• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Andhra Pradesh >  Visakhapatnam >  చాక్లెట్ బాక్సును వదలని...

చాక్లెట్ బాక్సును వదలని ‘బాబు’ గారు.. ఆయన ఆలోచన అలా ఉంటుంది మరీ

| ఏపీలో జరుగుతున్న సీఐఐ సమ్మిట్‌లో యూఏఈ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీతో సీఎం చంద్రబాబు సరదాగా మాట్లాడారు. ఆయనకు అరకు కాఫీని బహుమతిగా ఇవ్వగా, అబ్దుల్లా దుబాయ్ చాక్లెట్లు అందించారు. ఏపీలో కోకో పండుతోంది కాబట్టి ఇక్కడే చాక్లెట్ ఫ్యాక్టరీ పెట్టొచ్చుగా అని చంద్రబాబు సూచించారు. దీంతో ఆయన పెట్టుబడుల ఆలోచనపై మంత్రి నవ్వుతూ స్పందించారు.

By - A.N.Kumar
Update: 2026-11-12 05:54 GMT

అవకాశం ఎక్కడ ఉన్నా దానిని రాష్ట్ర అభివృద్ధికి మలుచుకోవడమే నిజమైన నాయకత్వ లక్షణం.. ఏపీలో జరుగుతున్న సీఐఐ సమ్మిట్ వేదికగా.. ఒక సాధారణ బహుమతి ఇచ్చిపుచ్చుకునే సందర్భంలోనూ రాష్ట్ర రైతులకు, పరిశ్రమలకు మేలు చేసేలా సీఎం చంద్రబాబు ఆలోచించిన తీరు ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.

చంద్రబాబును దేశంలోనే విజనరీ అనీ.. పెట్టుబడుల సృష్టికర్త అని.. కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఆద్యుడని.. కొత్త నగరాలు, ఐటీసీటీలు నిర్మించడంలో ప్రముఖడని కొనియాడుతుంటారు. హైదరాబాద్ లో ఐటీకి ఊపు తీసుకొచ్చిన వారిలో చంద్రబాబు ఒకరు. ఇప్పుడు అమరావతి నిర్మాణ దాతగా ఖ్యాతి గడిస్తున్నారు. చంద్రబాబు కోణం ఎప్పుడూ అభివృద్ధి వైపే ఉంటుంది. ప్రతీ పెట్టుబడిని ఆయన గ్రాబ్ చేస్తుంటారని పేరుంది. ఇప్పుడు ఆయనలోని పెట్టుబడుల కోణాన్ని ఒక సంఘటన ఆవిష్కరించింది.

తాజాగా ఏపీలో జరుగుతున్న సీఐఐ సమ్మిట్ కు దేశ విదేశాల నుంచి ప్రభుత్వ, పారిశ్రామిక ప్రముఖులను చంద్రబాబు ఆహ్వానించారు. వారందరినీ సాదరంగా ఆహ్వానించడం నుంచి వారి నుంచి పెట్టుబడులు స్వీకరించడం వరకూ చంద్రబాబు పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

ఈ క్రమంలోనే సీఐఐ సమ్మిట్ కు వచ్చిన యూఏఈ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీతో చంద్రబాబు సంభాషన నవ్వులు పూయించింది. చంద్రబాబు ఎలా ఆలోచిస్తారనదానికి ఇదొక ఉదాహరణగా నిలిచింది. అబ్దుల్లాకు సీఎం చంద్రబాబు ‘అరకు’ కాఫీని గిఫ్ట్ గా ఇవ్వగా.. దానికి ప్రతిగా అబ్దుల్లా దుబాయ్ నుంచి ప్రత్యేకంగా తయారు చేసి పట్టుకొచ్చిన ‘చాక్లెట్లను’ అందించాడు.

అయితే బాబుగారు వదులుతారా?.. ఈ దుబాయ్ చాక్లెట్లలో అవసరమైన కోకో ఏపీలోనే పండుతోందని.. ఇక్కడే చాక్లెట్ల ఫ్యాక్టరీ కూడా పెట్టొచ్చు కదా అని అబ్దుల్లాతో చంద్రబాబు సరదాగా వ్యాఖ్యానించారు. దీంతో ‘చాక్లెట్ బాక్సులోనూ మీరు పెట్టుబడుల కోణం చూస్తున్నారు’ అని అబ్దుల్లా నడంతో సీఎం చంద్రబాబు ఒక్కసారిగా నవ్వారు.

చంద్రబాబు ఆలోచన ఎప్పుడూ పెట్టుబడులు, అభివృద్ధి కోణంలోనే సాగుతుందనడానికి ఇదీ ఉదాహరణ అని టీడీపీ శ్రేణులు ఈ ఘటనను ఉదాహరణగా చూపిస్తూ వైరల్ చేస్తున్నారు. బాబు గారిలో రాజకీయం.. ఆకర్షించే గుణం ఎక్కువ అని.. ఆయన ప్రతీ అడుగులోనూ ఏపీ కోసం ఆలోచిస్తారని వారంతా కామెంట్లు చేస్తున్నారు.

Tags:    
  • chandrababu 
  • andhrapradesh 
  • ciipartnershipsummit 
  • uaeminister 
  • abdullahbintouqalmarri 

Similar News

విశాఖ నుంచి తిరుపతి వెళ్ళే భక్తులకు సూపర్ న్యూస్

2026-11-19 21:15 GMT

విశాఖ మరో గిఫ్ట్... కైలాసగిరికి కొత్త రోప్‌వే

2026-11-19 04:57 GMT

గంటా దూకుడు రాజకీయం...బొత్స కూతురు ఏం చేస్తున్నట్లు ?

2026-11-19 03:15 GMT

విశాఖలో ఎలక్ట్రిక్ బస్సులు...వారికి ఫ్రీగానే !

2026-11-16 18:55 GMT

అభివృద్ధి మ్యాప్ లో భీమిలీ మారుమూల గ్రామం !

2026-11-14 03:22 GMT

సమ్మిట్ సూపర్ హిట్... 303 ప్రాజెక్టులు...9.89 లక్షల కోట్ల పెట్టుబడులు !

2026-11-14 03:20 GMT

ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు....బాబు కీలక కామెంట్స్

2026-11-13 18:30 GMT

మీ తాత మా తాత గ్రేట్...లోకేష్ తో ఉపాసన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ !

2026-11-13 04:06 GMT

ఫస్ట్ డే సమ్మిట్ హిట్.. ఒప్పందాలో బిగ్ షాట్స్

2026-11-12 18:29 GMT

సీఎం చంద్రబాబు బిగ్ అనౌన్స్‌మెంట్ : ఏపీకి రూ. 32.49 లక్షల కోట్ల పెట్టుబడులు

2026-11-12 11:34 GMT

టేస్ట్ ఆఫ్ ఆంధ్రా' నుంచి డిజిటల్ పర్యాటకం వరకు.. సీఐఐ సదస్సు విశేషాలు!

2026-11-12 06:17 GMT

Copyright @2026

Powered by Blink CMS