పవన్ చెప్పారు... కార్యకర్త డిప్యూటీ మేయర్ అయ్యారు !
| జనసేన ఆవిర్భావం నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న 37వ వార్డు కార్పొరేటర్ పందిరి శివప్రసాద్‌కు విశాఖ డిప్యూటీ మేయర్ పదవి దక్కింది. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయడంతో పాటు, జనసేన సేవాదళ్ జిల్లా కన్వీనర్‌గా పనిచేసిన ఆయనకు అధిష్ఠానం కీలక బాధ్యతలు అప్పగించింది.
సామాన్యులకు అవకాశం ఇస్తామని వారితోనే రాజకీయాలను మారుస్తామని జనసేన అధినేత హోదాలో పవన్ కళ్యాణ్ తరచూ చెబుతూ ఉంటారు. అలా చాలా మందికి ఆయన అవకాశాలు ఇచ్చారు. మరీ ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అనేకమంది ఈ విధంగా ఉన్నత పదవులు అందుకున్నారు. జనసేనను అభిమానించి జెండా పట్టుకుని వీధుల్లో తిరిగిన ఇక సామాన్య కార్యకర్తను మహా విశాఖ నగర పాలక సంస్థ వంటి ఏపీలో అతి పెద్ద కార్పోరేషన్ కి డిప్యూటీ మేయర్ గా చేసిన ఘనత కచ్చితంగా పవన్ కళ్యాణ్ దే అని అంటున్నారు. ఒక విధంగా ఇది జనసేనలో పనిచేసే వారికి ఉత్తేజంగా ఉంది. అలాగే రాజకీయాల్లో మార్పు కోరుకునేవారికి సందేశంగా ఉంది అని అంటున్నారు.
కష్టపడిన ఫలితం :
చాలా మంది పార్టీ పెద్దలు అంటూంటారు. కష్టపడిన వారికి పదవులు ఇస్తామని. అది కొన్ని సార్లు అవుతుంది, చాలా సార్లు అవదు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తాను చెప్పిన మాటకు కట్టుబడి విశాఖ వంటి చోట కీలక పదవికి సామాన్యుడిని ఎంచుకున్నారు. దాంతో విశాఖలో కొత్త రాజకీయం మొదలైంది అని అంటున్నారు. ఇక విశాఖ డిప్యూటీ మేయర్ గా ఎన్నికైన జనసేన 37వ వార్డు కార్పోరేటర్ పందిరి శివ ప్రసాద్ కి ఈ కీలక పదవి లభించింది. జనసేన ఆవిర్భావం నుంచి శివ ప్రసాద్ ఆ పార్టీలో చురుకుగా పనిచేస్తూ వస్తున్నారు.
అండదండలు లేకుండానే :
సాధారణంగా రాజకీయాల్లో అండదండలు ఉంటేనే ఎవరైనా ఎదుగుతారు. కానీ ఒక సామాన్య కార్యకర్త పార్టీ మీద నిబద్ధతతో అధినేత మీద అభిమానంతో ఏళ్ళుగా పనిచేయడం ఒక ఎత్తు అయితే దానికి హైకమాండ్ పెద్దలు గుర్తించి అతి ముఖ్యమైన పదవిని ఇవ్వడం అంటే వర్తమాన రాజకీయాల్లో ఇది నిజంగా గ్రేట్ అనే అంటున్నారు. సాధారణంగా పార్టీ కోసం ఎంతో చేశామని తమకు ఏ రకమైన పదవులు గౌరవాలూ దక్కలేదని చాలా మంది ఆవేదన చెందుతూంటారు. కానీ విశాఖ డిప్యూటీ మేయర్ రాజకీయ ప్రస్థానం చూస్తే కనుక వారంతా మరింత ఉత్సాహంగా పనిచేస్తారు అని అంటున్నారు.
క్షేత్ర స్థాయి నుంచి :
ఇక జనసేన నేతగా ఉన్న శివప్రసాద్ గ్రౌండ్ లెవెల్ లో బాగా పనిచేయడమే కాదు క్యాడర్ తో మమేకం అవుతూ వచ్చారు. ఆయన పార్టీ పటిష్టతకు తన వంతుగా ఎంతో కృషి చేశారు. ఇవన్నీ చూసిన జనసేన అధినాయకత్వం ఆయనకు విశాఖ జిల్లా జనసేన సేవా దళ్ కన్వీనర్ గా బాధ్యతలు అప్పగించింది. అలా నగరంలో పార్టీ కోసం మరింత గట్టిగా ఆయన పనిచేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మంచి మెజారిటీతో 37వ వార్డు నుంచి గెలిచి వచ్చారు. మొత్తానికి విశాఖ వంటి మహా నగరానికి డిప్యూటీ మేయర్ గా బాధ్యతలు స్వీకరించడం మాత్రం అంతా చర్చించుకుంటున్నారు.