• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Andhra Pradesh >  Visakhapatnam >  చంద్ర‌బాబు హ‌ర్ట్‌: అమిత్...

చంద్ర‌బాబు హ‌ర్ట్‌: అమిత్ షా విశాఖ ప‌ర్య‌ట‌న ర‌ద్దు రీజ‌న్ ఇదే!

| విశాఖలో జరగనున్న సీఐఐ పెట్టుబడుల సదస్సుకు హాజరుకావాల్సిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన పర్యటనను రద్దు చేసుకున్నారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌కు అమెరికా సమన్లు జారీ చేసిన నేపథ్యంలో కేంద్రం అత్యవసర భద్రతా సమీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం. దీంతో సదస్సు షెడ్యూల్‌లో మార్పులు చోటుచేసుకోనున్నాయి.

By - Garuda Media
Update: 2026-11-11 16:40 GMT

ఏపీ సీఎం చంద్ర‌బాబు హ‌ర్ట‌య్యారు. అత్యంత అట్ట‌హాసంగా గురువారం నుంచి శుక్ర‌వారం వ‌ర‌కు రెండు రోజుల పాటు విశాఖ‌లో నిర్వ‌హించ‌త‌ల‌పెట్టిన సీఐఐ భాగ‌స్వామ్య పెట్టుబ‌డుల స‌ద‌స్సుకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాను ఆయ‌న స్వ‌యంగా ఆహ్వానించారు. అయితే.. తొలుత దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను ఖ‌రారు చేసుకున్నా.. అనివార్య కార‌ణాల‌తో అమిత్‌షా ప‌ర్య‌ట‌న‌ను ర‌ద్దు చేసుకున్నారు. దీంతో చంద్ర‌బాబు ఒక్క‌సారిగా నిరుత్సాహానికి గుర‌య్యారు.

ఏం జ‌రిగింది?

విశాఖ‌ప‌ట్నంలోని ఆంధ్ర విశ్వ‌విద్యాల‌యంలో గురువారం నుంచి రెండు రోజుల పాటు సీఐఐ స‌ద‌స్సును నిర్వ‌హిస్తున్నారు. దీనిని రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. ఈ క్ర‌మంలో 18 దేశాల నుంచి ప్ర‌తినిధులు కూడా రానున్నారు. అలానే ప‌లువురు కేంద్ర మంత్రుల‌ను కూడా సీఎం చంద్ర‌బాబు స్వ‌యంగా ఆహ్వానించారు. ముఖ్యంగా గురువారం ఈ స‌ద‌స్సును కేంద్ర హోం మంత్రి అమిత్‌షా చేతుల మీదుగా ప్రారంభించాల‌ని నిర్ణ‌యించారు. దీనికి త‌గిన విధంగా ఏర్పాట్లు కూడా చేశారు. విశాఖ‌లో సీఐఐ స‌ద‌స్సు జ‌రిగే ప్రాంతం మొత్తాన్నీ రెడ్ జోన్‌గా ప్ర‌క‌టించారు. త‌ద్వారా డ్రోన్లు.. ఎగుర‌వేయ‌కుండా ఆంక్ష‌లు విధించారు.

కానీ అనూహ్యంగా అమిత్‌షా ప‌ర్య‌ట‌న వాయిదా ప‌డింది. అనివార్య కారణాలతో షా పర్యటన రద్దయినట్లు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర హోం శాఖ నుంచి సమాచారం అందింది. దీంతో సీఐఐ సమ్మిట్ కార్యక్రమంలో మార్పులు చోటుచేసుకుంటాయ‌ని అధికారులు చెప్పారు. వాస్త‌వానికి ఈ సదస్సులో కేంద్ర హోంమంత్రి 2 గంటల పాటు గడపాల్సి ఉంది. అనంత‌రం.. ఆయ‌న ఇదే ప్రాంగంలో మ‌హిళా సాధికార‌త‌, పారిశ్రామిక వేత్త‌ల స‌ద‌స్సును కూడా ప్రారంభించ‌నున్నారు. కానీ, ప‌ర్య‌ట‌న ర‌ద్దుతో అన్నీ మారిపోనున్నాయ‌ని అధికారులు తెలిపారు.

రీజ‌నేంటి?

అమిత్‌షా అనూహ్యంగా త‌న ప‌ర్య‌ట‌న ర‌ద్దు చేసుకోవ‌డం వెనుక‌.. జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారుకు అమెరికా స‌మ‌న్లు జారీ చేయ‌డ‌మేన‌న్న చ‌ర్చ ఉంది. ఈ విష‌యాన్ని సీరియ‌స్గా తీసుకున్న కేంద్ర ప్ర‌భుత్వం గురువారం ఉద‌యం అత్య‌వ‌స‌ర భ‌ద్ర‌తా స‌మీక్ష నిర్వ‌హించ‌నుంది. జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారుగా ఉన్న అజిత్ డొభాల్ స‌హా మ‌రో అధికారికి అమెరికా స‌మ‌న్లు జారీ చేసింది. అక్క‌డ సిక్కుల ఖ‌లిస్తానీ నాయ‌కుడు ప‌న్నును హ‌త్య చేసేందుకు కుట్ర ప‌న్నార‌న్నది ప్ర‌ధాన అభియోగం. ఈ నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం త‌దుప‌రి చ‌ర్య‌ల‌పై అత్య‌వ‌స‌ర స‌మావేశాన్ని గురువారం నిర్వ‌హించ‌నుంది. ఈ కార‌ణంగానే షా ప‌ర్య‌ట‌న ర‌ద్ద‌యింద‌ని తెలుస్తోంది.

Tags:    
  • amitshah 
  • chandrababu 
  • visakhapatnam 
  • ciisummit 

Similar News

విశాఖ నుంచి తిరుపతి వెళ్ళే భక్తులకు సూపర్ న్యూస్

2026-11-19 21:15 GMT

విశాఖ మరో గిఫ్ట్... కైలాసగిరికి కొత్త రోప్‌వే

2026-11-19 04:57 GMT

గంటా దూకుడు రాజకీయం...బొత్స కూతురు ఏం చేస్తున్నట్లు ?

2026-11-19 03:15 GMT

విశాఖలో ఎలక్ట్రిక్ బస్సులు...వారికి ఫ్రీగానే !

2026-11-16 18:55 GMT

అభివృద్ధి మ్యాప్ లో భీమిలీ మారుమూల గ్రామం !

2026-11-14 03:22 GMT

సమ్మిట్ సూపర్ హిట్... 303 ప్రాజెక్టులు...9.89 లక్షల కోట్ల పెట్టుబడులు !

2026-11-14 03:20 GMT

ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు....బాబు కీలక కామెంట్స్

2026-11-13 18:30 GMT

మీ తాత మా తాత గ్రేట్...లోకేష్ తో ఉపాసన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ !

2026-11-13 04:06 GMT

ఫస్ట్ డే సమ్మిట్ హిట్.. ఒప్పందాలో బిగ్ షాట్స్

2026-11-12 18:29 GMT

సీఎం చంద్రబాబు బిగ్ అనౌన్స్‌మెంట్ : ఏపీకి రూ. 32.49 లక్షల కోట్ల పెట్టుబడులు

2026-11-12 11:34 GMT

టేస్ట్ ఆఫ్ ఆంధ్రా' నుంచి డిజిటల్ పర్యాటకం వరకు.. సీఐఐ సదస్సు విశేషాలు!

2026-11-12 06:17 GMT

చాక్లెట్ బాక్సును వదలని ‘బాబు’ గారు.. ఆయన ఆలోచన అలా ఉంటుంది మరీ

2026-11-12 05:54 GMT

Copyright @2026

Powered by Blink CMS