....బాబు కీలక కామెంట్స్

2026-11-13 18:30 GMT

మీ తాత మా తాత గ్రేట్...లోకేష్ తో ఉపాసన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ !

2026-11-13 04:06 GMT

ఫస్ట్ డే సమ్మిట్ హిట్.. ఒప్పందాలో బిగ్ షాట్స్

2026-11-12 18:29 GMT

సీఎం చంద్రబాబు బిగ్ అనౌన్స్‌మెంట్ : ఏపీకి రూ. 32.49 లక్షల కోట్ల పెట్టుబడులు

2026-11-12 11:34 GMT

టేస్ట్ ఆఫ్ ఆంధ్రా' నుంచి డిజిటల్ పర్యాటకం వరకు.. సీఐఐ సదస్సు విశేషాలు!

2026-11-12 06:17 GMT

చాక్లెట్ బాక్సును వదలని ‘బాబు’ గారు.. ఆయన ఆలోచన అలా ఉంటుంది మరీ

2026-11-12 05:54 GMT

11 లక్షల కోట్ల టార్గెట్ ..దావోస్ కి ధీటుగా వైజాగ్ సమ్మిట్

2026-11-12 03:23 GMT

చంద్ర‌బాబు హ‌ర్ట్‌: అమిత్ షా విశాఖ ప‌ర్య‌ట‌న ర‌ద్దు రీజ‌న్ ఇదే!

2026-11-11 16:40 GMT

విశాఖలో పెట్టుబడుల పండుగకి కౌంట్ డౌన్

2026-11-11 01:43 GMT

జనసేనకే డిప్యూటీ మేయర్ పదవి ?

2026-11-09 19:18 GMT

Copyright @2026

Powered by Blink CMS