• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Andhra Pradesh >  Tirupati >  టీటీడీ చరిత్రలో ఆల్ టైమ్...

టీటీడీ చరిత్రలో ఆల్ టైమ్ రికార్డ్...121 కిలోల బంగారం విరాళం !

| తిరుమల శ్రీవారికి ఓ భక్తుడు 121 కిలోల బంగారంతో తయారు చేసిన 45 ఆభరణాలను విరాళంగా అందించనున్నారు. వీటి విలువ సుమారు రూ.150–160 కోట్లు ఉంటుందని అంచనా. నవంబర్ 26న టీటీడీ అధికారులకు అందించనుండగా, దాత తన పేరు గోప్యంగా ఉంచాలని కోరినట్లు సమాచారం. వ్యక్తిగతంగా అందుతున్న భారీ విరాళాల్లో ఇది రికార్డుగా నిలవనుంది.

By - Satya P
Update: 2026-11-21 23:59 GMT

తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో ఇప్పటిదాకా అంతటి భారీ విరాళాన్ని ఎవరూ ఇవ్వలేదు. వందలాది సంవత్సరాలుగా స్వామిని ఎంతో మంది రాజులు జమీందార్లు కొలిచి కానుకలు సమర్పించారు. కానీ వ్యక్తిగత హోదాలో ఇంతటి భూరి విరాళం ఎవరూ ఇప్పటిదాకా ఇవ్వలేదని అంటున్నారు. అలా టీటీడీ చరిత్రలోనే సరికొత్త రికార్డుగా ఒక భక్తుడు తన భక్తిని చాటుకుంటున్నారు. ఆ భక్తుడు స్వామి వారికి 121 కిలోల బంగారం ఆభరణాలను విరాళంగా ఇవ్వడం అన్నది ఇపుడు అతి పెద్ద విశేషంగా చెప్పుకుంటున్నారు. ఈ బంగారం విలువ నగదు రూపంలో లెక్కిస్తే 150 కోట్ల రూపాయల నుండి 160 కోట్ల రూపాయలుగా ఉంటుంది అని అంటున్నారు.

శ్రీవారికి 45 ఆభరణాలుగా :

ఈ భక్తుడు 121 కిలోల బంగారంతో తయారు చేయించిన తొమ్మిది సెట్లుగా ఉన్న 45 ఆభరణాలను సమర్పించనున్నట్లుగా టీటీడీ వెల్లడించింది. నవంబర్ 26వ తేదీన సదరు భక్తుడు తిరుమల చేరుకుని శ్రీవారి సన్నిధిలో టీటీడీ అధికారులకు ఈ ఆభరణాలను అధికారికంగా అప్పగించనున్నారని చెబుతున్నారు. తిరుమల ఆలయ చరిత్రలోనే వ్యక్తిగతంగా ఒక భక్తుడి నుండి ఇంత భారీ స్థాయిలో బంగారు ఆభరణాలు కానుకగా రావడం ఇదే మొదటిసారని పేర్కొంటున్నారు. దీంతో ఆభరణాల స్వీకరణ తో పాటు ఇతర అధికారిక లాంఛనాలకు సంబంధించి సదరు భక్తుడు ఇప్పటికే టీటీడీ అధికారులతో సంప్రదింపులు జరిపి ప్రక్రియను పూర్తి చేశారు. అయితే ఇంతటి భూరి విరాళాలు సమర్పించే ఆ దాత తన పేరును గోప్యంగా ఉంచాలని టీటీడీ అధికారులను కోరుకున్నట్లుగా సమాచారంగా ఉంది.

శ్రీకృష్ణదేవరాయల నుంచి :

ఇదిలా ఉంటే తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి భక్తులు, రాజులు సమర్పించిన విరాళాలకు శతాబ్దాల ఘనమైన చరిత్ర ఉంది. 15వ శతాబ్దానికి చెందిన శ్రీకృష్ణదేవరాయలు శ్రీవారిని తమ కులదైవంగా కొలిచారు. ఆలయ గోడలపై ఉన్న శాసనాల ప్రకారం, ఆయన తన పాలనలో ఏడుసార్లు తిరుమలను సందర్శించి అపారమైన సంపదను సమర్పించారు. అంతే కాదు రాయల వారు 1513లో తన మొదటి పర్యటన సందర్భంగా 423 వజ్రాలు, 160 పచ్చలు, 1,339 ముత్యాలు, కెంపులు, నీలాలతో పొదిగిన బంగారు కిరీటాన్ని సమర్పించారు. అలాగే 1514లో కళింగ దండయాత్ర విజయానంతరం 30,000 బంగారు వరహాలతో స్వామివారికి కనకాభిషేకం నిర్వహించారు. నవరత్న ప్రభావళి, బంగారు కత్తులు, భుజకీర్తులు, నవరత్నాలు పొదిగిన పీతాంబరం, బంగారువెండి పూజా పాత్రలను కానుకగా ఇచ్చారు. రాయలదేవేరులు తిరుమల దేవి, చిన్నాదేవి కూడా స్వామివారి నిత్య నైవేద్యాల కోసం అనేక గ్రామాలు, బంగారు ఆభరణాలు సమర్పించారు.

ఎన్నో కానుకలుగా :

ఇక పల్లవులు, చోళులు, పాండ్యులు కూడా స్వామికి భూరి విరాళాలు సమర్పించారు. పల్లవ రాణి సామవై పెరిందేవి భోగ శ్రీనివాస మూర్తి వెండి విగ్రహాన్ని, భూములను విరాళంగా ఇచ్చారు. చోళ, పాండ్య రాజులు ఆనంద నిలయ విమానానికి బంగారు తాపడం చేయించారు. మైసూరు సంస్థానాధీశులు అమూల్యమైన ఆభరణాలను సమర్పించగా, హైదరాబాద్ 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఏటా ఎనిమిది వేల రూపాయలు వంతున ఆలయ నిర్వహణకు విరాళం అందించారు. 1843 నుండి 1933 వరకు ఆలయ బాధ్యతలు నిర్వహించిన హథీరాంజీ మఠం మహంతులు ఆలయ అభివృద్ధికి ఎన్నో కానుకలు సమర్పించారు.

భక్తి ప్రపత్తులతో :

ఆధునిక కాలంలో టీటీడీకి భక్తులు హుండీ ద్వారానే కాకుండా అన్నప్రసాదం, ప్రాణదాన, బర్డ్, గోసంరక్షణ వంటి ట్రస్టులకు భారీగా విరాళాలు అందిస్తున్నారు. దీంతో ప్రస్తుతం టీటీడీ వద్ద 11,300 కిలోలకు పైగా బంగారు నిల్వలు, అలాగే 19 వేల కోట్లకు పైగా ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నాయి. సగటున ప్రతి నెలా హుండీ ద్వారా 100 కోట్ల రూపాయల నుండి 130 కోట్ల రూపాయల నగదు 100 కిలోలకు పైగా బంగారం శ్రీవారికి కానుకలుగా అందుతోంది.

Tags:    
  • tirumala 
  • tirupati 
  • lordvenkateswara 
  • ttd 
  • golddonation 

Similar News

ఆమెను త‌ట్టుకోలేమ‌బ్బా.. చెవిరెడ్డికి సుధ సంక‌టం.. !

2026-11-09 19:13 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

స్పెసిఫైడ్ అథారిటీకి టీటీడీ...కొత్త బోర్డు అప్పుడే ?

2026-11-02 18:27 GMT

టీటీడీ చైర్మ‌న్‌ రేసులో ఎన్నారై.. బాబు అవ‌కాశం ఇస్తారా.. ?

2026-10-31 17:30 GMT

పనబాక కుమార్తెకు కీలక పదవి.. టీడీపీ అధిష్టానం సంకేతాలు

2026-10-30 13:30 GMT

టీటీడీ చైర్మన్ రేస్ : బిగ్ ట్విస్ట్ ఇస్తారా? బీఆర్ నాయుడు రిటైర్మెంట్, కళా వర్సెస్ జ్యోతుల నెహ్రూ

2026-10-30 09:15 GMT

'తిరుప‌తి' మేయ‌ర్ పీఠం అంత ఈజీకాదా ..!

2026-10-21 14:30 GMT

రూ.4.75 కోట్ల రోడ్డును ట్రాక్టర్ తో వైసీపీ నేతలు దున్నేశారు.. పవన్ సంచలన నిర్ణయం

2026-10-19 17:01 GMT

తిరుమ‌ల క‌ల్తీ నెయ్యి కేసు: 130 కోట్ల ఆస్తులు ఎటాచ్‌.. బాధ్యుల సంగతేంటి?

2026-10-14 18:30 GMT

మనవడి కేశఖండన.. గొప్ప మనసు చాటుకున్న నాగబాబు!

2026-10-03 04:43 GMT

పాస్‌వర్డ్ మనది.. పని ‘ఏఐ’ది.. తిరుమల బుకింగ్ ప్రయత్నం లేవనెత్తిన కొత్త ప్రశ్నలు

2026-09-29 15:48 GMT

Copyright @2026

Powered by Blink CMS