• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  మెగాస్టార్ చుట్టూ...

మెగాస్టార్ చుట్టూ ఊహాగానాలు...మ్యాటర్ మాత్రం ?

| మెగాస్టార్ చిరంజీవి సినీ రంగంలో అందరి వాడు. పరిశ్రమకు పెద్ద దిక్కు. ఆయన పెద్దరికం మీద అందరికీ నమ్మకం ఉంది.

By - Satya P
Update: 2026-11-02 18:25 GMT

మెగాస్టార్ చిరంజీవి సినీ రంగంలో అందరి వాడు. పరిశ్రమకు పెద్ద దిక్కు. ఆయన పెద్దరికం మీద అందరికీ నమ్మకం ఉంది. అనేక సమస్యలను ఆయన పరిష్కరిస్తూ వస్తున్నారు. ఇక చిరంజీవి స్వభావానికి రాజకీయాలు పడవని సన్నిహితులు అంటారు. ఆయన మెత్తని స్వభావం కలిగిన వారు. అందుకే ఆయన రాజకీయాల్లోకి ఎంత తొందరగా వెళ్లాలో అంతే వేగంగా వెనక్కి తిరిగారు. అది కూడా ఎలాంటి విమర్శలు పెద్దగా లేకుండానే గౌరవంగా తప్పుకున్నారు. ఇక తన జీవితం అంతా సినిమాలకే అంకితం అని ఆయన పదే పదే అనేక సార్లు చెప్పి ఉన్నారు. అయినా సరే మెగాస్టార్ చుట్టూ ఎపుడూ రాజకీయ ఊహాగానాలు వినిపిస్తూనే ఉంటాయి. ఆయన విషయంలో మరోసారి అలాంటి వార్తలే ప్రచారంలో ఉంటూ వస్తున్నాయి.

అమిత్ షాతో భేటీ :

ఇదిలా ఉంటే హైదరాబాద్ పర్యటనకు వచ్చిన కేంద్ర హోంమంత్రి బీజేపీ అగ్ర నేత అమిత్ షాను మెగాస్టార్ చిరంజీవి ఆయన కుమారుడు రామ్ చరణ్ తో పాటుగా వెళ్ళి కలిశారు. ఇది మర్యాదపూర్వకమైన భేటీ అని చెబుతున్నా కూడా చిరంజీవి రాజకీయం గురించి మరోసారి చర్చించే విధంగా వార్తా కధనాలు అల్లుతున్న వారూ ఉన్నారు. అయితే అమిత్ షాను కలిసిన ప్రముఖులలో అనేక రంగాలకు చెందిన వారు ఉన్నారు. అందులో మై హోం నుంచి రామేశ్వరరావు, అలాగే ఒక ప్రముఖ తెలుగు టీవీ చానెల్ అధినేత ఇంకా అనేక మంది ఉన్నారు. అయితే అందరి దృష్టి మాత్రం మెగాస్టార్ మీదనే ఉంది. ఎందుకంటే ఆయన సినీ దిగ్గజం, కేంద్ర మాజీ మంత్రి, అంతే కాదు జనసేన అధినేత పవన్ కి సోదరుడు కాబట్టి అని అంటున్నారు. ఇక పవన్ ఏపీలో కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గా ఉన్నారు. ఆ కూటమిలో బీజేపీ కూడా ఉంది. అలా ఆ బంధాన్ని కూడా కలుపుతూ చిరంజీవి రాజకీయాల మీద చర్చించే వారూ ఉన్నారు.

మర్యాదపూర్వకమైనదే :

అయితే అమిత్ షాని చిరంజీవి కలవడం వెనక రాజకీయం లేదని అంటున్నారు. కేవలం మర్యాదపూర్వకమైన భేటీ అని చెబుతున్నారు. ఈ సందర్భంగా టాలీవుడ్ సినీ రంగం పరిస్థితులలో పాటు తమ సినిమాల గురించి చర్చకు వచ్చినట్లుగా చెబుతున్నారు. ఇక చిరంజీవి విషయానికి వస్తే ఆయన రాజకీయంగా అందరి వాడుగా ఉన్నారని గుర్తు చేస్తున్నారు. ఆయనకు పార్టీలతో సంబంధం లేదని కూడా అంటున్నారు. ఏపీలో ఈ మధ్య పర్యటించిన మెగాస్టార్ కూటమి ప్రభుత్వం పాలన బాగుందని చెప్పారని అంటున్నారు. అలాగే రేవంత్ రెడ్డితో కూడా అనేక వేదికలు పంచుకున్నారని అంటున్నారు. ఇలా అందరి వాడుగా ఉంటూ వస్తున్న చిరంజీవి రాజకీయాలలో క్రియాశీలకం అవుతారు అన్నది కేవలం ఊహాగానాలే అని అంటున్నారు.

కమలం ఆశలు :

అయితే కమలం పార్టీకి ఆశలు మాత్రం ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కూటమిలో ఉన్నారు. చిరంజీవి వంటి బిగ్ ఫిగర్ కనుక తమతో ఉంటే తెలంగాణాలో కూడా అధికారానికి మరింత సులువు అవుతుందన్న లెక్కలు బీజేపీకి ఉన్నాయని చెబుతున్నారు. అయితే చిరంజీవి తిరిగి రాజకీయాల్లోకి వస్తారా అంటే అది ఈజీ కాదు కదా అసలు కుదిరే వ్యవహారం కానే కాదని అంటున్నారు. ఒక విధంగా చిరంజీవి రాజకీయం అన్నది ముగిసిన అధ్యాయం అని కూడా అంటున్నారు. అయితే కాలం ఎపుడూ గొప్పది చూడాలి మరి ఊహాగానాలు అలాగే ఉంటాయా లేక ఏమవుతాయి అన్నది.

Tags:    
  • chiranjeevi 
  • amitshah 
  • megastar 
  • telanganapolitics 
  • megastarchiranjeevi 

Similar News

నేల మీదకు జగన్...వ్యూహమా అనివార్యమా ?

2026-11-02 18:28 GMT

విశాఖ హెచ్‌పీసీఎల్ లో భారీ పేలుడు

2026-11-02 18:28 GMT

స్పెసిఫైడ్ అథారిటీకి టీటీడీ...కొత్త బోర్డు అప్పుడే ?

2026-11-02 18:27 GMT

రష్యా-ఉక్రెయిన్ పోరులో భారత్ క్రేజ్.. ఉక్రెయిన్ ఆరాటాన్ని ఎద్దేవా చేసిన పుతిన్

2026-11-02 18:27 GMT

కోర్టులో ఇమ్రాన్ ఖాన్ క్షమాప‌ణ‌లు.. OCI కార్డ్‌హోల్డర్ల ప‌రిమితుల‌పై భారీ చర్చ

2026-11-02 18:27 GMT

ముంబై గొంతెమ్మ కోరికలు.. హార్దిక్ పాండ్యా ట్రేడ్ కు కేకేఆర్ బ్రేక్

2026-11-02 18:26 GMT

ట్రంప్ టవర్స్‌లో షాకింగ్ పరిస్థితులు.. కోట్ల ఫ్లాట్ కొన్నా కర్టెన్లు లేవు.. లిఫ్ట్ లేదు

2026-11-02 18:26 GMT

రాహుల్ అర్ధమవుతోందా...అమిత్ షా లాజిక్ పాయింట్ !

2026-11-02 18:24 GMT

భారత్ దెబ్బకు పాకిస్తాన్ దివాళా తీసింది.. ఇవే సాక్ష్యాలు

2026-11-02 18:24 GMT

కూటమి జై కొట్టారా.... వైసీపీ గ్రాఫ్ పెరిగిందా ?

2026-11-02 18:23 GMT

రెచ్చిపోతున్న బంగ్లాదేశ్ ను కర్ర కాల్చి వాత పెడుతోన్న భారత్.. భారీ మాస్టర్ స్ట్రోక్

2026-11-02 18:21 GMT

Copyright @2026

Powered by Blink CMS