• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  స్పెసిఫైడ్ అథారిటీకి...

స్పెసిఫైడ్ అథారిటీకి టీటీడీ...కొత్త బోర్డు అప్పుడే ?

| తిరుమల తిరుపతి దేవస్థానం పాలక వర్గం పదవీ కాలం ఇటీవలనే ముగిసింది. చైర్మన్ గా రెండు దఫాల పాటు రెండేళ్ళ కాలానికి బాధ్యతలు నిర్వహించిన బీఆర్ నాయుడు మాజీ అయ్యారు.

By - Satya P
Update: 2026-11-02 18:27 GMT

తిరుమల తిరుపతి దేవస్థానం పాలక వర్గం పదవీ కాలం ఇటీవలనే ముగిసింది. చైర్మన్ గా రెండు దఫాల పాటు రెండేళ్ళ కాలానికి బాధ్యతలు నిర్వహించిన బీఆర్ నాయుడు మాజీ అయ్యారు. ఆయనతో పాటు బోర్డు మొత్తం పాలనా కాలం పూర్తి అయింది. దాంతో కొత్త బోర్డు ఎపుడు అని అంతా చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ దైనందిన పాలనా వ్యవహారాలు సాఫీగా నడిచేందుకు స్పెసిఫైడ్ అధారిటీని ప్రభుత్వం నియమించింది. టీడీపీ పాలన స్పెసిఫైడ్ అధారిటీతోనే ఇక మీదట సాగనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టీటీడీ ఈవోగా ప్రస్తుతం వ్యవహరిస్తున్న ముద్దాడ రవిచంద్ర స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్ గా నియమితులయ్యారు.

ఆచీ తూచీ నిర్ణయం :

ఇదిలా ఉంటే ప్రపంచ దేవుడుగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ పాలన కోసం ఏర్పాటు చేస్తే బోర్డుకు కొత్త చైర్మన్ ఎవరు అన్నది చర్చకు వస్తోంది. ఈ పదవి ఎంతో ప్రతిష్టాత్మకమైనది అన్నది తెలిసిందే. ఈ పదవి కోసం ఎంతో మంది ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎంతో నిష్టతో నియమంతో నిర్వహించాల్సిన పదవి కావడంతో ప్రభుత్వం ఆచీ తూచీ వ్యవహరిస్తుంది అని అంటున్నారు. అంతే కాదు ఎన్నో సమీకరణలు కూడా చూడాల్సి ఉంటుందని అంటున్నారు. అందుకే ప్రస్తుతానికి కొత్త బోర్డు అన్నది లేకుండా స్పెసిఫైడ్ అథారిటీకి బాధ్యతలు అప్పగించారు అని అంటున్నారు.

ఆధ్యాత్మిక అనుబంధంతో :

అయితే ప్రభుత్వం ఈ కీలక పదవిని ఆధ్యాత్మికతో అనుబంధం ఉన్న వారు అలాగే పాలనా పరంగా అన్నీ తెలిసిన వారికి ఈ పదవిని అప్పగించాలని చూస్తోంది అని అంటున్నారు. ముఖ్యంగా రాజకీయ నాయకుల కంటే వేరే రంగాల వారి నుంచి కొత్త చైర్మన్ ని తీసుకుని రావాలని చూస్తున్నారు అని వినిపిస్తున్న మాట. టీటీడీ అంటే ఎంతో పవిత్రమైన బాధ్యత. అంతర్జాతీయంగా పేరున్న ఈ ఆలయానికి చైర్మన్ అంటే అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని అంటున్నారు. అయితే ఎమ్మెల్యేలు పలువురు కూటమిలో ఈ పదవి కోసం ప్రయత్నం చేస్తున్నారు అని అంటున్నారు. మంత్రి పదవి ఆశించి భంగపడిన జ్యోతుల నెహ్రూతో పాటు విజయనగరం జిల్లా చీపురుపల్లి ఎమ్మెల్యే మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు కూడా రేసులో ఉన్నారని అంటున్నారు. అయితే కళాకు గతంలో ఒకసారి ఛాన్స్ వచ్చింది కాబట్టి ఈసారి ఎమ్మెల్యేలలోనే తీసుకోవాలీ అనుకుంటే జ్యోతుల పేరు ముందున ఉండొచ్చు అని అంటున్నారు.

అన్నీ చూసుకున్నాకే :

ఇక చూస్తే స్పెసిఫైడ్ అధారిటీకి కొత్త పాలక వర్గం నియామకం అయ్యేంతవరకూ అలా జరగకపోతే ఏడాది పాటు కాల పరిమితి ఉండేలా అవకాశం ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు కాబట్టి టీటీడీ బోర్డు విషయంలో తొందర ఏమీ లేదని అంటున్నారు. ప్రస్తుతం స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయి. డిసెంబర్ లో పంచాయతీ ఎన్నికలు పూర్తి అవుతాయి. ఆ మీదట మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని అంటున్నారు. ఇవన్నీ చూసుకునే సరికి కొత్త ఏడాది వస్తుంది. అలా కనీసంగా మూడు నెలల కాలం అయితే కొత్త బోర్డు నియామకానికి పట్టవచ్చు అని అంటున్నారు. ఏది ఏమైనా ఇంకా సగం పాలన కూటమికి మిగిలి ఉంది కాబట్టి వెంటనే బోర్డుని నియమిస్తే మరో రెండు చాన్సులు ఆశావహులకు ఉంటాయని అంటున్నారు.

Tags:    
  • ttd 
  • ttdchairman 
  • tirumala 
  • andhrapradesh 
  • jyothulanehru 
  • kalavenkatrao 

Similar News

నేల మీదకు జగన్...వ్యూహమా అనివార్యమా ?

2026-11-02 18:28 GMT

విశాఖ హెచ్‌పీసీఎల్ లో భారీ పేలుడు

2026-11-02 18:28 GMT

రష్యా-ఉక్రెయిన్ పోరులో భారత్ క్రేజ్.. ఉక్రెయిన్ ఆరాటాన్ని ఎద్దేవా చేసిన పుతిన్

2026-11-02 18:27 GMT

కోర్టులో ఇమ్రాన్ ఖాన్ క్షమాప‌ణ‌లు.. OCI కార్డ్‌హోల్డర్ల ప‌రిమితుల‌పై భారీ చర్చ

2026-11-02 18:27 GMT

ముంబై గొంతెమ్మ కోరికలు.. హార్దిక్ పాండ్యా ట్రేడ్ కు కేకేఆర్ బ్రేక్

2026-11-02 18:26 GMT

ట్రంప్ టవర్స్‌లో షాకింగ్ పరిస్థితులు.. కోట్ల ఫ్లాట్ కొన్నా కర్టెన్లు లేవు.. లిఫ్ట్ లేదు

2026-11-02 18:26 GMT

మెగాస్టార్ చుట్టూ ఊహాగానాలు...మ్యాటర్ మాత్రం ?

2026-11-02 18:25 GMT

రాహుల్ అర్ధమవుతోందా...అమిత్ షా లాజిక్ పాయింట్ !

2026-11-02 18:24 GMT

భారత్ దెబ్బకు పాకిస్తాన్ దివాళా తీసింది.. ఇవే సాక్ష్యాలు

2026-11-02 18:24 GMT

కూటమి జై కొట్టారా.... వైసీపీ గ్రాఫ్ పెరిగిందా ?

2026-11-02 18:23 GMT

రెచ్చిపోతున్న బంగ్లాదేశ్ ను కర్ర కాల్చి వాత పెడుతోన్న భారత్.. భారీ మాస్టర్ స్ట్రోక్

2026-11-02 18:21 GMT

Copyright @2026

Powered by Blink CMS