• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Andhra Pradesh >  Visakhapatnam >  విశాఖ రూపురేఖలు మార్చేసే...

విశాఖ రూపురేఖలు మార్చేసే అద్భుత కట్టడం !

| విశాఖలో అంతర్జాతీయ సదస్సుల నిర్వహణకు ఏపీ ప్రభుత్వం 'ఆంధ్రా మండపం' నిర్మించేందుకు సిద్ధమైంది. కాపులుప్పాడ కొండపై 24 ఎకరాల్లో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఇందులో 5 వేల మంది కూర్చునే ఆడిటోరియం, ఎగ్జిబిషన్ హాల్, 250కి పైగా గదులతో హోటల్ నిర్మించనున్నారు. వచ్చే ఏడాది సీఐఐ సదస్సు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

By - Satya P
Update: 2026-11-23 03:57 GMT

విశాఖ ఎవరు అవునన్నా కాదనా కూడా ఏపీలో నెంబర్ వన్ సిటీగా ఉంది. అమరావతి రాజధానిగా ఉన్నప్పటికీ అక్కడ పూర్తి స్థాయిలో నిర్మాణాలకు సమయం పడుతుంది. అందుకే విశాఖ వేదికగా జాతీయ అంతర్జాతీయ సదస్సులు ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఆనాడు వైసీపీ ప్రభుత్వం అయినా అంతకు ముందు ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం అయినా విశాఖలోనే అనేక సమావేశాలు నిర్వహించాయి. పెట్టుబడుల సదస్సులు అయితే విశాఖలోనే జరిగాయి. కూటమి అధికారంలోకి వచ్చాక వరుసగా రెండేళ్ళ నుంచి సీఐఐ సమ్మిట్లు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది కూడా విశాఖలోనే జరగనున్నాయి. మరి విశాఖ అంతర్జాతీయ సదస్సులకు ఆతిధ్యం ఇస్తున్నపుడు దానికి తగిన వేదిక కూడా అవసరం అన్నది అందరిలో ఉన్న భావన.

తాత్కాలిక వేదికలలోనే :

విశాఖలో పెట్టుబడుల సదస్సులు మరే ఇతర కార్యక్రమాలు ప్రభుత్వ అధికారిక సమావేశాలు అన్నీ కూడా తాత్కాలిక వేదికలలోనూ లేదా ప్రైవేటు హొటళ్లలోనూ జరుగుతూ వస్తున్నాయి. వీటికి బోలెడు ఖర్చు అవుతోంది. వాటిని నిర్మించడం తొలగించడం అంతా పెద్ద భారంగా అవుతోంది. పైగా నగరం నడిబొడ్డున ఉన్న ఏయూ మైదానంలో ఇంటర్నేషనల్ సెమినార్స్ జరిగినపుడు భద్రతా రీత్యా నియంత్రణ ఉంటోంది. దాంతో సాధారణ ప్రజలకు ఇబ్బంది అవుతుంది. ట్రాఫిక్ కి సైతం ఇక్కట్లు అవుతోంది. దాంతో వీటిని అన్నింటికీ దృష్టిలో ఉంచుకున్న ఏపీలో కూటమి ప్రభుత్వం విశాఖలో ఒక అద్భుతమైన కట్టడాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది.

సువిశాల వేదికగా :

ఢిల్లీలో భారత మండపం అని ఎన్డీయే సర్కార్ నిర్మించింది. అక్కడ అనేక జాతీయ అంతర్జాతీయ సదస్సులు జరుగుతున్నాయి. అదే తరహాలో ఏపీలో కూడా ఆంధ్రా మండపం రూపకల్పన చేస్తున్నారు. విశాఖపట్నంలోని కాపులుప్పాడ కొండపై సుమారు 24 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ స్థాయి కన్వెన్షన్ ఎగ్జిబిషన్ సెంటర్‌గా ఆంధ్ర మండపం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రతిపాదించింది. ఢిల్లీలోని భారత్ మండపం మాదిరిగానే రూపొందిస్తున్న ఈ ప్రాజెక్టును ఏడాదిలోగా పూర్తి చేయాలని లక్ష్యంగా కూడా నిర్దేశించారు.

వేలాది మందికి చోటు :

కూటమి ప్రభుత్వం నిర్మించబోయే ఆంధ్ర మండపానికి సంబంధించి ఎన్నో విశేషాలు ఉన్నాయి. నగరంలో బీచ్ రోడ్డులో ఉన్న కాపులుప్పాడ కొండపై భాగం అంటే సముద్ర మట్టానికి సుమారు 120 మీటర్ల ఎత్తులో 24 ఎకరాలలో దీనిని నిర్మిస్తున్నారు. ఇక్కడ ఒకేసారి అయిదు వేల మంది కూర్చునే సామర్థ్యంతో సుమారు 3.50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రధాన ఆడిటోరియం రూపకల్పన చేస్తున్నారు. అలాగే భారీ ప్రదర్శనలు, వాణిజ్య సదస్సుల కోసం సుమారు 1 నుండి 1.50 లక్షల చదరపు అడుగుల ఎగ్జిబిషన్ హాల్ ని నిర్మిస్తున్నరు. 250కి పైగా గదులతో ఫోర్-స్టార్ లేదా అంతకంటే మెరుగైన సదుపాయాలతో హోటల్ ఉంటుంది. ఇక్కడ నుంచి అతిధులు సముద్ర అందాలు వీక్షించే వ్యూ పాయింట్లు, పూలతోటలు, వాటర్ ఫౌంటెన్లు, తెలుగు సంస్కృతిని ప్రతిబింబించే శిల్పాలు ఇలా ఎన్నో ఉంటాయి. ఈ ఆంధ్రా మండపం తో విశాఖ రూపురేఖలు మారిపోతాయని అంటున్నారు. అంతే కాదు విశాఖకు వచ్చే దేశీయ విదేశీయ అతిధులకు ఇది చక్కని వేదికగా ఉండబోతోంది అని అంటున్నారు. వచ్చే ఏడాది సీఐఐ సదస్సు నాటికి దీనిని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారని అంటున్నారు.

Tags:    
  • andhramandapam 
  • visakhapatnam 
  • vizag 
  • andhrapradesh 
  • apgovernment 

Similar News

అట్రాక్షన్ లాగేస్తోంది.... బీచ్ మింగేస్తోంది !

2026-11-23 03:57 GMT

గోవా కేరళ తరహాలో విశాఖ....కూటమి యాక్షన్ ప్లాన్ !

2026-11-22 04:30 GMT

విశాఖ కొత్త మేయర్ ఇంట పెను విషాదం.. కూతురి ప్రమాణస్వీకారం చూడకుండానే తండ్రి కన్నుమూత

2026-11-20 17:23 GMT

విశాఖ నుంచి తిరుపతి వెళ్ళే భక్తులకు సూపర్ న్యూస్

2026-11-19 21:15 GMT

విశాఖ మరో గిఫ్ట్... కైలాసగిరికి కొత్త రోప్‌వే

2026-11-19 04:57 GMT

గంటా దూకుడు రాజకీయం...బొత్స కూతురు ఏం చేస్తున్నట్లు ?

2026-11-19 03:15 GMT

విశాఖలో ఎలక్ట్రిక్ బస్సులు...వారికి ఫ్రీగానే !

2026-11-16 18:55 GMT

అభివృద్ధి మ్యాప్ లో భీమిలీ మారుమూల గ్రామం !

2026-11-14 03:22 GMT

సమ్మిట్ సూపర్ హిట్... 303 ప్రాజెక్టులు...9.89 లక్షల కోట్ల పెట్టుబడులు !

2026-11-14 03:20 GMT

ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు....బాబు కీలక కామెంట్స్

2026-11-13 18:30 GMT

మీ తాత మా తాత గ్రేట్...లోకేష్ తో ఉపాసన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ !

2026-11-13 04:06 GMT

Copyright @2026

Powered by Blink CMS