• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  అతడి రక్తం నుంచి పాము...

అతడి రక్తం నుంచి పాము విషానికి విరుగుడు.. అదెలా?

| వినేందుకే ఒళ్లు జలదరించే ఉదంతాలు.. వాస్తవాలన్న విషయాన్ని నమ్మేందుకు కాస్త కష్టమవుతుంటుంది.

By - Tupaki Desk
Update: 2025-05-04 12:30 GMT

వినేందుకే ఒళ్లు జలదరించే ఉదంతాలు.. వాస్తవాలన్న విషయాన్ని నమ్మేందుకు కాస్త కష్టమవుతుంటుంది. ఇప్పుడు చెప్పే వ్యక్తికి సంబంధించిన వివరాలు కూడా ఆ కోవకే వస్తాయి. వందల సంఖ్యలో పాముకాట్లతోనూ.. పాము విషాన్ని క్రమపద్దతిలో ఎక్కించుకున్న ఒక వ్యక్తి రక్తం నుంచి అమెరికా వైద్యులు విషానికి విరుగుడును డెవలప్ చేశారు. విన్నంతనే నమ్మశక్యంగా అనిపించని రీతిలో ఉండే ఈ వ్యక్తి పేరు తిమోతీ ఫ్రీడ్. ఇతడు అమెరికాలోని విస్కాన్సిన్ లో ఉంటారు.

ఇతడికి విష సర్పాలు అంటే ఆసక్తి ఎక్కువ. తన ఇంట్లో పదుల సంఖ్యలో పాముల్ని పెంచుకుంటూ ఉంటాడు. ఒకవేళ.. పొరపాటున పాములు కాటు వేస్తే.. ఆ విషంతో తనకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు వీలుగా.. తక్కువ మోతాదులో పాము విషాన్ని శరీరంలోకి ఎక్కించుకునేవాడు. నెమ్మది నెమ్మదిగా డోసు పెంచాడు. ఆ తర్వాతి కాలంలో పాముల చేత కాటు వేయించుకునేవాడు.

అతనికి ఏమీ అయ్యేది కాదు. మొదట్లో ఇలా చేయటం షురూ చేసినప్పుడు కాస్తంత టెన్షన్ పడిన వాస్తవమేనంటూ అంగీకరిస్తారు తిమోతి. తర్వాతి దశల్లో పాము చేత కాటు వేయించుకోవటం.. విషాన్ని ఒంట్లోకి ఎక్కించుకోవటం పెద్ద విషయంగా అతనికి ఉండేది కాదు. ఈ తరహా పనుల్ని పదుల సంఖ్యలో కాదు వందల సంఖ్యలో చేసుకోవటం మరింత షాకింగ్ అంశం.

18 ఏళ్ల వ్యవధిలో ఏకంగా 856 సార్లు పాముకాటు వేయించుకోవటమో.. పాము విషాన్ని ఒంట్లోకి ఎక్కించుకోవటమో చేశాడు. ఇందులో పదహారు రకాల డేంజర్ జాతులకు చెందిన పాముల విషాలు ఉన్నాయి. ఇతనికి ఉన్న ప్రత్యేక అలవాటు కారణంగా ఇతడి శరీరంలో పాము విషాన్ని సమర్థంగా ఎదుర్కొనే యాంటీబాడీలు తయారయ్యాయి. దీంతో.. ఇతగాడి గురించి తెలిసిన పరిశోధకులు.. ఇతడి రక్తాన్ని సేకరించి.. పరిశోధనలు చేశారు.

వీరి పరిశోధనల్లో తేలిందేమంటే.. అనేక రకాల పాముల విషాన్ని ఇతడి బాడీ సమర్థంగా ఎదుర్కొంటుందన్న విషయాన్ని గుర్తించారు. ఇతడు దానం ఇచ్చిన రక్తంతో సెంటీవ్యాక్స్ అనే టీకా తయారీ సంస్థ.. పాము విషానికి విరుగుడైన యాంటీ వెనమ్ ను తయారు చేసింది. దీన్ని పరీక్షించేందుకు శాస్త్రవేత్తలు ఎలుకలపై పరీక్షలు జరిపారు.

మాంబాలు.. కోబ్రాలు.. కట్ల పాములతో సహా ప్రపంచంలోని దాదాపు సగం పాము జాతులకు విషాలకు సంబంధించినవి ఎలుకలకు ఎక్కించి.. అనంతరం తిమోతీ రక్తంతో తయారు చేసిన యాంటీ బాడీలను ఎలుకలకు ఇచ్చారు. ఈ క్రమంలో పాము విషాన్ని.. తిమోతీ యాంటీ బాడీలు నిర్వీర్యం చేయటాన్ని గుర్తించారు. ఇలా అన్ని రకాల విషాలను నిర్వీర్యం చేసే యాంటీబాడీల మిశ్రమాన్నిశాస్త్రవేత్తలు డెవలప్ చేశారు. అయితే.. దీన్ని మనుసులపై ప్రయోగించటానికి కొన్నేళ్లు పడుతుందని చెబుతున్నారు. ఎలుకలపై జరిపిన ఈ పరీక్షలు తర్వాతి కాలంలో కుక్కలపై పరీక్షిస్తారు.

ఇప్పటివరకు పాము విషానికి విరుగుడు యాంటీ బాడీలను గుర్రాలు.. గొర్రెల నుంచి తయారు చేసేవారు. పాము విషాన్ని వీటిల్లోకి ఎక్కించి.. వాటి బాడీలో తయారయ్యే యాంటీ బాడీలను సేకరించి మందులు తయారు చేసేవారు. ఇప్పటివరకు ఇదే పాము విషానికి విరుగుడుగా భావించేవారు. అయితే.. ఈ తరహా యాంటీ వెనమ్ బాధితులకు కొన్నిసార్లు దుష్ఫలితాలు ఇచ్చే ప్రమాదం ఉంది. తిమోతీ రక్తంతో తయారు చేసిన యాంటీ బాడీలు ఈ సమస్యకు పరిష్కారంగా భావిస్తున్నారు. అయితే.. ఈ పరిశోధనలు తుదిరూపునకు చేరుకోవటానికి కొన్నేళ్లు పడుతుందని చెబుతున్నారు.

Tags:    
  • TimFriede 
  • SnakeVenom 
  • AntiVenom 
  • MedicalBreakthrough 
  • SnakeBiteTreatment 
  • AntiVenomHuman 
  • TimFriedeBlood 

Similar News

ఎమ్మెల్యే విందు.. గాల్లో ఎగిరిన ప్లేట్లు.. కరెంట్ టవర్లపై వేలాడిన మనుషులు..

2026-11-26 10:20 GMT

టీడీపీ కార్యకర్తల సంక్షేమానికి భారీ మొత్తం.. గ్రూప్ ఇన్సూరెన్స్ కే 191 శాతం నిధులు!

2026-11-26 10:19 GMT

ఫిట్‌గా ఉంటేనే లిక్కర్.. వైన్ షాపు ముందు మెడికల్ క్యాంప్.. మందుబాబులకు ఊహించని షాక్

2026-11-26 10:17 GMT

యూపీలో ఇండి కూటమికి అసలు పరీక్ష: 130 సీట్లపై కాంగ్రెస్ పట్టు.. గెలుపు గుర్రాలకే టికెట్లంటున్న అఖిలేశ్!

2026-11-26 10:14 GMT

తిరుమలేశుడికి 121 కేజీల బంగారం ఇచ్చింది ఎవరో తెలుసా? ఎందుకిచ్చాడంటే?

2026-11-26 09:03 GMT

జగన్ దూరం.. విజయమ్మ ఆశీస్సులతో ముగిసిన అంజలీ రెడ్డి వివాహం!

2026-11-26 09:00 GMT

చిన్నారులకు కడుపునొప్పి వస్తే వాతలా? ప్రాణాలకే ముప్పు తెచ్చే మూఢనమ్మకాలు!

2026-11-26 08:58 GMT

కూటమిలో జనసేన పంచాయితీ.. సేనాని పవర్ ఫుల్ వ్యూహమేనా?

2026-11-26 08:57 GMT

ఇరాన్‌తో మళ్లీ యుద్ధం తప్పదా?.. ఇజ్రాయెల్ జ్యోతిష్యుల సంచలన అంచనాలు!

2026-11-26 08:55 GMT

అమెరికా పిల్లలకు SpaceX షేర్లు ఇవ్వనున్న ఎలాన్ మస్క్.. ఎప్పటి నుంచి అంటే?

2026-11-26 08:52 GMT

చేతిలో డిగ్రీలు.. ఉద్యోగం కోసం రోడ్లపై.. బీటెక్ బతుకులు దుర్భరం.. ఇంటర్వ్యూ కోసం కిలోమీటర్ల క్యూ

2026-11-26 08:51 GMT

అంతరిక్షాన్ని ఆక్రమించేస్తున్నావా మస్క్ మావా..

2026-11-26 08:44 GMT

Copyright @2026

Powered by Blink CMS