• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Andhra Pradesh >  Visakhapatnam >  11 లక్షల కోట్ల టార్గెట్...

11 లక్షల కోట్ల టార్గెట్ ..దావోస్ కి ధీటుగా వైజాగ్ సమ్మిట్

| విశాఖలో జరుగుతున్న 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు ద్వారా ఏపీకి రూ.11 లక్షల కోట్ల పెట్టుబడులు, 160కి పైగా ఒప్పందాలు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. 58 దేశాల ప్రతినిధులు హాజరైన ఈ సదస్సుతో 2.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. జపాన్, యూఏఈ ప్రతినిధులతో చంద్రబాబు పెట్టుబడులపై చర్చలు జరిపారు.

By - Satya P
Update: 2026-11-12 03:23 GMT

విశాఖలో రెండు రోజుల పాటు 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సుని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఏపీ ప్రభుత్వం కలిసి నిర్వహిస్తున్నాయి. ఈ సదస్సు మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం అయితే భారీ లక్ష్యాలనే నిర్దేశించుకుంది. రెండు రోజుల సదస్సులో ఏకంగా 11 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తాయని అంచనా వేసుకుంటోంది. 160కి పైగా అవగాహన ఒప్పందాలు కుదురుతాయని అలాగే ఈ ఒక్క సదస్సుతో రెండున్నర లక్షల మందికి పైగా యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని కూడా భావిస్తోంది.

అంతర్జాతీయ వేదికగా :

ఈ సదస్సు కోసం విశాఖ అంతర్జాతీయ వేదికగా మారిపోయింది. విశాఖకు 58 దేశాల నుంచి ప్రతినిధులు దిగ్గజ నేతలు, ప్రభుత్వ పెద్దలు హాజరు అయ్యారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జపాన్, సింగపూర్ దేశాల నుంచే కాకుండా దేశంలోని ప్రముఖ సంస్థలు అయిన హీరో గ్రూప్, భారత్ బయోటెక్, అపోలో, సన్ ఇంటర్ నేషనల్, రెన్యూ, రాక్ వెల్ ఆటోమేషన్, జీఎంఆర్ గ్రూప్ లకు చెందిన ప్రతినిధులు హాజరు కావడం విశేషం. ఒక విధంగా చెప్పాలీ అంటే దావోస్ తరహాలో విశాఖ సదస్సు జరుగుతోంది అని అంటున్నారు.

భారీగా రాయితీలు :

ఈ సదస్సుకు వచ్చిన దేశీయ విదేశీయ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు వరస భేటీలు వేస్తూ ఫుల్ బిజీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వం తరఫున భరోసా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక పెట్టుబడులను ప్రోత్సహించేందుకు పారదర్శకమైన రాయితీల విధానాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. పరిశ్రమలకు అందించే రాయితీల కోసం ఎస్క్రో అకౌంట్ విధానాన్ని తీసుకొచ్చామని రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. జపాన్ రాయబారి కెయిచీ ఓనోతో జరిగిన సమావేశంలో పారిశ్రామిక పెట్టుబడులు, నైపుణ్యాభివృద్ధి, కీలక ఖనిజాలు, ఉక్కు పరిశ్రమ, గ్రీన్ ఎనర్జీ తదితర అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో స్కిల్ డెవలప్‌మెంట్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని బాబు తెలిపారు. అలాగే యువత పెద్ద సంఖ్యలో ఉన్నారని, వారికి పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ అందిస్తే అత్యుత్తమ మానవ వనరులుగా తీర్చిదిద్దవచ్చునని పేర్కొన్నారు. ఈ దిశగా జపాన్ సంస్థలు సహకరించాలని కోరారు.

యూఏఈకి ఆహ్వానం :

ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులు పెట్టాలని దుబాయ్ యూఏఈలకు చెందిన వివిధ ప్రముఖ కంపెనీలను చంద్రబాబు ఆహ్వానించారు. సీఐఐ సదస్సులో పాల్గొనేందుకు విశాఖ వచ్చిన యూఏఈ ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీ ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. రాయలసీమకు చెందిన ఉద్యాన వన ఉత్పత్తులు ఇప్పటికే విదేశాలకు ఎగుమతి అవుతున్నాయని చంద్రబాబు చెప్పారు. లక్ష కోట్లతో రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి చేస్తున్నట్టు వివరించారు. యూఏఈ ఏర్పాటు చేయనున్న ఫుడ్ క్లస్టర్‌లో ఆ దేశానికి చెందిన అగ్రిఫుడ్ కంపెనీ సిలాల్‌ను బాబు ఆహ్వానించారు. రాష్ట్రంలోని వ్యవసాయ, ఆహార ఉత్పత్తుల సేకరణ, ప్రాసెసింగ్, ఎగుమతుల రంగాల్లో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని చెప్పారు. రేర్ ఎర్త్ మినరల్స్ రంగంలో ఏపీలో ఉన్న అవకాశాలను పారిశ్రామిక వేత్తలకు బాబు వివరించారు. అలాగే ఏపీలో సెమికండక్టర్, గ్రీన్ ఎనర్జీ న్యూక్లియర్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులకు గల అవకాశాలను తెలియచేస్తూ భారీ పెట్టుబడులకు ఆస్కారం ఉందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. రెండు రోజుల పాటు సాగే సదస్సులో ఎన్ని ఒప్పందాలు కుదురుతాయన్నది చూడాల్సి ఉంది.

Tags:    
  • visakhapatnam 
  • ciipartnershipsummit 
  • chandrababu 

Similar News

విశాఖ నుంచి తిరుపతి వెళ్ళే భక్తులకు సూపర్ న్యూస్

2026-11-19 21:15 GMT

విశాఖ మరో గిఫ్ట్... కైలాసగిరికి కొత్త రోప్‌వే

2026-11-19 04:57 GMT

గంటా దూకుడు రాజకీయం...బొత్స కూతురు ఏం చేస్తున్నట్లు ?

2026-11-19 03:15 GMT

విశాఖలో ఎలక్ట్రిక్ బస్సులు...వారికి ఫ్రీగానే !

2026-11-16 18:55 GMT

అభివృద్ధి మ్యాప్ లో భీమిలీ మారుమూల గ్రామం !

2026-11-14 03:22 GMT

సమ్మిట్ సూపర్ హిట్... 303 ప్రాజెక్టులు...9.89 లక్షల కోట్ల పెట్టుబడులు !

2026-11-14 03:20 GMT

ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు....బాబు కీలక కామెంట్స్

2026-11-13 18:30 GMT

మీ తాత మా తాత గ్రేట్...లోకేష్ తో ఉపాసన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ !

2026-11-13 04:06 GMT

ఫస్ట్ డే సమ్మిట్ హిట్.. ఒప్పందాలో బిగ్ షాట్స్

2026-11-12 18:29 GMT

సీఎం చంద్రబాబు బిగ్ అనౌన్స్‌మెంట్ : ఏపీకి రూ. 32.49 లక్షల కోట్ల పెట్టుబడులు

2026-11-12 11:34 GMT

టేస్ట్ ఆఫ్ ఆంధ్రా' నుంచి డిజిటల్ పర్యాటకం వరకు.. సీఐఐ సదస్సు విశేషాలు!

2026-11-12 06:17 GMT

చాక్లెట్ బాక్సును వదలని ‘బాబు’ గారు.. ఆయన ఆలోచన అలా ఉంటుంది మరీ

2026-11-12 05:54 GMT

Copyright @2026

Powered by Blink CMS