• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  జగన్ దూరం.. విజయమ్మ...

జగన్ దూరం.. విజయమ్మ ఆశీస్సులతో ముగిసిన అంజలీ రెడ్డి వివాహం!

| వైఎస్ షర్మిల కుమార్తె అంజలీరెడ్డి, సోమల రఘురామ్ రెడ్డి వివాహం బెంగళూరు సమీపంలోని నంది హిల్స్ రిసార్ట్‌లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య జరిగింది. యలహంక ప్యాలెస్ వివాదాల నేపథ్యంలో వేదిక మార్చిన షర్మిల, పెళ్లి ఫొటోలను ఎక్స్‌లో పంచుకుంటూ నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. వచ్చే నెలలో హైదరాబాద్‌లో రిసెప్షన్ నిర్వహించనున్నట్లు సమాచారం.

By - Tupaki Political Desk
Update: 2026-11-26 09:00 GMT

పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమార్తె వైఎస్ అంజిలీ రెడ్డి వివాహ వేడుక కన్నుల పండుగగా ముగిసింది. బెంగళూరు సమీపంలోని నంది హిల్స్ వద్ద ఒక రిసార్ట్‌లో అత్యంత ఆత్మీయుల మధ్య వివాహం జరిగినట్లు షర్మిల ట్విటర్ లో ప్రకటించారు. తన అధికారిక ఎక్స్ లో నూతన దంపతులు అంజలీరెడ్డి, సోమల రఘురామ్ రెడ్డి పెళ్లి ఫోటోలను పంచుకుంటూ భావోద్వేగపూరితమైన పోస్ట్ చేశారు.

 

"నాన్న వైఎస్ఆర్ దీవెనలతో, అమ్మ ఆశీస్సుల మధ్య, కుటుంబ సభ్యులు, ఆత్మీయుల సమక్షంలో నా బిడ్డ వైఎస్ అంజిలీ రెడ్డి - సోమల రఘురామ్ రెడ్డిల వివాహ వేడుక కన్నుల పండుగగా జరిగింది. కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన అంజిలీ, రఘులకు ఆ దేవుని శుభాశీస్సులు, తెలుగు ప్రజల ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, నూతన వధూవరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు!" అంటూ నూతన దంపతులను ఆశీర్వదించారు.

 

ఈ వివాహ వేడుకకు ముందు వైఎస్ కుటుంబంలో చోటుచేసుకున్న నాటకీయ పరిణామాలు, వివాదాలు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. తన కుమార్తె చిన్ననాటి నుంచి పెరిగిన బెంగళూరులోని యలహంక ప్యాలెస్‌లోనే పెళ్లి వేడుకను ఘనంగా నిర్వహించాలని షర్మిల తొలుత భావించారు. అయితే, ఆస్తి వివాదాలు, భద్రతాపరమైన కారణాలను చూపుతూ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్కడ వేడుకల నిర్వహణకు అభ్యంతరం వ్యక్తం చేశారు.

 

దీనికి తోడు, ఆ ప్రాంగణం తమ లీజులో ఉందంటూ ఓ సంస్థ కోర్టును ఆశ్రయించడంతో, షర్మిల గానీ ఆమె తరఫు వారు గానీ యలహంక ప్యాలెస్‌లోకి ప్రవేశించకుండా న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

 

ఈ క్రమంలో పెళ్లి పనుల నిమిత్తం బెంగళూరు చేరుకున్న షర్మిలను పోలీసులు అడ్డుకోవడం కూడా పెద్ద దుమారాన్ని రేపింది.

 

వరుస వివాదాలు, కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, వివాదాలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో కుమార్తె వివాహాన్ని జరిపించాలని షర్మిల దంపతులు నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే యలహంక ప్యాలెస్ ఆలోచనను విరమించుకుని, నంది హిల్స్ సమీపంలోని ప్రైవేట్ రిసార్ట్‌ను వేదికగా ఎంచుకున్నారు.

 

రాజకీయ హడావుడికి దూరంగా, కేవలం ఇరు కుటుంబాల సభ్యులు, అత్యంత సన్నిహితులైన సుమారు వంద మంది అతిథుల సమక్షంలోనే బుధవారం సాయంత్రం క్రైస్తవ సంప్రదాయ పద్ధతిలో, అనంతరం హిందూ సంప్రదాయంలో ఈ వివాహ తంతును నిరాడంబరంగా పూర్తి చేశారు.

 

అంజలీరెడ్డి వివాహ వేడుకకు వైఎస్ విజయమ్మ, ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు. షర్మిల అన్నయ్య, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహా ఆయన సన్నిహిత వర్గం ఈ వివాహానికి దూరంగా ఉండటం గమనార్హం. గతంలో షర్మిల కుమారుడు రాజా రెడ్డి వివాహం రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ కోటలో అత్యంత వైభవంగా జరగగా, అంజిలీ రెడ్డి వివాహం మాత్రం నిరాడంబరంగా ముగిసింది.

 

అయితే, రాజకీయ, సినీ, వ్యాపార రంగాల ప్రముఖుల కోసం వచ్చే నెలలో హైదరాబాద్‌లో భారీ స్థాయిలో వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

Tags:    
  • yssharmila 
  • anjilireddy 
  • ysfamily 
  • weddingnews 

Similar News

తిరుమలేశుడికి 121 కేజీల బంగారం ఇచ్చింది ఎవరో తెలుసా? ఎందుకిచ్చాడంటే?

2026-11-26 09:03 GMT

చిన్నారులకు కడుపునొప్పి వస్తే వాతలా? ప్రాణాలకే ముప్పు తెచ్చే మూఢనమ్మకాలు!

2026-11-26 08:58 GMT

కూటమిలో జనసేన పంచాయితీ.. సేనాని పవర్ ఫుల్ వ్యూహమేనా?

2026-11-26 08:57 GMT

ఇరాన్‌తో మళ్లీ యుద్ధం తప్పదా?.. ఇజ్రాయెల్ జ్యోతిష్యుల సంచలన అంచనాలు!

2026-11-26 08:55 GMT

అమెరికా పిల్లలకు SpaceX షేర్లు ఇవ్వనున్న ఎలాన్ మస్క్.. ఎప్పటి నుంచి అంటే?

2026-11-26 08:52 GMT

చేతిలో డిగ్రీలు.. ఉద్యోగం కోసం రోడ్లపై.. బీటెక్ బతుకులు దుర్భరం.. ఇంటర్వ్యూ కోసం కిలోమీటర్ల క్యూ

2026-11-26 08:51 GMT

అంతరిక్షాన్ని ఆక్రమించేస్తున్నావా మస్క్ మావా..

2026-11-26 08:44 GMT

కారు నాది.. పెట్రోల్ నాది.. రోడ్డుపై వెళ్లాలంటే ట్యాక్స్ కట్టాలా? హైదరాబాద్‌లో కొత్త ట్రాఫిక్ రూల్‌పై నెటిజన్ల సెటైర్లు

2026-11-26 05:47 GMT

ఎవరీ జగన్ మోహన్... విజయసాయి నోట అదే పిలుపు !

2026-11-26 05:38 GMT

పెట్రోల్ బంకా.. ఇన్సూరెన్స్ ఆఫీసా? పెట్రోల్ పోయరా? ఇదేందయ్యా సామీ

2026-11-26 05:17 GMT

ఆక్స్ఫర్డ్‌లో భారతీయ విద్యార్థినికి అవమానం.. పెర్ఫ్యూమ్ వాసనపై మహిళ కామెంట్!

2026-11-26 04:25 GMT

Copyright @2026

Powered by Blink CMS