• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పాము కాటుకు ఇకపై ఇంటిలోనే...

పాము కాటుకు ఇకపై ఇంటిలోనే చికిత్స.. అద్భుతమైన క్యాప్సూల్‌ కనిపెట్టిన శాస్త్రవేత్తలు!

| అయితే, కెన్యాలో జరిగిన ఒక అద్భుతమైన పరిశోధన ఇప్పుడు దీనికి పరిష్కారం చూపనుంది.

By - Tupaki Desk
Update: 2025-04-28 04:23 GMT

భారతదేశంలో ప్రతేడాది విషపూరితమైన పాము కాటుకు గురై లక్షా 40 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వీరిలో చాలా మందికి సరైన సమయంలో వైద్యం అందకపోవడమే ప్రధాన కారణం. అయితే, కెన్యాలో జరిగిన ఒక అద్భుతమైన పరిశోధన ఇప్పుడు దీనికి పరిష్కారం చూపనుంది. శాస్త్రవేత్తలు ఇకపై ఇంట్లోనే సులభంగా పాము విషాన్ని శరీరం నుంచి తొలగించవచ్చని చెబుతున్నారు. ప్రస్తుతం భారతదేశంలో పాము కాటుకు యాంటీవెనమ్ ఉపయోగిస్తున్నారు. కాకపోతే దీనిని ఇంజెక్షన్ రూపంలో ఇస్తారు. కానీ తాజాగా శాస్ట్రవేత్తలు కనిపెట్టిన కొత్త పద్ధతిలో ఇంజెక్షన్ చేసుకోవాల్సిన అవసరం లేదు.

'ఈ-బయోమెడిసిన్' జర్నల్‌లో ప్రచురితమైన ఒక నివేదికలో.. పరిశోధకులు యూనిథియోల్ అనే ఔషధం పాము విషాన్ని నిర్వీర్యం చేయగలదని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఈ ఔషధాన్ని లోహ విషపూరితం (మెటల్ పాయిజనింగ్) చికిత్స కోసం మాత్రమే ఉపయోగిస్తున్నారు. పాముల విషంలో మెటల్లోప్రోటీనేజ్ ఎంజైమ్ ఉంటుందని, ఇది కణాలను దెబ్బతీస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ ఎంజైమ్‌కు పనిచేయడానికి జింక్ అవసరం.. దానిని అది శరీరం నుండి గ్రహిస్తుంది. యూనిథియోల్ జింక్‌ను దారి మళ్లిస్తుంది. తద్వారా విషం వ్యాప్తి చెందకుండా నిరోధిస్తుంది. ఈ ఔషధాన్ని నీటితో కూడా తీసుకోవచ్చని, దీనిని నిల్వ చేయడానికి సాధారణ ఉష్ణోగ్రత సరిపోతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. అంటే ఇది క్యాప్సూల్ రూపంలో అందుబాటులోకి రావచ్చు.

ఇంతకు ముందు పాము విషాన్ని నిర్వీర్యం చేయడానికి తయారుచేసిన మందులన్నింటినీ నిల్వ చేయడానికి నిర్దిష్ట ఉష్ణోగ్రత అవసరం. ఇది మారుమూల గ్రామాల్లో సాధ్యం కాదు. ఈ కారణంగానే గ్రామాల్లో పాము కాటుకు ఎక్కువ మంది మరణిస్తున్నారు. కెన్యాలో 64 మందిపై ఈ ఔషధం ప్రయోగం విజయవంతంగా నిర్వహించబడినట్లు పరిశోధకులు తెలిపారు. ఈ 64 మంది పాము కాటుకు గురైన తర్వాత యూనిథియోల్‌ను ఉపయోగించారు. వారందరూ త్వరగా కోలుకున్నారు. వారిలో పాము విషం ప్రభావం కనిపించలేదు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ ఔషధాన్ని ఉపయోగించడానికి వైద్య నిపుణుల సహాయం కూడా అవసరం లేదు. అంతేకాకుండా, తక్కువ, ఎక్కువ విషపూరితమైన పాములు కాటు వేసిన తర్వాత కూడా ఈ ఔషధాన్ని ఉపయోగించవచ్చు. ఈ పరిశోధన లక్షలాది మంది ప్రాణాలను కాపాడే ఒక గొప్ప ఔషధంగా పేర్కొవచ్చు.

Tags:    
  • SnakeBiteTreatment 
  • unithiol 
  • SnakeVenom 
  • MedicalBreakthrough 
  • SnakebiteIndia 
  • LifeSavingResearch 
  • EBioMedicine 
  • KenyaResearch 
  • Antivenom 
  • Alternative 
  • Healthcare 
  • PublicHealth 

Similar News

ఎమ్మెల్యే విందు.. గాల్లో ఎగిరిన ప్లేట్లు.. కరెంట్ టవర్లపై వేలాడిన మనుషులు..

2026-11-26 10:20 GMT

టీడీపీ కార్యకర్తల సంక్షేమానికి భారీ మొత్తం.. గ్రూప్ ఇన్సూరెన్స్ కే 191 శాతం నిధులు!

2026-11-26 10:19 GMT

ఫిట్‌గా ఉంటేనే లిక్కర్.. వైన్ షాపు ముందు మెడికల్ క్యాంప్.. మందుబాబులకు ఊహించని షాక్

2026-11-26 10:17 GMT

యూపీలో ఇండి కూటమికి అసలు పరీక్ష: 130 సీట్లపై కాంగ్రెస్ పట్టు.. గెలుపు గుర్రాలకే టికెట్లంటున్న అఖిలేశ్!

2026-11-26 10:14 GMT

తిరుమలేశుడికి 121 కేజీల బంగారం ఇచ్చింది ఎవరో తెలుసా? ఎందుకిచ్చాడంటే?

2026-11-26 09:03 GMT

జగన్ దూరం.. విజయమ్మ ఆశీస్సులతో ముగిసిన అంజలీ రెడ్డి వివాహం!

2026-11-26 09:00 GMT

చిన్నారులకు కడుపునొప్పి వస్తే వాతలా? ప్రాణాలకే ముప్పు తెచ్చే మూఢనమ్మకాలు!

2026-11-26 08:58 GMT

కూటమిలో జనసేన పంచాయితీ.. సేనాని పవర్ ఫుల్ వ్యూహమేనా?

2026-11-26 08:57 GMT

ఇరాన్‌తో మళ్లీ యుద్ధం తప్పదా?.. ఇజ్రాయెల్ జ్యోతిష్యుల సంచలన అంచనాలు!

2026-11-26 08:55 GMT

అమెరికా పిల్లలకు SpaceX షేర్లు ఇవ్వనున్న ఎలాన్ మస్క్.. ఎప్పటి నుంచి అంటే?

2026-11-26 08:52 GMT

చేతిలో డిగ్రీలు.. ఉద్యోగం కోసం రోడ్లపై.. బీటెక్ బతుకులు దుర్భరం.. ఇంటర్వ్యూ కోసం కిలోమీటర్ల క్యూ

2026-11-26 08:51 GMT

అంతరిక్షాన్ని ఆక్రమించేస్తున్నావా మస్క్ మావా..

2026-11-26 08:44 GMT

Copyright @2026

Powered by Blink CMS