• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఆక్స్ఫర్డ్‌లో భారతీయ...

ఆక్స్ఫర్డ్‌లో భారతీయ విద్యార్థినికి అవమానం.. పెర్ఫ్యూమ్ వాసనపై మహిళ కామెంట్!

| ఆక్స్‌ఫర్డ్‌లో పీహెచ్‌డీ చేస్తున్న భారతీయ విద్యార్థిని కామాక్షికి బ్రిటన్‌లో చేదు అనుభవం ఎదురైంది. షాపింగ్ సమయంలో ఓ మహిళ తన నుంచి దుర్వాసన వస్తోందని కామెంట్ చేయడంతో తీవ్రంగా బాధపడినట్లు ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో వెల్లడించింది. అయితే ఇతరుల మాటల కోసం భారతీయ దుస్తులు, బొట్టు, జుంకాలు, తనకు ఇష్టమైన పెర్ఫ్యూమ్ వాడటం మానుకోనని స్పష్టం చేసింది.

By - Tupaki Desk
Update: 2026-11-26 04:25 GMT

షాపింగ్‌కు వెళ్లినప్పుడు ఓ మహిళ చేసిన కామెంట్ తనను ఎంతగానో బాధించిందని ఆక్స్ఫర్డ్‌లో పీహెచ్‌డీ చేస్తున్న భారతీయ విద్యార్థిని కామాక్షి చెప్పింది. తనకు ఎదురైన ఈ అనుభవాన్ని నవంబర్ 21న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోలో వివరించింది.

ఓ స్టోర్‌లో షాపింగ్ చేస్తున్న సమయంలో తెల్లజాతి మహిళ ఒకరు తన చుట్టూ తిరుగుతూ కనిపించారని కామాక్షి తెలిపింది. కొద్దిసేపటి తర్వాత ఆమె దగ్గరకు వచ్చి.. 'నీ నుంచి చాలా దుర్వాసన వస్తోంది' అని చెప్పిందట. ఆ మాట విని ఏం సమాధానం చెప్పాలో కూడా తెలియక అక్కడే ఉండిపోయానని కామాక్షి వివరించింది. ఆ మహిళ మాట్లాడి వెళ్లిపోయేలోపే తాను తేరుకోలేకపోయానని చెప్పింది.

ఆ రోజు తాను వేసుకున్న పెర్ఫ్యూమ్ తన తండ్రికి ఎంతో ఇష్టమైనదని కామాక్షి గుర్తుచేసుకుంది. అలాంటి సువాసన గురించి ఒకరు అలా మాట్లాడటంతో బాధ కలిగిందని చెప్పింది. ఆ సంఘటన తర్వాత మిగతా రోజంతా అందరి దృష్టిలో పడకుండా ఉండాలని ప్రయత్నించినట్లు వెల్లడించింది.

బ్రిటన్‌లో ఇలాంటి అనుభవం తనకు కొత్తేమీ కాదని కూడా ఆమె చెప్పింది. వీధుల్లో ఎదురయ్యే చిన్నచిన్న అవమానాల నుంచి కొన్ని సంస్థల్లో కనిపించే వివక్ష వరకు ఎన్నో విషయాలను ప్రస్తావించింది.

కానీ ఒకరి మాటల కోసం తన అలవాట్లను మార్చుకోనని కామాక్షి స్పష్టం చేసింది. భారతీయ దుస్తులు ధరిస్తానని, జుంకాలు, బొట్టు పెట్టుకుంటానని, అదే పెర్ఫ్యూమ్ వాడతానని చెప్పింది.

Tags:    
  • oxfordstudent 
  • indiansintheuk 
  • kamakshi 
  • racism 

Similar News

అమెరికాలో పుట్టిన పిల్లలకు పౌరసత్వం.. ట్రంప్ కొత్త ఆదేశాలనూ అడ్డుకున్న కోర్టు!

2026-11-26 03:54 GMT

వాడేసిన టైర్లతో కాలుష్యం.. వాటితో చెప్పులు తయారు చేస్తున్న స్టార్టప్

2026-11-26 03:54 GMT

భారత్, పాక్ క్రికెటర్ల తీరుపై హర్భజన్ ఫైర్.. ఐసీసీకి కీలక సూచన!

2026-11-26 03:53 GMT

అమెరికాలో OPT పేరుతో మోసాలు.. F-1 విద్యార్థులను టార్గెట్ చేస్తున్న కన్సల్టెన్సీలు!

2026-11-26 03:52 GMT

లోకేష్ మమేకం.. ఇతర పార్టీలూ నేర్చాల్సిందే !

2026-11-26 03:50 GMT

విశాఖ మేయర్...వెరీ పవర్ ఫుల్ !

2026-11-26 03:50 GMT

ఢిల్లీకి ఫిర్యాదు...ఏపీ బీజేపీ నేతల వ్యూహం

2026-11-26 03:49 GMT

ఎందుకు ధిక్కరించానో పవన్ కే చెబుతా !

2026-11-26 03:44 GMT

కారం పొడితో పోలింగ్ బూత్‌లకు ....ఇదేమి పోరాటం వైసీపీ నాయకా ?

2026-11-26 03:43 GMT

యలహంక ఆస్తుల వివాదం.....విజయసాయి హాట్ కామెంట్స్

2026-11-25 17:55 GMT

రైలు 'లేట్' అయితే ఏంటి? జర్మనీ కంటే 'గ్రేట్' అంటున్నారుగా..

2026-11-25 17:55 GMT

Copyright @2026

Powered by Blink CMS