• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Andhra Pradesh >  Visakhapatnam >  ఇద్దరి కంటే ఎక్కువ మంది...

ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు....బాబు కీలక కామెంట్స్

| జనాభా క్షీణతను దృష్టిలో ఉంచుకుని ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కనాలని ప్రజలను ప్రోత్సహిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. విశాఖ సీఐఐ సదస్సులో మాట్లాడుతూ, గతంలో ఒకరు లేదా ఇద్దరు పిల్లల నినాదం ఇచ్చానని, మారిన పరిస్థితుల నేపథ్యంలో తన అభిప్రాయం మార్చుకున్నానని చెప్పారు. అయితే ఈ విధానాన్ని ఆచరణలో పెట్టడం సవాలుగా ఉందని అంగీకరించారు.

By - Satya P
Update: 2026-11-13 18:30 GMT

గతంలో జనాభా నియంత్రణను దేశంలో పెద్ద ఎత్తున అమలు చేశారు. దాని ఫలితంగా దక్షిణాది రాష్ట్రాలు పకడ్బందీగా పాటించి ఈ రోజున జనాభా విషయంలో క్షీణత మొదలైంది. దాంతో జనాభా ప్రాతిపదికన కేంద్రం అందించే పధకాల విషయం కానీ కొత్తగా ఏర్పాటు చేసే అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాల విషయంలో కానీ సౌత్ స్టేట్స్ కి అన్యాయం జరుగుతోంది. దీని మీద ఏపీ ముఖ్యమంత్రి ఈ మధ్య కాలంలో ఒక కొత్త నినాదాన్ని అందుకున్నారు. ఎక్కువ మంది పిల్లలను కనమని. ఇద్దరు కంటే ఎక్కువ మంది ఉంటే ప్రభుత్వం తరఫున ప్రోత్సాహకాలు ఇస్తామని కూడా ప్రకటించారు. అయితే దాని ప్రొగ్రెస్ ఎంతవరకు వచ్చింది అన్నది అయితే ఇప్పటిదాకా ఎవరికీ తెలియడం లేదు.

మారిన నేపథ్యం :

ఈ నేపధ్యంలో విశాఖలో సీఐఐ సదస్సులో భాగంగా సీనియర్ జర్నలిస్ట్ పల్కి శర్మతో ఫైర్‌సైడ్ చాట్‌లో చంద్రాబాబుకి ఈ ప్రశ్న ఎదురైంది. దీని మీద ఆయన జవాబు చెబుతూ దేశం ఎదుర్కొంటున్న జనాభా సంబంధిత సవాళ్లు ఇపుడు అనేకం ఉన్నాయని అన్నారు. అయితే ఏ సమాజానికి అయినా దీర్ఘకాలిక ప్రయోజనాలు అవసరం అని అన్నారు. ఆ దృష్ట్యా జనాభా సంబంధిత విధానాలను పునః పరిశీలించాల్సిన అవసరం ఉందని బాబు చెప్పారు. ఈ క్రమంలో పెద్ద కుటుంబాలను ప్రోత్సహించడం కోసం తమ ప్రభుత్వం ఎన్నో అంశాలను పరిగణనలోకి తీసుకుందని అన్నారు. తద్వారా జనాభా పెరుగుదలను సాధించాలన్న ప్రభుత్వ ఆలోచనలను విజయవంతంగా అమలు చేయడం కూడా సవాల్ గానే ఉందని అన్నారు. తాను గతంలో ఒకరు లేదా ఇద్దరు పిల్లలను మాత్రమే కనాలని నినాదం ఇచ్చారు అని గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం మారిన పరిస్థితుల నేపధ్యంలో తన వైఖరిని మార్చుకున్నానని బాబు చెప్పారు.

ఆలోచనలు మార్చుకున్నా :

అయితే ఈ నినాదం అన్నది ఇపుడు ఆచరణలో అంత సులువు కాదని బాబు చెప్పడం విశేషం. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కనమని ప్రజలను ప్రోత్సహించాలన్న తమ ప్రభుత్వ విధానాన్ని అమలు చేయడం కష్టమని బాబు ఒక విధంగా అంగీకరించారు. రాష్ట్ర జనాభా సంబంధిత సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమం ఆశించిన స్థాయిలో పురోగతి సాధించలేదని కూడా ఆయన చెప్పడం విశేషం. అయితే ఇది అవసరం అని బాబు అన్నారు. ప్రపంచంలో ప్రస్తుతం అనేక దేశాలలోని జనాభా పరిణామాలను గమనించిన తర్వాత జనాభా పెరుగుదల విషయంలో కొత్త విధానం అమలు కోసం ప్రయత్నించాలన్నది తన ఆలోచనగా చెప్పారు. వర్తమానంలో జనాభా క్షీణత మారుతున్న జనాభా సరళి యొక్క దీర్ఘకాలిక పరిణామాలను పునః పరిశీలించడం వల్ల కుటుంబ పరిమాణంపై తన అభిప్రాయాలను పునఃసమీక్షించుకోవాల్సి వచ్చిందని బాబు తెలిపారు.

అమలు అసాధ్యం :

అయితే ఇదే క్రమంలో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కనమని ప్రజలను ఒప్పించడం కూడా బహు కష్టమే అని బాబు అన్నారు. ఒక విధంగా చూస్తే ఈ తరహా విధానాన్ని అమలు చేయడం సవాలుతో కూడుకున్నదని బాబు చెప్పారు. అయితే దీనిని అమలు చేయడం కష్టమైనప్పటికీ మొత్తానికి ఈ విధానమే ప్రజలకు ఎక్కువ ప్రయోజనం చేకూరుస్తుందని తాను నమ్ముతాను అని బాబు అన్నారు. అందుకే తాను దానికి కట్టుబడి ఉన్నాను అని ఆయన స్పష్టం చేశారు. ఆచరణలో ఎదురయ్యే సమస్యలు అనేకం ఉన్నప్పటికీ జనాభా పెరుగుదల అన్న విధానాన్ని ప్రోత్సహించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చంద్రబాబు పేర్కొన్నారు.

ప్రజల ఆలోచనలు :

ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలు భవిష్యత్తుకు ఎంతో మేలు చేసేవి అయినప్పటికీ ప్రజలు మాత్రం పెద్ద కుటుంబాల మీద విముఖతగా ఉన్నారని అంటున్నారు. అలాగే ఎక్కువ మంది పిల్లలను కనడం అన్నది వారికి భారంగా ఉంది అని అంటున్నారు. అందువల్లనే కూటమి ప్రభుత్వం ఇద్దరు లేక ఎక్కువ మంది పిల్లలను కనాలని నినాదం ఇచ్చినా అనుకున్న స్పందన అయితే రాలేదని అంటున్నారు. ఈ రోజులలో పిల్లలను పెంచాలంటే ఆర్ధిక భారంగా మారుతోంది అందుకే ప్రభుత్వం ప్రోత్సాహకాలకు ప్రజలు సానుకూలంగా స్పందించడం లేదని గుర్తు చేస్తున్నారు. కానీ బాబు చెప్పినట్లుగా యువ జనాభా పెరగాల్సి ఉంది. దాని వల్లనే దేశ ఆర్ధిక ప్రగతి పెరుగుతుంది, అలాగే శ్రామిక శక్తి కూడా పెదుగుతుంది. మరి ఈ విషయంలో ప్రజల ఆలోచనలలోనే మార్పు రావాలని అంటున్నారు.

Tags:    
  • chandrababu 
  • andhrapradesh 
  • populationpolicy 
  • populationgrowth 

Similar News

మీ తాత మా తాత గ్రేట్...లోకేష్ తో ఉపాసన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ !

2026-11-13 04:06 GMT

ఫస్ట్ డే సమ్మిట్ హిట్.. ఒప్పందాలో బిగ్ షాట్స్

2026-11-12 18:29 GMT

సీఎం చంద్రబాబు బిగ్ అనౌన్స్‌మెంట్ : ఏపీకి రూ. 32.49 లక్షల కోట్ల పెట్టుబడులు

2026-11-12 11:34 GMT

టేస్ట్ ఆఫ్ ఆంధ్రా' నుంచి డిజిటల్ పర్యాటకం వరకు.. సీఐఐ సదస్సు విశేషాలు!

2026-11-12 06:17 GMT

చాక్లెట్ బాక్సును వదలని ‘బాబు’ గారు.. ఆయన ఆలోచన అలా ఉంటుంది మరీ

2026-11-12 05:54 GMT

11 లక్షల కోట్ల టార్గెట్ ..దావోస్ కి ధీటుగా వైజాగ్ సమ్మిట్

2026-11-12 03:23 GMT

చంద్ర‌బాబు హ‌ర్ట్‌: అమిత్ షా విశాఖ ప‌ర్య‌ట‌న ర‌ద్దు రీజ‌న్ ఇదే!

2026-11-11 16:40 GMT

విశాఖలో పెట్టుబడుల పండుగకి కౌంట్ డౌన్

2026-11-11 01:43 GMT

జనసేనకే డిప్యూటీ మేయర్ పదవి ?

2026-11-09 19:18 GMT

ఒక్క రాత్రిలో 50 కోట్లు మటాష్ !

2026-11-09 12:30 GMT

విశాఖకు అమిత్ షా చంద్రబాబు...మరోసారి అంతర్జాతీయ వేదికగా !

2026-11-08 04:43 GMT

Copyright @2026

Powered by Blink CMS