తిరుమ‌ల క‌ల్తీ నెయ్యి కేసు: 130 కోట్ల ఆస్తులు ఎటాచ్‌.. బాధ్యుల సంగతేంటి?

తిరుమ‌ల శ్రీవారి పవిత్ర ప్ర‌సాదం ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యిని వినియోగించార‌న్న కేసులో బుధ‌వారం కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది.

Update: 2026-10-14 18:30 GMT

తిరుమ‌ల శ్రీవారి పవిత్ర ప్ర‌సాదం ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యిని వినియోగించార‌న్న కేసులో బుధ‌వారం కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. తిరుమ‌ల‌కు నెయ్యిని స‌ర‌ఫ‌రా చేసిన మూడు కంపెనీల‌కు చెందిన 130 కోట్ల రూపాయ‌ల ఆస్తుల‌ను ఎన్ ఫోర్స్‌మెంటు డైరెక్ట‌రేట్‌(ఈడీ) అధికారులు అటాచ్ చేశారు. వీటిలో భోలే బాబా, సుకృతి, శ్రీవైష్ణ‌వి డెయిరీలు ఉన్నాయి. ఈ మూడు సంస్థ‌లు కూడా వైసీపీ హ‌యాంలో భారీ ఎత్తున తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదం త‌యారీకి నెయ్యిని స‌ర‌ఫ‌రా చేశాయి. వీటిలో భారీ క‌ల్తీ జ‌రిగింద‌ని.. సీబీఐ అధికారులు ఇప్ప‌టికే నిర్ధారించారు. అస‌లు పాలు లేకుండానే నెయ్యిని త‌యారు చేశార‌న్న‌ది ప్ర‌ధాన ఆరోప‌ణ‌.

ఈ క్ర‌మంలోనే మ‌రింత లోతుగా విచారించేందుకు.. నెయ్యి క‌ల్తీ ఘ‌ట‌న‌లో సొమ్ములు చేతులు మారాయ‌ని భావిస్తున్న ఈడీ అధికారులు ఆయా సంస్థ‌ల ఆస్తుల‌ను అటాచ్ చేసిన‌ట్టు తెలిపారు. ఈ సంస్థ‌ల కీల‌క వ్య‌క్తుల ఆస్తుల‌పైనా చ‌ర్య‌లు తీసుకున్నారు. మొత్తంగా మూడు కీల‌క సంస్థ‌ల‌పైనా కేసులు పెట్ట‌డం, ఆస్తులు అటాచ్ చేయ‌డం వ‌ర‌కు అయిపోయింది. అయితే.. ఇవి ఏమూల‌కు? అనేదిప్రధాన ప్ర‌శ్న‌. దాదాపు రెండు నుంచి మూడు వేల కోట్ల రూపాయ‌ల విలువైన నెయ్యిని వినియోగించిన‌ట్టు తిరుమ‌ల అధికారులు చెబుతున్నారు. కానీ.. తాజాగా 130 కోట్ల రూపాయ‌ల ఆస్తుల‌ను మాత్ర‌మే అటాచ్ చేశారు.

ఇవి కూడా రేపు కోర్టులో ఏమేర‌కు నిల‌బ‌డ‌తాయ‌న్న‌ది ప్ర‌శ్న‌. వాస్త‌వానికి ఇప్ప‌టికే నాటి తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం బోర్డు చైర్మ‌న్‌గా ప‌నిచేసిన వైసీపీనేత రాజ్య‌స‌భ స‌భ్యుడు వైవీ సుబ్బారెడ్డి పీయే చిన్నప్ప‌న్న‌ను కూడా అధికారులు అరెస్టు చేశారు.అత‌ని అకౌంట్‌లోని సొమ్మును కూడా ఫ్రీజ్ చేశారు. కానీ.. ఇప్ప‌టి వ‌ర‌కు కింగ్ పిన్ ఎవ‌రనేది తేల్చ‌లేక పోయారు. అంతేకాదు.. అస‌లు ఈ కేసులో పెద్ద‌ల పేర్లుకానీ.. వారి విచార‌ణ కానీ ఎక్క‌డా లేకుండా పోవ‌డం గ‌మ‌నార్హం. తాజాగా కూడా అదే జ‌రిగింద‌న్న వాద‌న వినిపిస్తోంది. 2 నుంచి 3 వేల కోట్ల రూపాయ‌ల అవినీతి వ్య‌వ‌హారంలో 130 కోట్ల రూపాయ‌ల మేర‌కు అటాచ్ చేయ‌డంపై పెద‌వి విరుస్తున్నారు.

విచార‌ణ‌ల‌తోనే స‌రి!

ఇప్ప‌టి వ‌రకు తిరుమ‌ల క‌ల్తీ నెయ్యి వ్య‌వ‌హారంలో వైవీ సుబ్బారెడ్డి, అప్ప‌టి ఈవో ధ‌ర్మారెడ్డి, మ‌రో ఈవో సింఘాల్‌ వంటివారిని అధికారులు విచార‌ణ వ‌ర‌కు మాత్ర‌మే ప‌రిమితం చేశారు. వారి పేర్ల‌ను కూడా ఎక్క‌డా కేసులో న‌మోదు చేయ‌లేదు. అంతేకాదు.. మ‌రోసారి విచార‌ణ‌కు కూడా పిల‌వ‌లేదు. మొత్తం కంపెనీల‌పైనే ఆధార‌ప‌డిన‌ట్టు క‌నిపిస్తోంద‌న్న వాద‌న ఉంది. నిజానికి ఇండెంటు నుంచి ఆర్డ‌ర్ వ‌ర‌కు.. ఈ విష‌యంలో పెద్ద‌ల పాత్ర లేకుండా జ‌రుగుతుందా? అన్న‌ది కీల‌క ప్ర‌శ్న‌. కానీ.. సీబీ ఐ అధికారులు కేసు ద‌ర్యాప్తును పూర్తి చేయ‌గా.. ఈడీ అధికారులు కేవ‌లం ఆస్తుల అటాచ్‌మెంటుకే ప‌రిమితం అయ్యారు.

Tags:    

Similar News