• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Andhra Pradesh >  Visakhapatnam >  విశాఖకు అమిత్ షా...

విశాఖకు అమిత్ షా చంద్రబాబు...మరోసారి అంతర్జాతీయ వేదికగా !

| విశాఖపట్నంలో ఈ నెల 12, 13 తేదీల్లో 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు జరగనుంది. 59 దేశాల ప్రతినిధులు, 15 మంది విదేశీ మంత్రులతో పాటు 1,250 మందికి పైగా పాల్గొననున్నారు. గ్రీన్ ఎనర్జీ, సెమీకండక్టర్లు, ఐటీ, ఏఐ, ఫార్మా వంటి రంగాల్లో పెట్టుబడులే లక్ష్యంగా సదస్సు నిర్వహిస్తున్నారు. ప్రారంభోత్సవానికి అమిత్ షా, ముగింపు కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ హాజరుకానున్నారు.

By - Satya P
Update: 2026-11-08 04:43 GMT

విశాఖపట్నం మరోసారి అంతర్జాతీయ వేదికగా ఆతిథ్యం ఇవ్వనుంది. ప్రతిష్టాత్మకమైన 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు విశాఖలో ఈ నెల 12, 13 తేదీలలో జరగనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వరుసగా రెండవ ఏడాది నిర్వహిస్తున్న భారీ సదస్సు ఇది. సీఐఐ భాగస్వామ్య సదస్సుకి ప్రపంచవ్యాప్తంగా 59 దేశాల ప్రతినిధులతో పాటు 15 మంది విదేశీ మంత్రులు హాజరుకానున్నారు. మొత్తం 1,250 మందికి పైగా దేశీయ అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొనే ఈ సదస్సులో బిజినెస్-టు-బిజినెస్ అలాతే బిజినెస్-టు-గవర్నమెంట్ చర్చలు జరగనున్నాయి. వందకు పైగా దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతారు అని అంటున్నారు. అలాగే దేశంలోని బిగ్ షాట్స్ గా భావించే పలువురు పారిశ్రామికవేత్తలు కూడా అటెండ్ అవుతారు అని అంటున్నారు. ఇంకా ఉన్నతాధికారులు ఎందరో ప్రముఖులతో విశాఖ రెండు రోజుల పాటు మొత్తం సందడి చేయనుంది.

భారీ పెట్టుబడుల కోసం :

విశాఖలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో భారీ పెట్టుబడులను ఆశిస్తున్నారు. ఈ మేరకు కూటమి ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. దాని ఫలితాలు కనిపిస్తాయని అంటున్నారు. ఇప్పటికే ఆ దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సమీక్షలు నిర్వహించారు. ఉన్నత స్థాయిలో సమావేశాలు కూడా నిర్వహించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఇక ఈ సదస్సు విజయవంతం కావడం కోసం ఇప్పటికే అమరావతి, విశాఖపట్నం, తిరుపతి, అనంతపురం, కాకినాడల్లో ప్రాంతీయ సదస్సులు నిర్వహించారు. వీటి ద్వారా వివిధ సంస్థలు ప్రభుత్వంతో 85,561 కోట్ల రూపాయల విలువైన 195 ముందస్తు అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. దీని ద్వారా దాదాపు 1.56 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని అధికార వర్గాలు తెలిపాయి.

ప్రధాన రంగాలలో :

ఇక ఈ ఏడాది జరిగే సీఐఐ సదస్సులో గ్రీన్ ఎనర్జీ, సెమీకండక్టర్లు, ఐటీ ఫిన్‌టెక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫార్మా, క్వాంటం కంప్యూటింగ్ వంటి భవిష్యత్ రంగాలలో భారీ పెట్టుబడులను కూటమి ప్రభుత్వం ఆశిస్తోంది. ఆ మేరకు లక్ష్యాలను నిర్ణయించుకుని మరీ ముందుకు సాగుతోంది. ఏపీలో పెట్టుబడులు పెట్టడం సురక్షితం సులభం అనే నమ్మకాన్ని కల్పించడానికి కూటమి ప్రభుత్వం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని అమలు చేస్తోంది. మరో వైపు చూస్తే ఈ విశాఖ సదస్సు రాష్ట్ర పారిశ్రామిక రంగానికి మరింత ఊతం ఇస్తుందని భావిస్తున్నారు. అలాగే ఈ సదస్సులో పెట్టుబడులకు సంబంధించి భారీగా ఒప్పందాలు జరగనున్నాయని అంచనా వేస్తున్నారు.

అమిత్ షా రాకతోనే :

ఇక ఈ సదస్సు ప్రారంభం రోజున కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ముఖ్య అతిధిగా రానునారు. దాంతో జాతీయంగా కూడా ప్రాచుర్యం పొందేలా సదస్సుని తీర్చిదిద్దారు. అలాగే ముగింపు కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్‌ హాజరవుతారు.ఈ సదస్సు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 11వ తేదీన విశాఖకు చేరుకుంటున్నారు. ఇక ఆ రోజు రాత్రి సదస్సుకు హాజరయ్యే ప్రతినిధులకు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో గాలా డిన్నర్‌ ఇవ్వనున్నారు. సీఐఐ భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లకు తావివ్వకుండా విశాఖ జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేస్తోంది.

Tags:    
  • ciipartnershipsummit 
  • visakhapatnam 
  • andhrapradesh 
  • chandrababu 
  • investments 

Similar News

విశాఖ నుంచి తిరుపతి వెళ్ళే భక్తులకు సూపర్ న్యూస్

2026-11-19 21:15 GMT

విశాఖ మరో గిఫ్ట్... కైలాసగిరికి కొత్త రోప్‌వే

2026-11-19 04:57 GMT

గంటా దూకుడు రాజకీయం...బొత్స కూతురు ఏం చేస్తున్నట్లు ?

2026-11-19 03:15 GMT

విశాఖలో ఎలక్ట్రిక్ బస్సులు...వారికి ఫ్రీగానే !

2026-11-16 18:55 GMT

అభివృద్ధి మ్యాప్ లో భీమిలీ మారుమూల గ్రామం !

2026-11-14 03:22 GMT

సమ్మిట్ సూపర్ హిట్... 303 ప్రాజెక్టులు...9.89 లక్షల కోట్ల పెట్టుబడులు !

2026-11-14 03:20 GMT

ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు....బాబు కీలక కామెంట్స్

2026-11-13 18:30 GMT

మీ తాత మా తాత గ్రేట్...లోకేష్ తో ఉపాసన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ !

2026-11-13 04:06 GMT

ఫస్ట్ డే సమ్మిట్ హిట్.. ఒప్పందాలో బిగ్ షాట్స్

2026-11-12 18:29 GMT

సీఎం చంద్రబాబు బిగ్ అనౌన్స్‌మెంట్ : ఏపీకి రూ. 32.49 లక్షల కోట్ల పెట్టుబడులు

2026-11-12 11:34 GMT

టేస్ట్ ఆఫ్ ఆంధ్రా' నుంచి డిజిటల్ పర్యాటకం వరకు.. సీఐఐ సదస్సు విశేషాలు!

2026-11-12 06:17 GMT

చాక్లెట్ బాక్సును వదలని ‘బాబు’ గారు.. ఆయన ఆలోచన అలా ఉంటుంది మరీ

2026-11-12 05:54 GMT

Copyright @2026

Powered by Blink CMS