• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Andhra Pradesh >  Tirupati >  తిరుమలేశుడికి 121 కేజీల...

తిరుమలేశుడికి 121 కేజీల బంగారం ఇచ్చింది ఎవరో తెలుసా? ఎందుకిచ్చాడంటే?

| చెన్నై పారిశ్రామికవేత్త వర్ధమాన్ జైన్ తిరుమల శ్రీవారికి 121 కిలోల బంగారంతో తయారుచేసిన 47 రకాల ఆభరణాలను సమర్పించారు. వీటి విలువ సుమారు రూ.206 కోట్లు. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా కానుకకు సంబంధించిన పత్రాలను టీటీడీ అధికారులకు అందజేశారు. గతంలోనూ ఆయన రూ.6 కోట్లు, ఎలక్ట్రిక్ బస్సును విరాళంగా ఇచ్చారు.

By - A.N.Kumar
Update: 2026-11-26 09:03 GMT

మనిషి జీవితంలో విజయం సాధించినప్పుడు ఆ గెలుపు వెనుక ఉన్న శ్రమను చూసుకుని గర్వపడటం సహజం. కానీ ఆ విజయానికి కారణం ఆ దైవమేనని నమ్మి.. తాను సంపాదించిన సంపదలో సింహభాగాన్ని ఆ భగవంతుడి పాదాల చెంత ఉంచే గొప్ప మనసు కొందరికే ఉంటుంది. అటువంటి నిస్వార్థ భక్తికి.. అచంచల విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు చెన్నైకి చెందిన పారిశ్రామికవేత్త వర్ధమాన్ జైన్.

ఏడుకొండలవాడిపై తనకున్న అపారమైన భక్తిని చాటుకుంటూ ఆయన సమర్పించిన 121 కిలోల బంగారు ఆభరణాలు ఇప్పుడు యావత్ దేశాన్ని విస్మయానికి, భక్తి పారవశ్యానికి గురిచేస్తున్నాయి. సుమారు రూ. 206 కోట్ల విలువైన ఈ బృహత్తర కానుక వెనుక ఒక హృదయాన్ని హత్తుకునే కృతజ్ఞతా కథ ఉంది.

వర్ధమాన్ జైన్ ఒక సంస్థను స్థాపించి.. ఎన్నో ఒడిదుడుకులను దాటుకుంటూ దానిని ఉన్నత శిఖరాలకు చేర్చారు. వ్యాపారంలో తాను అనుకున్న స్థాయికి చేరుకున్న తర్వాత.. తన కంపెనీలోని కొంత వాటాను విక్రయించగా ఆయనకు భారీ మొత్తంలో ధనం సమకూరింది. సాధారణంగా ఎవరైనా ఆ సంపదను తమ సొంత ప్రతిభగా భావించి విలాసాలకు లేదా తదుపరి వ్యాపార విస్తరణకు ఉపయోగిస్తారు.

కానీ వర్ధమాన్ జైన్ ఆలోచన భిన్నంగా సాగింది. తన కష్టానికి ఫలితం దక్కడం వెనుక తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి కరుణాకటాక్షాలు ఉన్నాయని ఆయన ప్రగాఢంగా విశ్వసించారు. ఇచ్చింది ఆయనే అయినప్పుడు.. అందులో కొంత తిరిగి ఆయనకే సమర్పించడంలోనే అసలైన సంతృప్తి ఉంది అనే భావనతో ఏకంగా 121 కిలోల బంగారంతో తయారు చేయించిన 47 రకాల అత్యద్భుతమైన ఆభరణాలను స్వామివారికి కానుకగా అందించాలని నిర్ణయించుకున్నారు.

అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ట్రంకు పెట్టెలలో భద్రపరిచిన ఈ బంగారు ఆభరణాలను తిరుమల ఆలయానికి తీసుకువచ్చారు. ఈ అపురూప కానుకకు సంబంధించిన పత్రాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా టీటీడీ అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. టీటీడీ చరిత్రలోనే ఒక భక్తుడు వ్యక్తిగతంగా సమర్పించిన అతిపెద్ద బంగారు కానుక ఇదే కావడం విశేషం.

శ్రీవారి పట్ల వర్ధమాన్ జైన్ చూపిన ఈ భక్తి ఒక్కరోజుతో పుట్టింది కాదు. గతంలోనూ ఆయన ఎన్నోసార్లు తన ఉదారతను చాటుకున్నారు:

2025 జనవరి 19న శ్రీవారి సేవార్థం రూ. 6 కోట్ల నగదును విరాళంగా అందజేశారు. 2025 మే 16న తిరుమల భక్తుల సౌకర్యార్థం ఒక ఆధునిక ఎలక్ట్రిక్ బస్సును టీటీడీకి సమర్పించారు. నిత్యం దివ్యమైన ఆభరణాలతో శోభాయమానంగా వెలిగిపోయే ఆ కలియుగ దైవం అలంకరణలో ఇప్పుడు వర్ధమాన్ జైన్ సమర్పించిన ఈ 47 రకాల ఆభరణాలు కూడా భాగం కానున్నాయి.

సంపద ఎంత ఉన్నా.. దానిని దైవకార్యానికి వినియోగించే సంస్కారం ఉన్నప్పుడే ఆ సంపదకు సార్థకత లభిస్తుంది. వందల కోట్ల విలువైన బంగారాన్ని సైతం తృణప్రాయంగా భావించి.. కేవలం కృతజ్ఞతా భావంతో శ్రీవారి పాదాల చెంత ఉంచిన వర్ధమాన్ జైన్ భక్తి.. ప్రతి భక్తుడి హృదయాన్ని ఆర్ద్రతతో నింపుతోంది.

Who Is the Devotee Donating 121 Kg of Gold to Lord Venkateswara? A massive gold donation of 121 kilograms to Lord Venkateswara at Tirumala has sparked widespread curiosity about the devotee behind the offering. The donor is Vardhaman Jain, a Chennai-based businessman, who recently visited the Tirumala temple along with his family. According to details shared by the Chief Minister last year, Jain reportedly received around ₹6,000 crore after selling a 60% stake in his company. He decided to donate 121 kg of gold from the proceeds to the Tirumala deity. 🙏 A remarkable gesture of devotion and generosity! #Tirumala #LordVenkateswara #VardhamanJain #GoldDonation #TTD #Tirupati

— 𝐏𝐫𝐚𝐝𝐞𝐞𝐩 𝐁𝐨𝐝𝐚𝐩𝐚𝐭𝐥𝐚 (@pradeeepjourno) November 26, 2026
Tags:    
  • vardhamanjain 
  • tirumala 
  • ttd 
  • lordvenkateswara 

Similar News

టీటీడీ చరిత్రలో ఆల్ టైమ్ రికార్డ్...121 కిలోల బంగారం విరాళం !

2026-11-21 23:59 GMT

ఆమెను త‌ట్టుకోలేమ‌బ్బా.. చెవిరెడ్డికి సుధ సంక‌టం.. !

2026-11-09 19:13 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

స్పెసిఫైడ్ అథారిటీకి టీటీడీ...కొత్త బోర్డు అప్పుడే ?

2026-11-02 18:27 GMT

టీటీడీ చైర్మ‌న్‌ రేసులో ఎన్నారై.. బాబు అవ‌కాశం ఇస్తారా.. ?

2026-10-31 17:30 GMT

పనబాక కుమార్తెకు కీలక పదవి.. టీడీపీ అధిష్టానం సంకేతాలు

2026-10-30 13:30 GMT

టీటీడీ చైర్మన్ రేస్ : బిగ్ ట్విస్ట్ ఇస్తారా? బీఆర్ నాయుడు రిటైర్మెంట్, కళా వర్సెస్ జ్యోతుల నెహ్రూ

2026-10-30 09:15 GMT

'తిరుప‌తి' మేయ‌ర్ పీఠం అంత ఈజీకాదా ..!

2026-10-21 14:30 GMT

రూ.4.75 కోట్ల రోడ్డును ట్రాక్టర్ తో వైసీపీ నేతలు దున్నేశారు.. పవన్ సంచలన నిర్ణయం

2026-10-19 17:01 GMT

తిరుమ‌ల క‌ల్తీ నెయ్యి కేసు: 130 కోట్ల ఆస్తులు ఎటాచ్‌.. బాధ్యుల సంగతేంటి?

2026-10-14 18:30 GMT

మనవడి కేశఖండన.. గొప్ప మనసు చాటుకున్న నాగబాబు!

2026-10-03 04:43 GMT

Copyright @2026

Powered by Blink CMS